Wednesday, September 27, 2017

అడుగుజాడ గురజాడ

21/9/17
డా.బల్లూరి ఉమాదేవి

పద్యసంఖ్య:,2835నుండి2849 వరకు 15 పద్యములుి


గురజాడవారి జయంతి సందర్భంగా రచించిన పద్యములు.


అడుగుజాడ గురజాడ


1..ఆ.వె:రాయవరము నందు రామదాస సుతుడై

              జనన మొందె ను గురజాడ నాడు

         బాల్యమందె తండ్రి పరమపదించగా

          తల్లి నీడ లోనె తాను/ధరను పెరిగె.



2.సీ:మేలిమి రత్నమై మేనమామల యింట

              జనియించె గురజాడ జగతి యందు

             విద్యలెల్లయు నేర్చి పేదరికము లోనె

                బడిపంతులుగ తాను వాసికెక్కె

             వ్యావహారికమైన భాషకు పట్టము

                 కట్టదలచి నట్టి కవి యితండు

            గిడుగు పంతులతోడ కేలును గలుపుచు

,              గ్రాంథిక వాదుల కచట కమ్మ

  ఆ.వె:   నైన బదులు నొసగి యవనియందీతండు

              ఖిలము కాని యట్టి కీర్తి నంది

                తెలుగు భాషలోన దీటుగా కావ్యముల్

                వ్రాసిఘనత నందె వాసి గాను.


3ఆ.వె:ఆంధ్ర దేశమందు నవతరించి యతడు

      వేగు చుక్క వోలె వెలిగి పోయె

     అంటరాని తనము నంతరింపగచేయ

      కవిత లల్లి గొప్ప కవియునయ్యె.


4.ఆ.వె:ఆంగ్లభాషయందు నల్లె కావ్య మొకటి

     పాతికేళ్ళ పడుచు వయసు నందె

      సంఘ సంస్కరణము సాధించ మొదలిడి

     కలము తోడ తనదు బలము చూపె.


5.ఆ.వె:అడుగు జాడ యయ్యె పుడమిలో జనులకు

      కమ్మనైన కావ్య ఖండికలను

     వ్రాసి దారి చూపి వాసికెక్కిన కవి

     వరున కిడుదు కోటి వందనాలు.


 

6.ఆ.వె:మంచి నెపుడు యిలను పెంచు మని పలికి

      వట్టి మాట వల్ల బాధ మిగులు

     నంచు గట్టి మేలు నయమున చేయంగ

    ఖ్యాతి నందు జాతి ఘనతతోడ


7.ఆ.వె:పిరికి వాడివైన వెనుక బడెద వీవు

        మందగించ కుండ ముందు కేగు

     మనెడి మంచి మాట మరువబోకనుచును

      నలుపు లేక చాటె నవని యందు


8.ఆ.వె:జనుల కుపకరించు చక్కని పనులను

        చేయు మనుచు తాను చేసి చూపె

      పరుల కలిమి గాంచి బాధతో యేడ్చిన

       ఫలిత మేమి టనుచు ప్రశ్న చేసె.


9.ఆ.వె:వర్ణ భేదములను పాటించవలదని

       జాతికి దెలిపె గురజాడ నాడు

       ప్రేమ బంధము నిల ప్రియమార దెల్పుచు

        స్ఫూర్తి దాత యగుచు కీర్తి నందె.


10.ఆ.వె:మూఢ నమ్మకములఁముందుగా ఖండించి

            ప్రజల కెరుక చేయు వాంఛ తోడ

            మేలుకొలుప ప్రజ నలుపులేక

          సాగె నిలను తాను సంఘసంస్కర్తయై

           అడుగు ముందు కేసె జడుపు లేక.



11.ఆ.వె:మంచి తనము నెపుడు పెంచవలెననుచు

     ఆచరించి చూపె నవని యందు

     సంఘ సంస్కరణకు సర్వశక్తులనొడ్డి

      కూర్మితోడ దెచ్చె  గొప్ప మార్పు.


12.ఆ.వె:దిద్దుబాటు వ్రాసి తెలుగు కథకు నయ్యె

        నాద్యుడీ కవివరుడవని యందు

        మాటలాడు భాషె మంచిభాషయటంచు

         వ్రాసి చూపి తాను వాసికెక్కె.


