Monday, June 26, 2017
పంచభూతములు
Sunday, June 25, 2017
పంచారామాలు
పంచారామామములు.
1.అమరారామము
సీ:దేవతలకు నెల్ల దివ్యధామంబైన
పుణ్యస్థలంబిది పుడమియందు
అమరేశ్వరునిగాను నమరుల చేతను
వందనంబులు గొనుభద్రమూర్తి
పాండురాజు సుతుడు బాణంబు తోనాడు
గొట్టంగ నయ్యెనో గుంట యపుడు
చైత్రశుద్ధమునందు సతిపతులకిచట
బ్రహ్మోత్సవాలను వాసిగాను
ఆ.వె:జరుపుచుందురిపుడు జగతి యందు గనుము
ఆది దంపతులకు నాచరింత్రు
పౌర్ణమి దినమందు బ్రహ్మానందముతోడ
అమ్మనయ్యను గని హాయి గనుడు.
2.సోమారామము
సీ: సోమేశ్వరుండన శుభములొసగి తోడ
విజయమొసగుచుండు వేగ శివుడు
శ్వేతవర్ణమునందు శివలింగమును గన
వింతయనుభవమ్ము వెలికి వచ్చు
తెలుపు రంగున యున్న తెల్లని లింగము
రంగుమారుచునుండు రమ్యముగను
పౌర్ణమి దినమందు పాలధారల వోలె
వెలిగేను యీస్వామి వింతగాను
ఆ.వె:చంద్రకళల తోడ చక్కగా వెలిగేటి
సోమరామ మిదియె చూడరండు
అమవస నిశి నాడు యగుపించు నీస్వామి
బూది రంగులోను గనుము భూరి గాను.
3.క్షీరారామము:
సీ:పాలకొలను యందు పరమేశ్వరుని రామ
చంద్రుండు స్థాపించె జాయతోడ
క్షేత్రపాలకుడిగా శ్రీ మహా విష్ణువే
శ్రీలక్ష్మితో గూడి స్థిరము గాను
జనుల కోర్కెల దీర్చ చక్కగా వెలసిన
యారామ మిదె యందు రవని లోన
సకల పాపహరమౌ చక్కని కొలనును
చక్రంబు తోడ నాస్వామి చేసె
ఆ.వె: నదియె రామగుండ మనెడి పుష్కరణయ్యె ఆయనమ్ములందు నాలయాన
పర్వకాలమందు భానుని కిరణాలు
పర్వు చుండు నంట భవుని పైన.
4.ద్రాక్షారామము
సీ:సూర్యదేవుని చేత శోభాయ కరముగ
నభిషిక్త మైనదీ యాలయంబు
దక్షిణకాశిగ దలచేరు జనములు
భక్తిప్రపత్తుల పరవశించి
భోగము నొసగేటి భూరిలింగంబని
వేనోళ్ళ భక్తులు విడిదిచేసి
మ్రొక్కులు దీర్చుచు ముడుపులు చెల్లించి
కొలిచి తరింతురు కూర్మి తోడ
ఆ.వె:వేపచెట్టు నీడ వేడుకతో విష్ణు
రావి చెట్టునీడ రహిని శివుడు
వెలసి భక్తజనుల విన్నపాలు వినుచు
నార్తి బాపు దురట ననవరతము.
5.కుమారారామము:
సీ:అసుర సంహరణకై నద్రిజా తనయుండు
ఛేదించె నచ్చోట శివుని లింగ
మానాడు,దుర్భర యఘమును బాపుట
కొరకటంచును తాను కూర్మితోడ
గట్టించె,నెన్నెన్నొ గమ్మత్తు లిచ్చో,వి
శేషంబులు గలవు శివుని పాద
ములనుసూర్యకిరణములె మున్ను తాకంగ
సంజవే ళలయందు సతిని తాకు
ఆ.వె:పార్వతమ్మ యిచట బాలత్రిపురసుంద
రనెడి పేరు తోడ నాదరించు
దయను చూపి శివుడు దండిగ వరములన్
యొసగి కాచుచుండు నుర్వి యందు.
