Sunday, January 29, 2017

నా పద్యాలు

[12/5/2016, 6:15 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:905,906,907,908,909.
ఛందస్సు: ఆ.వె:,సీ.
అంశం:నేటి సూక్తి.
ఆ.వె:విద్య నేర్పు వారు నాద్యలే నెప్పుడూ
         వెతలె నేర్పు నన్ని పిదప మనకు
         దారి చూపు నవియె ధరలోన,వగవక
        నాగకుండ సాగ నవి నశించు.

ఆ.వె:పాఠశాలలందు పాఠములను నేర్పు
          చుండు నెపుడు నొజ్జ సులభరీతి
           బ్రతుకు పాఠములను బాధలే నేర్పుచు
            సహన గుణము నొసగి  శాంతి నిచ్చు.

ఆ.వె:తెలియని విషయములు తెలుపు వారెల్లరు
         మార్గ దర్శకులని మదిని నమ్మి
          సాగు చుండ మనకు సంతసమ్ము కలుగు
         నట్టి వారు గురువు లనుచు  దలచు.

ఆ.వె:నేర్పు జీవితమ్ము నెమ్మితో పాఠముల్
       యనుభవమ్ము నేర్పు నన్ని పనులు
        కష్టములకు నెపుడు కలత పడగ బోకు
       బాధలే దెలుపును బ్రతుకు తీరు.

సీ:కష్టము లనియెడు కడలిని దాటంగ
       ననుభవమ్ము నేర్పు ననుట నిజము
     విద్యల నరయుచు వేవేగ తెలివిని
        పెంచుకుని గురువటంచు నెంచు
     పాఠములు గురువు పదిలముగా నేర్పు
       బడిలో తెలియనివి బ్రతుకు నేర్పు
   బోధలు చేసెడి బుధులెల్ల గురువులె
      ననుచు దలచు మెపుడు నాదరాన
ఆ.వె:వెతల వల్ల దెలియు విశ్వజనుల తీరు
       నోర్పు తోడ నరయు ముర్వి యందు
       నోర్పు నేర్పు నున్న నొనగూడు నన్నియూ
        ననుచు తెలియుమయ్య ననవ రతము.
[12/5/2016, 8:55 PM] Dr Umadevi B: S VD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:910,911,912,913,914,915,916,917.
ఛందస్సు: ఆ.వె:
అంశం:అమరగాయకుడు ఘంటసాల
ఆ.వె: ఘంటసాల వారి ఘనమైన పాటల
         కోట్ల జనుల మదిని కూర్మి పంచ
        తనదు కీర్తి నెపుడు ధరలోన నిలుపునీ
       పాటలన్నమాట పచ్చి నిజము.

ఆ.వె:ఘంటసాల వారి కమనీయ కంఠమ్ము
         మేలుకొలుపు జనుల మేదినందు
        వారి పాట వినని వారుందురా భువిన్
        పాడె సాటి లేని పాట లెన్నొ

ఆ.వె:చౌటుపల్లి యందు జన్మించె నీతడు
         భజన వేళ లందు పాటపాడ
        గాంచి నట్టి జనులు గానగాంధర్వుడంచు,
       బాలభరతు డంచు ప్రస్తుతించ్రి

ఆ.వె:శ్రమును పడియె తాను సంగీతమును నేర్వ
         పరుల గృహము లందు పనులు చేసి
        పట్టుదలను బూని బాగుగా నేర్వంగ
        వేలి యుంగరమ్ము విపిణి నమ్మె.

ఆ.వె:మొదటి కబళమిడిన ముదితను మరువని
        యుత్తమోత్తముండు నుర్వియందు
        కూర్మి చూపె తాను గొప్ప వాడైనను
        పరుల కెపుడు సాయ పడుచు నుండె.

ఆ.వె:తనదు పెండ్లినాడు తానె పాటలు పాడి
         యచ్చెరువున ముంచె నవని జనుల
          భక్తి పాటలైన రక్తి పాటలె యైన
        పాడి గెలిచె నెల్ల ప్రజల మనము.

ఆ.వె:విజయనగరమందు విద్య నేర్వదలచి
         పూటకొక్కరింట పొట్ట నింపు
          కొనుచు గడిపె నటులె కొంతకాలమటుల
           గానమటులె నేర్చె గరిమతోడ.