13.ఆ.వె:దేశభక్తి తేట తెల్లము చేయుచు

        అడుగు జాడ యయ్యె నాంధ్ర దేశ

        మందు ,కన్యశుల్క మాది నాటకములు

      వ్రాసి చూపి నాడు ప్రజలకెల్ల.


14.ఆ.వె:మట్టి గాదు గనుము మనుజులే దేశమౌ

           ననుచు చాటి చెప్పె నవని యందు

         పాత కొత్తలకును వారిధి తానయ్యె

         యుగపురుషుడటంచు జగతి మెచ్చె.


15.ఆ.వె:వాడుచున్న భాషె వాసియైనదనెడి

       రామమూర్తిఁగలిసి రక్తి తోడ

      పామరజనులకును పరిచితమైనట్టి

       వ్యావహారికంబు వ్యాప్తి చేసె.




శారదాస్తుతి.

మిత్రులందరికీ శుభోదయం

పేరు:డా.బల్లూరి ఉమాదేవి.
27/9/17

అంశం:   శారదామాత

1కం:.మదిలోనిన్నే దలచుచు

     నుదయాస్తములన్ నుడివెద నోరారంగా

     పదిలముగా సతతము నా

     మదిలో నుండి పలికిించు మంచి పలుకులన్.

ఆ.వె:శారదమ్మ నిన్ను సద్భక్తితో గొల్తు

       మంచివాక్కు లొసగు మమ్మ మాకు

      పదుగురెదుట నిలిచి ప్రతిభఁకనపరచు

     శక్తి నొసగవమ్మ చదువులమ్మ.

ఆ.వె:చదువు సంధ్యలొసగు చల్లని మాయమ్మ

        భక్తి శ్రద్ధలొసగు వాణి మాత

      పుస్తకమ్ము నెపుడు బుద్ధితో చదువంగ

      మనసు నొసగు మమ్మ మరువకుండ.

ఆ.వె:విధికి రాణి వీవు విద్యాధనము నివ్వు

        జగము లెల్ల నిన్ను సన్ను తించు

       కమలనేత్రి మమ్ము కాపాడు కరుణతో

        జంద్రవదన నీకు శరణు శరణు.

5ఆ.వె:చదువు సంధ్యలొసగు శారదాంబకు మ్రొక్కి

        వ్రాయబూనితేను పద్యములను

         దీవనొసగు మమ్మ దేవి భారతిదేవి

          కరము వేడుకొందు కనికరించు.

6.అ.వె:నలువ రాణి వీవు నగుమోముతో మమ్ము

      కరుణ చూపవమ్మ కలికి వాణి

      మంచి వాక్కు నొసగి మాధవు పైభక్తి

       కలుగ చేయ వమ్మ కమలపాణి.

7.ఆ.వె:మంచి మాటలెపుడు మాచేత పలికించు

            మంచి విద్య నేర్వ మనసు నివ్వు

          పదుగురెదుట పల్కు పాండిత్య మబ్బగా,

           శక్తి నొసగు మమ్మ శారదమ్మ.

8ఆ.వె:చేతి యందు వీణ చిలుక ముంజేతిపై

        అంచ నెక్కి తిరుగు నట్టి చాన

      స్ఫటిక మాలదాల్చి సద్భక్తులను బ్రోచు

       శారదాంబ నిన్ను సన్నుతింతు.

9.ఆ.వె:మాఘ మాసమందు మనుజులెల్లరు చేరి

          కోరి కొలుతురమ్మ కూర్మి తోడ

          ఆర్తి బాపి జనుల కాశిస్సు లందిమ్ము

         సకల లోక వంద్య శారదాంబ.

10.ఆ.వె:భాసర పురమందు వాసిగా వెలసిన

       శారదమ్మ నీకు శరణు శరణు

      కచ్ఛపమను వీణ కరమందు దాల్చిన

        వాణి మాత నీకు వందనమ్ము.

11.ఆ.వె:పాట యైన గాని పద్యాల స్పర్ధైన

             నీదు కరుణ యున్న నెగ్గ గలము

          సభల యందు నైన సంగరమున నైన

          విజయ మొసగు మమ్మ విద్దెలమ్మ

12.ఆ.వె:హరికి కోడ లీవు హరిణాక్షి వాగ్దేవి

              అత్త గాదె నీకు నాదిలక్ష్మి

         మీయిరువురి దయను మేము కోరెదమమ్మ

        మమ్ము బ్రోవ రండు మాతలార.