కాటేపల్లి వారి ప్రశంస
(మీ హృదయారామము స
త్సాహిత్యాదర్శము హరతత్త్వము నిడు నా
యూహాతీతుని లీలల
నీహలు లయమందు ననుచు నీ పద్యములే ! )
Monday, June 5, 2017
వృక్షసంపద
హరిత కవితకొరకు పద్యములు.
1.ఆ.వె: చెట్లు నాటుచుండ చేదోడు నీకగు
నీరు పోసి పెంచ నీడ నొసగు
పండ్లు పూల తోడ పరిఢవిల్లుచు నుండి
హరిత హారమగును తరుల పూలు
2.ఆ.వె:మొక్క నొకటి నాటు మురిపెముతో పెంచు
నీడ నొసగి నీకు తోడు నగును
మూలమందు నీరు మురిపెముతో పోయ
తలను వంచి యొసగు ఫలము నీకు.
3.ఆ.వె:పచ్చనైన చెట్లు బాటకిరుగడల
నాటుమయ్య పుత్ర నీటుగాను
బాటసారులకది బాసటగా నుండి
హరితమయము లగుచు హర్షమొసగు.
4.ఆ.వె:తరువు నొకటి నాటు తరతరములకును
బతుకు తెరువు చూపి బాధ తీర్చు
పచ్చనైన చెట్టు పసిడి కాంతుల తోడ
పరవశింప జేసి ఫలము లొసగు
5.ఆ.వె:పచ్చనైన చెట్లు భారతావనికొసగు
నంతులేని సిరుల ననవరతము
అగ్రదేశములకును నాదర్శ మగునట్లు
పెంచవయ్య తరులు ప్రీతి తోడ.
6.ఆ.వె:హరిత భరిత మైన తరుసమూహములెల్ల
యేపుగాను పెరుగ నింపుతోడ
ప్రకృతి కాంత మనము పరవశమొందగా
హర్ష చిత్తులౌదు రవని జనులు
7.ఆ.వె:జగతి లోని జనులు సద్భావనము తోడ
చేయి చేయి కలిపి చెట్లు నాట
హరిత వనము వోలె నలరారు దేశమ్ము
పుడమి తల్లి తాను పులకరించు.
8.ఆ.వె:భావి తరములందు ప్రజల కుపకరించు
తరులు పెంచ బ్రతుకు ధన్యమగును
సేద తీర్చునట్టి చెట్లను గాంచుచు
ముగ్ధులగుచు వారు మెత్తురయ్య.
9.ఆ.వె:వృక్షసంపదున్న రేడువు నీవౌదు
లేమి యన్న మాట లేనె లేదు
ఆంధ్ర దేశమన్న నన్నపూర్ణ యనెడి
ఖ్యాతి నంది నట్టి ప్రాంత మిదియె.
10.ఆ.వె:ఔషధోప యుక్త మైన వృక్షములను
విరివి గాను పెంచ విలువ పెరుగు
దేశమునకు ఖ్యాతి దేహమునకు మేలు
కలుగు చెట్లు పెంచి ఘనుడ వగుము..
Wednesday, May 31, 2017
.భగవద్గీత పద్యాలు
From: "Telugu Vedika" <teluguvedika.net@gmail.com>
Date: Mar 1, 2017 1:30 PM
Subject: Re: నమస్తే అండీ.భగవద్గీత పద్యాలు పంపుతున్నాను.పరిశీలించగలరు.పత్రికలో ప్రచురిస్తే లింక్ పంపగలరు.ధన్యవాదములండీ.