ఆ.వె:పూవుల వెతలన్ని పూసగుచ్చినటుల
         పరవశాన  తాను పాట పాడి
        జనుల మదిని దోచి జగతిలో సుస్థిల
      స్థాన మందె ఘంటసాల గనుడు.
[12/5/2016, 9:25 PM] Dr Umadevi B: ధన్యవాదాలండీ నాగేశ్వరరావు గారూ.సవరించాను ఓసారి చూడండి.
ననుచు దలచు మయ్య నాదరాన
[12/5/2016, 9:47 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:918,919,920.
ఛందస్సు: కందము.
అంశము:సమస్యా పూరణము.
* వనమే భాగ్యము జనులకు వసుధా స్థలిపై *
కం:వనములు పెంచుడు నరకక
     వనమే భాగ్యము జనులకు వసుధాస్థలిపై
     ననుచును పెంచిన మేలగు
వనములు పెరుగగ జగతిన వర్షము కురియున్

కం:వనసిరి యిచ్చును మందులు
    మనుజుల కెపుడును విడువక మహిలో గనుమా
     మనలకు సకలము నొసగెడి
   వనమే భాగ్యము జనులకు వసుధాస్థలిపై.

కం:క్షణముఁజింతించని జీ
    వనమే భాగ్యము జనులకు వసుధాస్థలిపై
    ననుచును మదిలో కొలువుము
   ననయము  శ్రీహరి సతతము నానందముతోన్.
[12/5/2016, 10:19 PM] Dr Umadevi B: పిన్నకవారూ సవరించానండీ.ధన్యవాదాలు.
ఆ.వె:చౌటుపల్లి యందు జన్మించె నీతడు
         భజన వేళ లందు పాటపాడ
        గాంచి నట్టి జనులు గానసామ్రాటంచు
         బాలభరతు డంచు ప్రస్తుతించ్రి
[12/6/2016, 3:13 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:921,922,923,924,925,926
ఛందస్సు: ఆ.వె:
అంశం:నేటి సూక్తి.

ఆ.వె:ధైర్యమొక్కటున్న ధరలోన జనులకు
       బలమదెంతొ వచ్చు నెలమి తోడ
       సకల కార్యములును సాధింప వచ్చున
       టంచు బల్కు చుందు రార్యు లిలను.
     
ఆ.వె:దైర్యవంతు లిలను శౌర్యము చూపుచూ
      యుద్ధ రంగ మందు యోధులగుచు
      శత్రు మూకపైన సమరము చేయుచు
      విజయమంద గలరు వెరపు లేక.

ఆ.వె:పిరికివాడవైన వెక్కిరింతురు నిన్ను
     పిరికి తనము వీడ వీరుడౌదు
    ధీరగుణము యున్న దేశమందెల్లడ
     తెగువ చూపగలవు తెగువ తోడ.

ఆ.వె:హడలి పోకు మయ్య నాపదలెదురైన
      పారద్రోలు మయ్య భయము నెపుడు
      ధీరగుణము పెరుగ భీరత్వముండదు
      సాగు నన్ని పనులు చక్కగాను.

ఆ.వె:పిరికితనముతోడ బెరకుగా దాగిన
       తెగడు చుందురయ్య తీరుబడిగ
      ధీరగుణము చూపి పోరాటమును సల్ప
       శౌర్యవంతుడంచు సన్నుతింత్రు.

ఆ.వె:కష్ట మొదవి నపుడు కంట నీరు నిడక
       గడ్డిపోచలల్లె కడకు నెట్టు
       ధైర్యమనెడు శరము దాపున నుండంగ
         సాగవయ్య ముందు సాహసాన.
[12/6/2016, 4:51 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:927,928.
ఛందస్సు:కందము
అంశం: ఈగ తేనెటీగ

ఆ.వె:తేనెటీగ లున్న తేనె దొరుకుచుండు
        రోగములవి వచ్చు నీగలున్న
        తేటి త్రాగు నెపుడు తీయని మధువును
         వాలు నీగ తీపి వస్తువందు.