13.కం:అమ్మా వాణీ శారద
           యిమ్ముగ నిన్నే కొలుతును నేనెల్లపుడున్
           కమ్మని దీవెన లొసగుచు
          మమ్మానందింపజేయ మరువకు మమ్మా.

14.కం:కవులకు ప్రాణంబీవే
         కవికోకిలలకు సతతము గళమును నీవే
        కవితాపటిమను పెంచుచు
        కవిగా భువిలో నిలుపగ గమ్మున రావే.

15.కం:విద్యల కధిదేవతవే
          విద్యాదాయనివి నీవు విశ్వము నందున్
       విద్యాధనమును నొసగుచు
       విద్యాదానమొనరించు విజ్ఞత నిమ్మా.

Tuesday, September 12, 2017

ధైర్యము.


శీర్షిక:ధైర్యము.

ఆ.వె:ధైర్యమొక్కటున్న ధరలోన జనులకు
       బలమదెంతొ వచ్చు నెలమి తోడ
       సకల కార్యములును సాధింప వచ్చున
       టంచు బల్కు చుందు రార్యు లిలను.
     
ఆ.వె:దైర్యవంతు లిలను శౌర్యము చూపుచూ
      యుద్ధ రంగ మందు యోధులగుచు
      శత్రు మూకపైన సమరము చేయుచు
      విజయమంద గలరు వెరపు లేక.

ఆ.వె:పిరికివాడవైన వెక్కిరింతురు నిన్ను
     పిరికి తనము వీడ వీరుడౌదు
    ధీరగుణము యున్న దేశమందెల్లడ
     తెగువ చూపగలవు తెగువ తోడ.

ఆ.వె:హడలి పోకు మయ్య నాపదలెదురైన
      పారద్రోలు మయ్య భయము నెపుడు
      ధీరగుణము పెరుగ భీరత్వముండదు
      సాగు నన్ని పనులు చక్కగాను.

ఆ.వె:పిరికితనముతోడ బెరకుగా దాగిన
       తెగడు చుందురయ్య తీరుబడిగ
      ధీరగుణము చూపి పోరాటమును సల్ప
       శౌర్యవంతుడంచు సన్నుతింత్రు.

ఆ.వె:కష్ట మొదవి నపుడు కంట నీరు నిడక
       గడ్డిపోచలల్లె కడకు నెట్టు
       ధైర్యమనెడు శరము దాపున నుండంగ
         సాగవయ్య ముందు సాహసాన.

Tuesday, September 5, 2017

గురువు.

గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు.

శీర్షిక:గురువు.

1ఆ.వె:గురువు లేని విద్య గుడ్డివిద్యందురు
       గురువు బోధ యున్న గురుతు నుండు
      గురువు కరుణ యున్న కురియును వరములు
      నిలను గురువు నున్న బలము గలుగు.                      

2.కం:అఙ్ఞానంబును బాపుచు
      విఙ్ఞానమొసంగునొజ్జ;విశదముగా తా
     ప్రఙ్ఞావంతుల చేయుచు
      సుఙ్ఞానమొసగు గురువుకు జోతలొ సగుదున్.                

3.తే.గీ:.ముగురు మూర్తుల బోలెడి ముఖ్య వ్యక్తి
          తల్లి తరువాత యంతటి తాన మీత
         నిదిల వినయాదికంబులు నేర్పు నట్టి
         గురువు కంటెను వసుధలో గొప్ప యెవరు?.      

             
4.ఆ.వె:రామకృష్ణు లిలను రహముతోనేర్చిరి
        గురువు చెంత చదువు కూర్మి తోడ
        దేవదేవు డైన దీనుడే యైననూ
        గురువు వద్ద నేర్వ గొప్ప యగును.

5.ఆ.వె:చదువు తోడ తాను సంస్కారమును నేర్పి
       ఛాత్ర తతిని పెంచి జగతి యందు
       గురువు నేర్పు చుండు గొప్ప విద్యలనెల్ల
      బుద్ధిమంతు లవగ మురిసి పోవు.

