Saturday, August 26, 2017
అత్తాకోడలు
Thursday, August 24, 2017
గణపతి
పుల్లాబ్జాక్షుండు నాల్గు భుజముల తోడన్
చల్లగ నవ్వులు రువ్వ న్
నుల్లము నందున గొలిచెద నుగ్రుని తనయున్.
2.తే.గీ:ధవళ వస్త్రంబుల నెపుడు దాల్చునట్టి
వాడు విష్ణువనెడి పేర పరగు వాడు
నాల్గు భుజముల తొడవుల నలరు వాడు
అద్రిజ తనయు డీతడే యార్తి బాపు
3.ఆ.వె:గణములకధినేత గణపతి యనుపేర
వెలసి పూజ లంది వెలుగు నట్టి
యేక దంతు డితడె యిభరాజ వదనుడై
యాపదలను బాపి యభయమొసగు.
శివలీలలు
28/8/17
పద్యాలసవ్వడి
svdno:05
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:2772 నుండి 2789వరకు 18 పద్యములు
అంశం: శివస్తుతి.
ఛందస్సు:ఆ.వె:
1ఆ.వె:నాగభూషణుడవు నగజాత పతివీవు
భక్త వత్సలుడవు ఫాలనేత్ర
మాదు మొరలు వినుచు మమ్మాదరింపుమా
హరహర మహదేవ హర్ష మొసగు.
2ఆ.వె:కోరి త్రాగినావు గొడగూచి యొసగిన
కమ్మ నైన పాలు గరళకంఠ
భక్తసులభుడవట పాపాలు హరియించి
మమ్ము బ్రోవుమయ్య మారవైరి.
3ఆ.వె:పాశుపతము కోరె పాండుసుతుడు నాడు
తపము చేయుచుండ ధరణి యందు
వేటగాని వలెను వెలది గిరిజ తోడ
వచ్చి చేసితీవు బవరమచట.
4ఆ.వె:నీకు మనువు గూర్చ నెమ్మితోనేతెంచె
మన్మథుండుతాను మహిని నాడు
నాగ్రహమ్ము తోడ నగ్ని నేత్రము దీయ
కాలి బూడిదయ్యె కంతు డపుడె.
5ఆ.వె:పాలసాగరమున ప్రభవించిన యట్టి
విషము మ్రింగితీవు వెరపులేక
నీదు శక్తి నెరిగి నెమ్మితో డను మ్రింగు
మనియె శైలపుత్రి యవని యందు.
6ఆ.వె:తిన్నడనెడివాడు తిరుగు నొంటిగ
గాంచె లింగ మచట కానలోన
నీలకంఠు కంట నెత్తురు గారంగ
కన్నులొసగ నెంచ కాచితీవు.
7ఆ.వె:నంది వాహనుడవు నటరాజ మూర్తివి
చంద్రమౌళివీవు జయము నొసగు
నగజకు పతివీవు నామొరలాలించి
యాదరించవయ్య యసమనేత్ర.
8ఆ.వె:సగము మేనొసంగె నగజాతకీతడు
భోళ శంకరుండు భువిని నిజము
వేడుకొనెడి జనుల విడువడేక్షణము,కు
మార జనకు డితడె మార వైరి
9ఆ.వె:కోరికొలుచు వారి కొంగు బంగారమై
కూర్మి తోడ దీర్చు కోర్కొలెల్ల
సురనదిపతియితడె శూలపాణియితండె
భస్మధారి యితడె పరమ శివుడు.
10ఆ.వె:హరహరమహదేవ యనుచు ననవరతము
నిన్ను చేరి కొలుతు నీలకంఠ
మామొరాలకించి మమ్మేలు మనిశము
వేడు కొందుమయ్య విశ్వనాథ.
11ఆ.వె:పరమశివుడతండు పదుగురి వాడుగా
గరళముంచె తాను కంఠమందు
జనుల భయము నుడిపి జయములొసగు చుండు
కొలువ రండు వేగ కూర్మి తోడ.
12.ఆ.వె:తపము చేయ గిరిజ తాపహరుని గూర్చి
కపటవటుని గానె కానుపించె
పరమశివుడతండు పదుగురి వాడుగా
పరిణయంబు నాడెభామ నపుడు.
13.ఆ.వె:పరమశివుడతండు పదుగురివాడుగా
పార్థు కొసగె తాను పాశుపతము
భక్తితోడ గొలున బలము హెచ్చుచు నుండు
భయము నుడుపు నతడు భద్రమూర్తి.
14ఆ.వె:పరమశివుడతండు పదుగురి వాడుగా
వరములొసగుచుండు వాసిగాను
భోళశంకరుడని భూరిగా నుతియింప
సర్వమొసగునట్టి సాత్త్వికుండు.