To: "Uma Devi Balluri" <uma.balluri@gmail.com>
Cc:
నమస్తే .శుభోదయమండీ.ఇవి ప్రచురించారా.పఅరచురించి యుంటే లింక్ పంపగలరు.On Dec 20, 2016 1:18 PM, "Uma Devi Balluri" <uma.balluri@gmail.com> wrote:Thank u sir.On Dec 20, 2016 12:25 PM, "Telugu Vedika" <teluguvedika.net@gmail.com> wrote:dhanyosmi madam2016-12-20 11:59 GMT+05:30 Uma Devi Balluri <uma.balluri@gmail.com>:నమస్తే అండీ ఈ భగవద్గీతపద్యాలన్నీ నాస్వీయరచనలే.On Dec 20, 2016 10:40 AM, "Telugu Vedika" <teluguvedika.net@gmail.com> wrote:వచ్చే నూతన సంవత్సర సంచికలో ప్రచురించ గలము.నమస్కారం ఉమా దేవి గారు,ఈ పద్యాలు మీరు స్వంతగా వ్రాసినవా? దయచేసి హామీ పత్రం పంపగలరు మీ ఫోటో తో సహా.--2016-12-16 16:19 GMT+05:30 Uma Devi Balluri <uma.balluri@gmail.com>:అంశం: భగవద్గీతఆ.వె:భారత రణమందు పాండుతనయునకుతెలిపె కృష్ణు డచట తెలుసుకొమ్మటంచు పదునెనిమిది యధ్యాయములతోడనున్న గీత నచట నొప్పు గాను.ఆ.వె:యుద్ధభూమిలోన యోధు లిద్దరు చేయుభాషణమ్మె నదియు భారతానభక్తి గ్రంథ మవగ పఠియింత్రు జనులెల్లముక్తి మార్గమనుచు ముదము తోడ.ఆ.వె:కామ రహితమైన కార్యాచరణమునమనసు శుద్ధి యౌను మహిని జూడనట్టి మనసె వలయు నాధ్యాత్మితకటంచుచక్కగాను గీత జగతి చాటె.ఆ.వె:భక్తియోగమనగ బ భావశుద్ధియెనంచువ్యక్తి పరము గాక భక్తి పూర్వకముగ తెలియ మనుచు ఘనుడైన యాశౌరిచేసె తత్త్వబోధ శీఘ్రము గను.ఆ.వె:శరణు జొచ్చు వారు సంతాపమందరుమూడు గుణములకును మోహితు లవకుండ దాట గలరు కూర్మితోడ భువినియనుచు దెల్పె శౌరి యర్జునునకు.ఆ.వె:జనన మరణ మాది సంసార సంద్రాననంతు గాన కీదు లాడు చుండిమాయ వశము చేత మలమూత్రములతోడనిండినట్టి తనువె నిజమటంచు.ఆ.వె:ధర్మ క్షేతఅరమిదియె కర్మభూమియు నిదేపోరు సలుప లేను పుడమి నిపుడుతోడబుట్టువులను దురమందు చంపుటపాడియౌనె దెల్పు పరమ పురుష.ఆ.వె:తనువు నదురు చుండె ధనువు జారుచు నుండెరణము చేయ లేను రథము నిలుపుమనుచు కోరినట్టి యర్జును తోడనువినుమటంచు పలికె వెన్ను డపుడు.ఆ.వె:చేయు వాడనిలను చేయించు వాడనునేనె పార్థ వినుము నీవు కాదుపనులు మాత్రమీవు పదిలముగ చేయుముఫలిత మొసగు వాడ పార్థ నేనే.ఆ.వె:మూఢ తనము నిపుడు ముందుగా వీడుముధైర్య మూను మయ్య ధరణియందుజయము నందు వేళ జడుపదేలనీకుభారమెల్ల మోపు పార్థ నీవు.ఆ.వె:నేను నాది యనున దేదియు నిలలేదునాది యనెడి దేది నీది కాదుదురభిమానము విడి తొడుగుము కవచమున్పోరు సలుప లెమ్ము పుడమియందు.