6ఆ.వె:గురిని చూపు వాడు గురువౌను నిలలోన
       తీర్చి దిద్దు తాను తీరుబడిగ
       నుర్వి యందు వార లుత్తములుగ నుండ
       మురిసి పోవు చుండు గురువు తాను.

7.కం:గురువే దైవమటంచును
    నరయుచు భక్తిన్ సతతము నతనికి సేవల్
    నిరతము చేయుచు నుండిన
    హరియును శిష్యున కొసగును హరుషం బెపుడున్.

8.ఆ.వె:విద్య నేర్పునట్టి విజ్ఞాన ఖని యైన
       గురువు నొద్ద నేర్వు గొప్ప చదువు
       మంచిగాను చదువ మదిలోన హర్షించి
            విద్యలెల్ల నేర్పు వేగమతడు.

9.తే.గీ:.ముగురు మూర్తుల బోలెడి ముఖ్య వ్యక్తి
    గురుడు  నతని శిష్యుండవై గొప్పవైన
   విద్య లెల్లను నేర్చుచు వేల్పు వోలె
  నర్చనమొనరించశుభము లబ్బు నెపుడు.

10.కం:అనయము శ్రద్ధను చూపుచు
     వినయము తోడను కొలుచుచు విశ్వాసంబున్
      ననవరతము కనబరచిన
       మనమున మెచ్చుచు గురుండు మమతలు పంచున్.




11ఆ.వె:గురువు దారి జూప గురినిముట్టగలము

      గురువె తల్లి దండ్రి గురువె సర్వ

      మనుచు నెంచి సరిగ నభ్యసింప చదువు

     ఛాత్రులగని గురువు సంతసించు.


12కం:అజ్ఞానమదియుతొలగును

     విజ్ఞానఖనియగు గురువు వెలుగును పంచన్

      సుజ్ఞాన మలవడు మదిలో

     ప్రజ్ఞయు పెరుగును నిజమిది వసుధన్ గనుమా!


13.ఆ.వె:బ్రహ్మ విష్ణు శివులు పాఠముల్ నేర్పెడి

      గురువు లనుచు నుంద్రు కువలయాన

     నట్టి గురువు చెంత నధ్యయనము చేయ

      ఘనుడ వౌదు వపుడు ఖచితమిదియు.

Friday, September 1, 2017

శ్రావణమాసం పద్యాలు.

నవకవితాఝరి గ్రూప్ వారు నిర్వహించిన "శ్రావణమాస కృష్ణాష్టమి"పద్యాలపోటీలో "ప్రత్యేక బహుమతికి"అర్హమైన నేను వ్రాసిన పద్యాలు.

శ్రావణమాసం పద్యాలు.

ఆ.వె:శ్రావణమ్ము వచ్చె సందడి తాతెచ్చె
         చిటపట చినుకులకె చెట్లు మొలచె
         అంబరమ్ము నంటు సంబరమ్మొదవంగ
         నాడపడుచుల కిల హర్ష మయ్యె.

ఆ.వె:శ్రావణంబు ననగ సతులకెల్లరకును
       సంతసంబు కలుగు జగతి యందు
     పాడ్యమి తిథి మొదలు పండుగలనుచును
     జరుపు కొనుచునుంద్రు సంబరాన.

ఆ.వె:సింధు రాజతనయ శ్రీలక్ష్మి రావమ్మ
       చంద్రసోదరి వీవు చంద్రవదన
     వరము లొసగునట్టి వరలక్ష్మి వేనీవు
    కొలువు దీరుమింట కూర్మి తోడ.

ఆ.వె:చారుమతియు నాడు చక్కగా నీవ్రతం
          బాచరించి బడసె భాగ్య రాశి
          నాటి నుండి నిదియు నవలా  మణులకెల్ల
           గొప్ప పండుగయ్యె కువలయమున.

ఆ.వె: సంతసమ్ము తోడ శ్రావణ మాసాన
           పౌర్ణమీ దినమున పడతు లెల్ల
          తోడ బుట్టువులకు తోరము లను గట్టి
        బహుమతందు చుంద్రు వసుధ యందు.