15.ఆ.వె:కరము నుంచ చావు కలుగవలెననుచు
వరము కోరె నసుర వరుడు నాడు
పరమశివుడతండు పదుగురి వాడుగా
వరము నిచ్చి తాను బాధపడియె.
16.ఆ.వె:కోరికొల్చువారి కొంగుబంగారము
కామితమ్ము లొసగి కరుణచూపు
పరమశివుడతండు పదుగురి వాడుగా
సురనది పతి యితడె శూలధారి.
17.ఆ.వె:నంది నెక్కి తిరుగు నగరాజ సుతతోడ
సుతులిరువురు కొలువ సురలు మెచ్చ
పరమశివుడతండు పదుగురి వాడుగా
భస్మధారి యితడె భాగ్యమొసగు.
18.ఆ.వె:పాలకడలి యందు ప్రభవించి నట్టి యా
విషము గళము నందు వేగ దాల్చె
పరమశివుడతండు పదుగురివాడుగా
వలచి పెండ్లియాడె పార్వతమ్మ.
మంథా భానుమతి గారిచ్చిన సమస్యలు
Sunday, August 20, 2017
Fwd: హరితకవిత
From: "Uma Devi Balluri" <uma.balluri@gmail.com>
Date: Aug 20, 2017 11:15 PM
Subject: Fwd: హరితకవిత
To: "Uma Devi Balluri" <uma.balluri@gmail.com>
Cc:
From: "Uma Devi Balluri" <uma.balluri@gmail.com>
Date: Aug 20, 2017 11:15 PM
Subject: హరితకవిత
To: <sudheer.kamavaram@capgemini.
Cc:
హరిత కవితకొరకు పద్యములు.
1.ఆ.వె: చెట్లు నాటుచుండ చేదోడు నీకగు
నీరు పోసి పెంచ నీడ నొసగు
పండ్లు పూల తోడ పరిఢవిల్లుచు నుండి
హరిత హారమగును తరుల పూలు
2.ఆ.వె:మొక్క నొకటి నాటు మురిపెముతో పెంచు
నీడ నొసగి నీకు తోడు నగును
మూలమందు నీరు మురిపెముతో పోయ
తలను వంచి యొసగు ఫలము నీకు.
3.ఆ.వె:పచ్చనైన చెట్లు బాటకిరుగడల
నాటుమయ్య పుత్ర నీటుగాను
బాటసారులకది బాసటగా నుండి
హరితమయము లగుచు హర్షమొసగు.
4.ఆ.వె:తరువు నొకటి నాటు తరతరములకును
బతుకు తెరువు చూపి బాధ తీర్చు
పచ్చనైన చెట్టు పసిడి కాంతుల తోడ
పరవశింప జేసి ఫలము లొసగు.
5.ఆ.వె:పచ్చనైన చెట్లు భారతావనికొసగు
నంతులేని సిరుల ననవరతము
అగ్రదేశములకును నాదర్శ మగునట్లు
పెంచవయ్య తరులు ప్రీతి తోడ.
6.ఆ.వె:హరిత భరిత మైన తరుసమూహములెల్ల
యేపుగాను పెరుగ నింపుతోడ
ప్రకృతి కాంత మనము పరవశమొందగా
హర్ష చిత్తులైరి యవని జనులు
7.ఆ.వె:జగతి లోని జనులు సద్భావనము తోడ
చేయి చేయి కలిపి చెట్లు నాట
హరిత వనము వోలె నలరారు దేశమ్ము
పుడమి తల్లి తాను పులకరించు.
8.ఆ.వె:భావి తరములందు ప్రజల కుపకరించు
తరులు పెంచ బ్రతుకు ధన్యమగును
సేద తీర్చునట్టి చెట్లను గాంచుచు
ముగ్ధులగుచు వారు మెత్తురయ్య.
9.ఆ.వె:వృక్షసంపదున్న రేడువు నీవౌదు
లేమి యన్న మాట లేనె లేదు
ఆంధ్ర దేశమన్న నన్నపూర్ణ యనెడి
ఖ్యాతి నంది నట్టి ప్రాంత మిదియె.
10.ఆ.వె:ఔషధోప యుక్త మైన వృక్షములను
విరివి గాను పెంచ విలువ పెరుగు
దేశమునకు ఖ్యాతి దేహమునకు మేలు
కలుగు చెట్లు పెంచి ఘనుడ వగుము..
11.ఆ.వె:బాటకిరుగడల పచ్చని చెట్లను
నాట యలుపు దీర్చు నలుగురికవి
చెట్లు నరుకు చుండ చేటు తప్పదటంచు
నెరుగుమయ్య పుత్ర యిలను నీవు.12.ఆ.వె:ప్రకృతి పరవశించ వసుధపచ్చగ నుండుతరులు విరుల నొసగ తావి నిండుచెట్లు పెంచు చుండ చేకూరు భాగ్యముల్చెట్లు నరుకు చుండ చెడును ప్రగతి.