ఆ.వె:పనులు చేయ వలెను భక్తి పూర్వకముగఫలిత మునుగురించి వాంఛ వలదుఆత్మకెపుడు నాశ మనునది లేదయ్యతనువు స్థిరము కాదు ధరణి యందు.ఆ.వె:కామ రహితమైన కార్యములను చేయనుద్భవించు జ్ఞాన ముర్వి యందుకామ క్రోధములవి కార్చిచ్చు వంటివికాల్చు చుండు నవియు కడకు నిన్ను.ఆ.వె:ధర్మ మునిటు నిల్ప దలచుచు కృష్ణుడుయుగయుగముల యందు యుత్సుకతనకుమతులనిల లోన కూల్చి వేయ దలచినవతరించుచుండు ననవరతము.ఆ.వె:గుణములందు సత్త్వ గుణము శ్రేష్టమటంచుతమము వీడి చూడు ధరణి యందువెలుగు కానవచ్చు వివ్వచ్చుడా యంచుశౌరి తెలియచేసె సంతసాన.ఆ.వె:ఆత్మ కాలబోదు అగ్నిలో నెపుడునునీరు తడుపలేదు నెపుడు దానివాయువార్పలేదు వసుధలో నాత్మనుశాశ్వతంబు నదియు జగతి యందు.ఆ.వె:జయము నపజయమును సమముగా గైకొన్నకర్మబంధము విడి ఘనుడ వౌదుమోహము విడ నీవు ముక్తుడౌదువటంచునచ్యుతుండు దెలిపె నాదరాన.ఆ.వె:కుతకమెక్కువైన కోరికల్ కలుగునుకోర్కె తీరకున్న క్రోధ మొదవుక్రోధ మధికమైన కువలయమందునపతనమది మొదలగు పార్థ వినుము.ఆ.వె:పరమ గోప్యమైన భగవంతు నుక్తినినాలకించి పల్కె నర్జునుండుమోహమెల్ల తొలగె మోహనకృష్ణుడానాచరింతు నయ్య నాహవమ్ము.కం:అష్టమ సుతుడై పుట్టుచుశిష్టుల కావంగ బోధ చేసెను గీతన్యిష్టముతో విని పార్థుడుతుష్టుండై పోరు సల్పె దురమున వడిగాన్.Ph:9493846984చిరునామ:Dr.B.Umadevi2-106,NandagokulaKAMAVARAM postKOWTHALAM MandalamAAS College postPIN:518302,------
... మీ తెలుగువేదికఎడిటర్ గారూ నమస్తే.భగవద్గీతపై నేను రచించిన ఈపద్యములు నాస్వంత రచనములు.ఇవి దేనికీ అనుకరణముకానీ అనుసరణముకాని కావని హామీపత్రమును జతపరచుచున్నాను.
--------
... మీ తెలుగువేదిక
--
... మీ తెలుగువేదిక
Saturday, May 20, 2017
భీమార్జునవిజయము
విరాటపర్వము:;కీీచకవధ:-
వేదవ్యాసుడు సంస్కృత భాషలో మహాభారతమును వ్రాశాడు .పంచమ వేదమనదగిన ఆ భారతమును కవిత్రయము అను పేరుతో ప్రసిద్ధిగాంచిన నన్నయ,తిక్కన,ఎఱ్ఱనలు తెలుగుభాషలో అనువదించారు.ఆదికవి నన్నయ ఆది,సభాపర్వాలు పూర్తిగానూ,అరణ్యపర్వంలో సగభాగం వరకు వ్రాశాడు.కవిబ్రహ్మగా బేరుగాంచిన తిక్కన విరాటపర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలుఅనువదించాడు.ప్రబంధపరమేశ్వరుడైన ఎఱ్ఱన అరణ్యపర్వ శేషాన్ని పూరించాడు.
తెలుగువారికి భారతమంటే చాలా ఇష్టం.ఎంత ఇష్టమంటే"వింటే భారతం వినాలి,తింటే గారెలే తినాలి"అనేంత ఇష్టం.