ఆ.వె:దివ్య పర్వ మిదియు ద్విజుల కెల్లరకును
            నుదయ వేళలందు నొప్పు గాను
        సంధ్య వార్చుకొనుచు జంధ్యములను మార్చు
           కొనెడి పౌర్ణమిదియె కువలయాన.

కం:అష్టమ సుతుడై భువిలో
    శిష్టుల కావగ జనించె శ్రీకృష్ణుండై
     దుష్టుల దునిమెద తండ్రీ
     కష్టములిక తొలగునంచు కమ్మగ పలికెన్.

ఆ.వె:కృష్ణ నామ మొకటి తృష్ణను దీర్చును
     కృష్ణ కీర్తనంబు కీర్తి నొసగు
      కృష్ణ కృష్ణ యన్న ఖిలమౌను పాపాలు
    కృష్ణుని గొలువంగ కీడు తొలగు.

ఆ.వె:సతుల కెల్ల జూడ శ్రావణమాసమ
          నంగ కలుగు హర్ష మవని యందు
           పసిడి నగలు దాల్చి పట్టుచీరలు గట్టి
           పర్వమాచరింత్రు పరవశాన.

ఆ.వె:వనిత లెల్ల చేరి వాయనమ్ముల నిచ్చి
          పుచ్చు కొనుచు మదిని ముదము నంది
          ప్రతి దినమునొక్క పర్వదినమ్ముగ
           గడుపుచుందురిలను కాలమిటుల.

Saturday, August 26, 2017

అత్తాకోడలు

9493846984
పేరు:డా.బల్లూరి ఉమాదేవి

అంశం:అత్తా కోడలు.

ఆ.వె:అత్త కోడలిలను ననవరతమ్మును
         కలసి మెలసి యున్న కలుగు సుఖము
         యింతులిటుల నుండ  నిల్లె స్వర్గ మగును
        కల్లగాదు నిజము గనుడు జనులు.      

ఆ.వె:కోడలత్త యవగ  కూరిమితో తాను
         కూతురల్లె జూడ కోడలపుడు
         నాదరించు నత్త నమ్మవోలె నెపుడు
         కలత లన్న మాట కలను రాదు.            

ఆ.వె:అత్త నైతి ననుచు నధికారమును చూప
           ప్రేమ యనెడి మాట పేరు కైన
           దొరక దనెడి మాట ధరణిలో నిక్కము
           తెలిసి మసలు కొనుము తెలివి తోడ.        

.ఆ.వె:అత్త కూడ తాను కొత్తగా కోడలై
         మసలినట్టి వేళ మరచిపోయి
          తనదు పెత్తనంబు తప్పిపోవుననుచు
           తపన తోడ తాను తపన చెందు.             

ఆ.వె:అత్త లేని కోడ లుత్తము రాలని
         పాట పాడు వారు నాటి జనులు
        అత్తలున్న మేలు నవసరంబులకౌదు
           రనెడి కాలమిపుడు   నరుగు దెంచె.

ఆ.వె:అత్త లనగ చెత్త యనెడి భావన హెచ్చె
        తనదు తల్లి దండ్రి దైవమనుచు 
        అత్తగార్ల నిలను నారళ్ళు బెట్టెడి
        వారి సంఖ్య పెరిగె  వసుధ యందు.

 ఆ.వె:కూతు లేని లోటు కోడలే తీర్చంగ
         అత్త యయ్యె నమ్మ యవని యందు
      మహిత వైభవమున మమత పంచ జనులు
        .యబ్బుర పడి గాంతు రనవరతము.

  27/8/17
,

Thursday, August 24, 2017

గణపతి

25/8/17

    అంశం:వినాయకుడు.  
1కం:తెల్లని వలువలు దాల్చిన
   పుల్లాబ్జాక్షుండు నాల్గు భుజముల తోడన్
   చల్లగ నవ్వులు రువ్వ న్
   నుల్లము నందున గొలిచెద నుగ్రుని తనయున్.

2.తే.గీ:ధవళ వస్త్రంబుల నెపుడు దాల్చునట్టి
       వాడు విష్ణువనెడి పేర పరగు వాడు
      నాల్గు భుజముల తొడవుల నలరు వాడు
       అద్రిజ తనయు డీతడే యార్తి బాపు

3.ఆ.వె:గణములకధినేత గణపతి యనుపేర
         వెలసి పూజ లంది వెలుగు నట్టి
      యేక దంతు డితడె  యిభరాజ వదనుడై
         యాపదలను బాపి యభయమొసగు.

