Friday, May 8, 2020

కార్మికులుప్రజపద్యం వారి కార్మికసంక్షేమము.1.కొరకు వ్రాసిన పద్యములు. ఆ.వె:పొట్ట కూటి కొరకు పుడమిలో కార్మికుల్ పగలు రేయి యనక పనులు చేయ కడుపు నిండలేక కష్టాలు మెండయ్యె బ్రతుకు నందుమిగిలె బాధ లెల్ల. ఆ.వె:కార్మికులిల కడుపు బట్టుకొనుచు నెంత శ్రమ పడినను నింత సుఖము గానకడలు చుండ్రి కష్టముల్ కడతేరు మార్గ మెపుడు వచ్చు మహిని దేవ. ఆ.వె:శ్రమకు తగిన ఫలము జగతిన కనరాక కుమిలె కార్మికుండు కువలయాన నాలు బిడ్డలకిట నాహార మిడలేని దుస్థితిని తలంచి దుఃఖపడును. ఆ.వె:పగలు రేయి యనక పట్టు చీరలు నేసి యమ్మకాని కిడగ నసలు గిట్టు బాటు ధరయు రాక బాధతో విలపించు కార్మికులను గాంచ కలుగు వెతయు. ఉ:కట్టుచు మేడలన్ భువిని కార్మిక సోదరు లెల్లరున్నిటన్ పొట్టకు నిండుగా తినగ పూజ్యము నయ్యెను ధారుణిన్ గనన్ చెట్టుకు పుట్టకున్ చనిరి చింతలు మెండుగ నయ్యె నో ప్రభూ గుట్టుగ మానమున్ నిలిపి కూరిమి తోడను నన్నుకావుమా!


No comments:

Post a Comment