తిక్కన ప్రారంభించిన విరాటపర్వం హృదయోల్లాసం కల్గించేది.అనేక రసాలతో కూడుకొన్నది.విరాటపర్వ కథకు సంబంధించిన చిత్రపటాలను చూసి నప్పుడు నా మదిలో మెదలిన పద్యములివి.కీచకవధ,ఉత్తర గోగ్రహణ ఘట్టములు కథా వస్తువులైనవి.
పాండవులు కౌరవులతో జూదమాడి ఓటమి పాలౌతారు.పందెపు నియమానుసారము 12సంవత్సరములు అరణ్యవాసము,ఒక ఏడు అఙ్ఞాతవాసము చేయాలి.దానికి బద్ధులై పాండవులు అడవులకు వెళ్ళడంతో " కీచకవధ "కథ ప్రారంభ మౌతుంది.
ఆ.వె: శ్రీనివాసునకును సిరిదేవికిని మ్రొక్కి
వాక్కు నొసగు మనుచు వాణిఁవేడి
ఆది పూజితునకు నంజలి ఘటియించి
వ్రాయ బూని తేను బ్రాతి తోడ. : 1:
ఆ.వె:కపట జూదమాడి కౌరవేయు లచట
పాండుసుతుల నెల్ల పరిభవింప
పంత మాడినటుల పాండవు లెల్లరు
బయలుదేరినారు భామ గూడి. : 2 :
ఆ.వె: కృష్ణు దయను పొంది కృష్ణతో బాటుగా
పాండు తనయులెల్ల పదియు రెండు
వత్స రంబులడవి వాసము జేయుచు
పూర్తి జేసినారు ముదము తోడ. : 3 :
తే.గీ: వేషములు మార్చుకొని పాండవేయు లెల్ల
చేయ నఙ్ఞాత వాసము చింత లేక
మత్స్య దేశంబునకు నేగ మదిని దలచి
భామ తోడను సాగిరి వడిగ వారు. : 4 :
ఆ.వె: వీరులవలె నున్న వీరలగని రాజు
యాశ్రయంబు నొసగి యాదరించె
కంకుభట్టు యయ్యె కౌంతేయు డప్పుడు
నరుడు నేర్పుచుండె నాట్యములను : 5 :
ఆ.వె: వంటవాడిగానె భాసించె భీముడు
కవలలిద్దరు పశు కాప రులుగ
మానిననెడి పేర మగువ ద్రౌపదియేగ
చేరి రెల్లరచట సేమముగను . : 6 :
ఆ.వె: కర్మ కాలినపుడు కాలమే శత్రువౌ
నన్న తీరు గానె నాపదొడమె
రాజు బావమరిది రమణి ద్రౌపదిఁగని
మరులు గొనియె తాను మదము తోడ. : 7 :
ఆ.వె: మగువ జూచి తాను మత్తులోబడి, యక్క
చెంత కేగి వేడె చింత దీర్చు
మనుచు మనసు లోని మాట తెలియ చేయ
ముప్పు వచ్చె నంచు ముదిత దలచె. : 8 :
ఆ.వె: హితము బల్క నక్క హీనముగా జూచి
పొందు కూర్ప కున్న పోవ ననగ
వలదు వలదు మాట బాగుగా వినవయ్య
పడతి కైదు మంది పతులు గలరు. : 9 :
ఆ.వె: సూక్తమైన మాట సోదరి చెప్పంగ
వినక మూర్ఖు డగుచు విసురుగాను
తరుణి నంప కున్న తగవె మిగులు నింక
కీడు తప్ప దనియె కీచకుండు. : 10 :
ఆ.వె: పతులు ఐదు మంది పడతికి గలరట
వదలబోరు రాజు బావమరిది
వనుచు మోహ మింక వలదయ్య వినుమాట
యనుచు ననునయించి యతివ పలికె. : 11 :
ఆ.వె: కామ పీడితుండు కన్నుమిన్నరయక