4కం:    వంకర తొండము కలిగిన
      శంకర పుత్రుడు మనుజుల జల్లగ గనుచున్
       జంకును బాపుచు వారల
       సంకటములు తొలగ జేసి శాంతిని గూర్చున్.

5ఆ.వె:భాద్రపదమునందు పార్వతీతనయడై
       జన్మ మెత్తి నాడు జగతి యందు
      విఘ్నములను బాపి వెలుగు బాటనుచూపి
       మ్రొక్కు జనుల కెల్ల ముదము గూర్చు.

6ఆ.వె:ఆది పూజితుండు నంబరాధిపతియు
      నార్తి బాపి జనుల కభయ మొసగు
      కోరికొలుచు వారి కొంగుబంగారమై
        కామితార్థమొసగి కరుణ జూపు.

7సీ:గజవదనుడవీవె గౌరిసుతుడ వీవె
       సుముఖనాముడవీవె శూలి పుత్ర
   ఏకదంతుడవీవె యిభరాజ వదనుడా
        గుంజీలు తీయుచు కోరికొలుతు
    మూషిక వాహనా ముదముతో సేవింతు
            శుభము లొసగు మయ్య శూర్పకర్ణ
       విఘ్నములను బాపి విష్ణుపదమునందు
            చిత్తముండు నటుల చేయుమయ్య
ఆ.వె:అసురవరుని దర్ప మణచిన హేరంబ
     ఆర్తి బాపి మాకు నభయమొసగు  
    కరుణ జూపి నీదు కరమెత్తి దీవించు
     విజయమొసగు మనుచు వేడు కొందు.


8ఆ.వె:శరణు శరణు నీకు శంకర సుతనయా
  చరణముల నుతింతు చదువు లొసగు
    ఉడుపతి నిను జూచి యుడికించె గావున
      శాపమందె తాను చవితి నాడు.

9ఆ.వె:ఆది పూజితుడవు నాఖువాహనుడవు
         కుక్షి నిండ నీకు కుడుము లిడుదు
        కరిముఖ గణపయ్య కాపాడు కరుణతో
       విన్న వించు కొందు విఘ్న రాజ.

10.ఆ.వె:ఏక దంత నిన్ను నేమరక కొలుతు
           వక్రతుండమాకు వరము లొసగు
         గణముల కధిపతివి కరిరాజ ముఖుడవు
         సన్నుతింతు నయ్య సంతసాన.

11.ఆ.వె:భారతాదులనిట వ్యాసుడు నుడువంగ
            రచన చేసితీవు రమణ తోడ
        నదియె నేటి కిలను నాదరణీయమై
         నలరుచున్న  వయ్య యంబ పుత్ర.


12.ఆ.వె:అంబరాధిపుడవు యగజేశు సుతుడవు
           అర్థి తోడ గొల్తు రవని జనులు
           అగ్ర పూజ నీదె యఖిల గణాధిపా
              తప్పు లన్ని దిద్ది దారి జూపు.

13.ఆ.వె:తల్లి కోర్కె తీర్చ తపమొనర్చి శివుని
            యాత్మ లింగముగొని యరుగు చుండ
            దానినందు కొనుచు ధరణిపై బెట్టిన
             బాల రూపు డీవె భవ్య చరిత.

14.ఆ.వె:వామదేవ తనయ వాసిగా నిను గొల్తు
          వేడు చుంటి నయ్య విజయ మొసగు
         కోరి కొలుతు మయ్య గుంజిళ్ళు తీయుచు
            కోర్కె లన్ని దీర్చు గుజ్జు రూప.

15కం:గజముఖ విఘ్న వినాయక
      విజయము నిమ్మని సతతము వేడెద నిన్నున్
     కుజనుల సహవాసమిడక
     సుజనుల సాంగత్యమొసగు శూర్పకర్ణ.

16.కం:ధవళ వస్త్రము దాల్చిన
        శివసుత మాకిల వరములు శీఘ్రమె నిడుమా
        భవభయహర నిను కొలుతుము
         శివము నొసగి కావుమయ్య సింధురవదనా