Sunday, March 19, 2023

Send

గురజాడ ఫౌండేషన్ అమెరికా జాతీయ పురస్కారం ఫార్మట్*

-------------------------------------


*జాతీయ పురస్కారం*

----------------------------------


పేరు:డా.బల్లూరి ఉమాదేవి

ఊరు:కామవరం గ్రామం కౌతాళం మండలం

చదువు:ఎం .ఏ,పిహెచ్ డి.

ఉద్యోగం:విశ్రాంత తెలుగు ఉపన్యాసకురాలు.


----------------------------

*సాహిత్యం*

1)-ప్రచురించిన పుస్తకాలు:శ్రీ రామదూతశతకము.

2)-సాహిత్యపోటీలో బహుమతులు:పెక్కులు గలవు అందులోకొన్ని

పద్యాలపోటీలో విశ్వనాథవారి వేయిపడగలు

పద్యంహృద్యం పోటీలో నగదుబహుమతి

పద్యాల పోటీలో పాకుడురాళ్ళూ,గీతామకరందము,సాక్షి వ్యాసములు,తెలుగు నిఘంటువు

అన్నమాచార్యూల కీర్తనలు,మనతెలుగు,శ్రావణమాసపు పద్యాలపోటీలో నగదు బహుమతి,మరియు 'గజల్ సుమాలు

పుష్పదరహాసం

శివరాత్రి సందర్భంగాపెట్టిన పద్యాలపోటీలో

బహుమతిగా "శివపురాణం"అందుకొన్నాను.


3)-సాహిత్యంలో ఏఏ ప్రక్రియల్లో చేసినకృషి /ప్రవేశం



        పద్య రచన, సమస్యా పూరణ

                  ములు, కవితలు, గేయములు.

      వ్యాసములు,పదబంధములు పూర్తిచేసి పత్రికలలో(ఆంధ్రభూమి,వార మరియు మాసపత్రికలలో)బహుమతి నందుకొన్నాను

                తెలుగు కవిత్వము సమస్యా పూరణం.,శంకరాభరణం గ్రూప్,పద్యాలసవ్వడు    మరియు నితర గ్రూపులలో సమస్యలు పూరించడం.ప్యారడీ పాటలు వ్రాయడం.

 దాదాపుగా      2000 పైగా " సమస్యా పూరణములు" చేశాను.

రామాయణం,మహాభారతం,భగవద్గీతలపై ప్రవచనాలు చెప్పాను.


*సాహితీసదస్సులు*


1)పాల్గొన్న కవిసమ్మెళనాలు:5 సార్లు(కర్నూల్,మంత్రాలయం,ఆదోని,విశాఖపట్టణం.)

2)-పాల్గొన్న అవధానాలు   :7 సార్లు:(ఆదోని,మంత్రాలయం,హరివాణం)

3)-జాతీయ సాహితీ సదస్సులు:3 యోగివేమన విశ్వవిద్యాలయం,కడప.ఉస్మానియాకళాశాల,కర్నుల్,బేగంపేట మహిళాకళాశాల హఐదరాబాదు.

2)-సాహితీసదస్సుల్లో సమర్పించిన పత్రాలు:3

1.మహిళల పట్ల వేమన

2దేశచరిత్రలో  మహిళల పాత్ర

3తెలుగు భాష వ్యుత్పత్తి వికాశము.

---------------------------------


👉 *పత్రికల్లో* *ప్రచురితమైన రచనలు*

1.వాజ్మయి

2.స్త్రీ స్ఫూర్తి

3.ప్రజాదర్పణం.

4.పుష్కర సంచిక

5.కృష్ణపక్షం

6.తెలుగు వెలుగు(అంతర్జాతీయ పత్రిక)

7.తెలుగుసాహితీవేదిక.

8.మాలిక

9.అచ్చంగాతెలుగు

10పద్యానందలహరి.మొదలగునవి.



👉 *పొందిన పురస్కారాలు*



  1    తెలుగు కవితా వైభవం ఆధ్వ

                  ర్యంలో  అయుత కవితాయజ్ఞం

                  వారు నిర్వహించిన కవి సమ్మేళ

                  నంలో సన్మానంతో పాటు

                  " సహస్ర కవి మిత్ర " బిరుదు

                   ప్రదానం 2016 ఏప్రిల్ లో.

                  ప్రయుత కవితా యజ్ఞం వారు

                  ప్రకటించిన " సహస్ర కవి రత్న "

                  బిరుదు."సహస్రకవిభూషణ"

                  బిరుదు.

     2.   కర్నూలు జిల్లా ఉత్తమరచయిత్రిగా JSRK

శర్మగారేర్పాటు చేసిన సభలో M.Pబుట్టా రేణుక చేతులమీదుగా సత్కారం.,

3.హైదరాబాదు రవీంద్రభారతిలో రెండుసార్లు అచ్చంగాగ్రూప్ వారిచే సన్మానం..

4.హైదరాబాదులో "గురజాడ వారి రాష్ట్రస్థాయీ"పురస్కారం.పొట్లూరి హరికృష్ణ..శ్రీ శివారెడ్డి చేతులమీదుగా,

5.కృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాలలో ఆదోనిలో సత్కారం.