'వేగ పంప కున్న వేటు దప్ప'
దనగ భీతి నొంది కినుక బాప సుధేష్ణ
రమ్మని పిలిపించె రమణి నపుడు. :12 :
ఆ.వె : మధువు వలయు నాకు మగువ నీవిప్పుడే
తమ్ము నింటి కెళ్ళి త్వరగ తెమ్ము
ననుచు పలికె తాను నయముగా కృష్ణతో
కాదు కూడదనక కదలు మనగ : 13 :
ఆ.వె :మదిని బెంగ పడుచు మారాడగా లేక
బెదరుచు తనుమధ్య భీతి తోడ
జరుగ బోవునదియు జరిగ తీరు ననుచు
కలశ పాత్ర బట్టి కలికి /కాంత వచ్చె. : 14 :
ఆ.వె: చిగురుబోడిని గని సింహబలుడు తాను
చేయి బట్ట బోగ చెలియ పలికె
వదల వోయి కరము పతులేవురు గలరు
నిన్ను వీడ రిపుడు నిజము నిజము. : 15 :
ఆ.వె :తులువ తనము తోడ తోయలిన్ వేధింప
నిండు కొలువు చేరె నీరజాక్షి
న్యాయ మడుగ బోగ నయముగా కంకుడు
నడ్డు తగిలి పంపె నతివ నపుడె. : 16 :
ఆ.వె :బుసలు గొట్టు చున్న భుజగము వోలెతా
వేగ నడచె నీలవేణి యపుడె
యర్జునుని గనుగొని యాగ్రహావేశాన
బాధ వెళ్ళ గక్కు పడతి జూచి. : 17 :
ఆ.వె :పవనసుతుడు గలడు బాపునీ యాపద
వలదు బెంగ యనుచు పార్థు డనగ
మందయాన సాగె మధ్యము చెంతకు
ననునయించి పలికె ననిల సుతుడు . :18 :
ఆ.వె: అంత వంత యేల నతివరో భయమేల
చూచు చుండు మిటులె శుభము గూర్తు
నాట్య శాల యందు నాతి రూపము దాల్చి
మట్టు బెడుదు ననియె మరుత సుతుడు. :19 :
.వె : మాయ మాట లాడి మానిని కీచకున్
నర్తనంబు సేయు నగరు కడకు
రమ్ము యనుచు బిలువ రాచఠీవిని బూని
సింహబలుడు తాను చేర వచ్చె. : 20 :
ఆ.వె: పడతి వోలె నున్న పవన సుతుని జూచి
తాను వలచి నట్టి తరుణి యనుచు
మురిసి దరికి చేర ముష్టిఘాతము తోడ
గాయ పరచి గూల్చె గాలి సుతుడు. 21
ఆ.వె : సింహబలుని భీమసేనుండు యెదిరించి
చీల్చి జంపె తాను చీకటింట
ముద్ద జేసి వాని మూలకు పడదోసి
యతివ కోర్కె దీర్చె ననిల సుతుడు. 22
ఆ.వె : పాండు సుతుల నరయ పన్నికతో మల్ల
యోధునంపె నాసుయోధనుండు
యన్న సైగ తోనె నంత మొందించెను
వలలుడనగ నున్న వాయు సుతుడు. : 23 :
ఆ.వె :కీలక మయినట్టి కీచకు మరణంబె
పాండు రాజ సుతుల బయలు పరుప
కౌరవాధి పతియు కలిసి సుశర్మను
దండయాత్ర కంపె దక్షిణాన : 24 :
ఆ.వె :విరటరాజు సాగె వీర సైనికులతో
దక్షిణంబు వైపు త్వరిత గతిని
యదును జూచి వచ్చె నాకౌరవేంద్రుడు
ఉత్సుకతన తాను నుత్తరాన :25 :
ఆ.వె:అయ్య గావు మంచు నాత్రంబు తోరాగ
కొలువు నందు విరటు కొమరు డడిగె