వివిధ కళాశాలలో ముఖ్యఅతిథిగా సాహిత్యోపన్యాసములు చేసినపుడు పొందిన సత్కారములు.

అమెరికా లోని డల్లాస్ నగరంలో సాహితీకార్యక్రమాలలో పాల్గొని కవితాగానం చేశాను.

అక్కడి పోటీలలో పాల్గొని బహుమతులందుకొన్నాను.

అమెరికాలో రేడీయో కార్యక్రమాలలో పాల్గొని (తెలుగు మరియు కన్నడ)సత్కారాలందాను.



ఫిబ్రవరి 12 వతేదీన గురజాడవారి జాతీయపురస్కాఖరాన్ని అందుకోబోతున్నాను.


👉 *సాహితీసంస్థ (రిజిష్ట్రేషన్ గుర్తింపు పొందిన సంస్థలు) లో అనుబంధం*

తెలుగుసాహితీవేదిక ఆదోని


👉 *సంస్థల్లో నిర్వహించినపదవులు*

లేదు


👉 *ప్రముఖ కవులతో అనుబంధం మరియు  ప్రభవం*


లేదు

👉 *వర్తమాన కవుల రచనలు ప్రభావం*లేదు.



Wednesday, October 27, 2021

తెలుగు బిడ్డ శతకం

సామాజిక శతక హేల

తెలుగు బిడ్డ శతకము

డా.బల్లూరి ఉమాదేవి

పద్యం:0

ఆటవెలది



పద్యాల తోరణం

సామాజిక శతక పద్యహేల

తెలుగుబిడ్డ శతకము.

"మకుటము"


*తెలిసి కొనుము మదిని తెలుగు బిడ్డ*.


1ఆ.వె:శ్రీగణేశు నెపుడు చిత్తము నందును 

      దాల్చి సకల సురల దయను వేడి

      వ్రాయ బూని‌తేను. వాసిగా శతకమున్

     తెలిసి కొనుము మదిని తెలుగు బిడ్డ.


2ఆ.వె:కామ క్రోధములను కడతేర్చు చనయము

     పనులు చేయుచుండ వసుధయందు

    మేటివనుచు జనులు మెచ్చెదరెల్లరు

     తెలిసి కొనుము మదిని తెలుగు బిడ్డ.


3ఆ.వె:విద్య లెల్ల నేర్వ విజ్ఞాన మబ్బును

       విద్య తోడ కలుగు వినయ మెపుడు

       నదియె బ్రతుకు బాట కాధార మౌనని

    తెలిసి కొనుము మదిని తెలుగు బిడ్డ.

 

4ఆ.వె:అమ్మ నాన్న లన్న నవనిలో దైవము

       లనుచుగౌరవించు మనవరతము

      వారు దీవెన లిడ భద్ర మొసగునని

     తెలిసి కొనుము మదిని తెలుగు బిడ్డ. 



5ఆ.వె:బహ్మవిష్ణు శివుల  ప్రతి రూప మేగురు

      డనుట మరువ బోకు మయ్య నీవు

       నతని కరుణ యున్న నఖిల భాగ్యము లబ్బు

        తెలిసి కొనుము మదిని తెలుగు బిడ్డ


To see more posts like this and join KAVIYATRA , click here 👇👇

https://kutumbapp.page.link/2JW1wnGkvDSxXNAE6

 

Friday, May 8, 2020

కార్మిక సంక్షేమం

ప్రజపద్యం వారి 
కార్మికసంక్షేమము.1.కొరకు వ్రాసిన పద్యములు.

ఆ.వె:పొట్ట కూటి కొరకు పుడమిలో కార్మికుల్
       పగలు రేయి యనక పనులు చేయ
        కడుపు నిండలేక కష్టాలు మెండయ్యె
      బ్రతుకు నందుమిగిలె బాధ లెల్ల.

ఆ.వె:కార్మికులిల కడుపు బట్టుకొనుచు
        నెంత శ్రమ పడినను నింత సుఖము
       గానకడలు చుండ్రి కష్టముల్ కడతేరు
        మార్గ మెపుడు వచ్చు మహిని దేవ.

ఆ.వె:శ్రమకు తగిన ఫలము జగతిన కనరాక
        కుమిలె కార్మికుండు కువలయాన
         నాలు బిడ్డలకిట నాహార మిడలేని
         దుస్థితిని తలంచి దుఃఖపడును.

ఆ.వె:పగలు రేయి యనక పట్టు చీరలు నేసి
        యమ్మకాని కిడగ నసలు గిట్టు
      బాటు ధరయు రాక బాధతో విలపించు
       కార్మికులను గాంచ కలుగు వెతయు.
        
ఉ:కట్టుచు మేడలన్ భువిని కార్మిక సోదరు లెల్లరున్నిటన్
    పొట్టకు నిండుగా తినగ పూజ్యము నయ్యెను ధారుణిన్ గనన్
    చెట్టుకు పుట్టకున్ చనిరి చింతలు మెండుగ నయ్యె నో ప్రభూ 
గుట్టుగ మానమున్ నిలిపి కూరిమి తోడను నన్నుకావుమా!