భీతి చెంద నేల వేగమె నుడువుడు
చెంత నుండ నేను చింత యేల. 26
ఆ.వె:గోవు లపహరించి కురుపతి యచ్చోట
నురుకు చుండె తాను నుత్తరాన
విరట రాజు యపుడు వేలసైన్యంబుతో
వెడలె తాసుశర్మ పీచ మణచ. 27
ఆ.వె:అయ్య గావు మంచు నాత్రంబు తోరాగ
కొలువు నందు విరటు కొమరు డడిగె
భీతి చెంద నేల వేగమె నుడువుడు
చెంత నుండ నేను చింత యేల. 28
ఆ.వె:గోవు లపహరించి కురుపతి యచ్చోట
నురుకు చుండె తాను నుత్తరాన
విరట రాజు యపుడు వేలసైన్యంబుతో
వెడలె తాసుశర్మ పీచ మణచ. 29
ఆ.వె:నేను యిచట నుండ నేటికింక భయము
జంకు వలదు మీకు జయము మనదె
తెగువ జూపి మీరు తెండిటు సారథిన్
యనుచు పలికె తాను నార్తి తోడ 30
.ఆ.వె:చాటు నుండి విన్న చాన సైరంధ్రి తా
రాకుమారి చెంత రవము తోడ
నాట్య గురువు తానె నడుపు రథమునంచు
పలుక సంతసాన పట్టు బట్టె 31
.ఆ.వె:అన్న యొప్పె;పిదప నాచార్యు నొప్పింప
రథము నడుప నతడు రహిని జూపె
రాకుమారుడపుడు రణము చేయగ నెంచ
సాగు చుండె క్రీడి జవము తోడ. 32
.తే.గీ:కౌరవుల సేనగని గుండె గుభిలు మనగ
భయము తోడ నుత్తరుడటు బరుగు దీయ
జమ్మి వృక్షము పైనున్న శరము లెల్ల
జూపి యర్జునుం డాతని శోక ముడిపె. 33
కం: చక్కని సారథి దొరకిన
గ్రక్కున నేగుచు దునిమెద కౌరవ సేనన్
యుక్కడగించెద నని తా
నెక్కుడు సైన్యము గనగనె నిలపై జారెన్. 34
ఆ.వె:గడువు ముగియు చుండ గన్పించె పార్థుడై
శరము లన్ని యచట జాలు వార
యుద్ధరంగమందు యోధుడై పోరాడి
విజయ మంద జేసె విరటు సుతుకు. 35
ఆ.వె:విజయ మందినట్టు విజయుడు దెల్పగ
పట్టు కుచ్చు లెల్ల పట్టి తేగ
చెల్లి కోర్కె దీర్చె సెహబాస నగ ప్రజ
తండ్రి మెచ్చు కొనియె తనయు నపుడు. 36
ఆ.వె: పాండుతనయు లెల్ల పరమ హర్షంబుతో
నసలు రూపు తోడ నగపడంగ
సంతసించితాను సతి కోర్కెపై పృథ్వి
పతి సుతనుయొసగె పార్థు సుతుకు . 37
.ఆ.వె: అర్జును సుతునకును నతివ యుత్తరకును
శుభ వివాహ మవగ 'సుఖము గనుడు'
యనుచు పెద్ద లెల్ల యాశీర్వదింపంగ
పెండ్లి తంతు ముగిసె వేడ్క తోడ. 38
********
.
Wednesday, May 17, 2017
న్యస్తాక్షరి - ప్ర భా త ము.
భానుడేతెంచె గనుడట ప్రజలార
తమము తొలగ వెలుతురులో ధైర్యమూని
మురిసి తామరలు విరిసె ముదము తోడ
భాసురముగ నిను గొలువ ప్రజలు నెల్ల
తహతహను బూని వత్తురు ధరణియందు
ముజ్జగములకు వెలుగిడ ముందు రార.