ఆ.వె:తిరుగు నీగ లెపుడు తినెడి వస్తువులపై
       నారగించ నవియు నబ్బు జబ్బు
       తేనెటీగ లెపుడు తిరిగి పూవులపైన
      పంచుచుండు తేనె పరుల కెల్ల.
[12/6/2016, 5:10 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:929.
ఛందస్సు:కందము
అంశం: సమస్యా పూరణం
*కాకికి కంఠంబు నిండ కాంచన శోభల్ *
కం:శాకము లొండగ పైసలు
      లేకయు నొకనికిలను గుబులే పుట్టన్ నే
       చీకుయు లేని మనుజుడే
       కాకి కి కంఠంబు నిండ కాంచన శోభల్.
[12/7/2016, 4:58 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:930,931,932,933,934,935,936,937.
ఛందస్సు: ఆటవెలది,కందము.
అంశం: నేటిసూక్తి.

ఆ.వె:దీపమున్న యింట దేవతలుందురు
       దీపమార్పి వేయ తిమిర మగును
       తిమిర మున్న చోట దేవతలుండరు
       శాంతి యుండ బోద శాంతి మిగులు.

ఆ.వె:పదుగురున్నచోట వడినేగి దివ్వెను
       నార్ప బోకుమయ్య నవని యందు
       పరుల కొరకు నీవు బాధల  నొందంగ
       నేమి లాభ మబ్బు నిపుడు దెలుపు.

ఆ.వె:పరుల తెలువి నెపుడు భంగించ దలచకు
       పట్టు నీకి కూడ నట్టి స్థితియు
       హాని తలప బోకు నవనులో జనులకు
        దాన కలుగు నీకు ధరను చేటు.

ఆ.వె:ఎదుట నున్న వారి నిబ్బంది పాల్జేయ
        నెంచ బోకు నదియు మంచి గాదు
          హాని చేయచూడ నంటును నీకిల
          తెలిసి మసులు కొనుము తెలుగు బాల.

ఆ.వె:పరుల బాగు జూచి భరియింప జాలక
         కష్టములిడ నెంచ నష్ట మగున
         టంచు మరువ బోకు మయ్య మహిని నీవు
          పరుల మేలు కోర బ్రతుకు పండు.

ఆ.వె:పదుగురికి వెలుతురు పంచెడి దివ్వెను
        నార్ప బోకు మెపుడు ,నవని యందు
         తిమిర మదియు నీకు దిగులును హెచ్చించు
        ననెడి మాట నిజమటంచు నమ్ము.
       
ఆ.వె:జనుల నడుమ వెలుగు చక్కని దీపమున్
        నార్ప నెంచ బోకు  నయము కాదు
       చీకటందు నీవు చిత్తయి పోదువు
       వెలుగు పంచి నీవు వెలుగు మయ్య.


కం:  దీపము తొలగించు నిరులు
      దీపము పంచును వెలుగును దశదిశలందున్
       దీపము నార్పిన నీవును
  తాపము నొందుటయు నిజము ధరలో నెపుడున్.
[12/7/2016, 6:25 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:938,939,940,941,942,943,944,945
ఛందస్సు: ఆటవెలది.
అంశం:జయలలిత

ఆ.వె:జనన మొందె తాను జయరాము సంధ్యల
        నోము పంటగానె నుర్వి యందు
       పసి తనాన తండ్రి పరమపదించగా
       తాపమణచు కొనుచు తల్లి పెంచె.

ఆ.వె:వేలుపై వెలిగెను వెండితెరకు తాను
          అగ్రనటులతోడ నభినయమ్ము
       నదురు బెదురు లేక నతివ సల్పుచునున్న
       జయలలితను చూచి జగతి మెచ్చె.
     
ఆ.వె:అమ్మగానె ప్రజల నాదరణమ్మును
         పొందె గాదె నతివ పుడమి యందు
         నాటు పోట్ల నెన్నొ నలయక నోర్చిన
        సాటి లేని మేటి బోటి యయ్యె.

ఆ.వె:తమిళ ప్రజల కెల్ల తల్లియై మసలుచు
         వారి బాధ లెల్ల బాప తాను
         నిశ్చయించి ,తీర్చె నిలలోన నిజముగా
         నమ్మ యన్న నమ్మ యయ్యె భువిని.

ఆ.వె:రాజకీయములను రామచంద్రుని వెంట (యమ్జీ ఆర్)
      నడచి నేర్చు కొనియె నతివ తాను
        రాజ్యసభను చేరి రాజకీయము నేర్చి
         ముఖ్యమంత్రి యయ్యె ముదము తోడ.
   
ఆ.వె:చక్కగా నటించె చలనచిత్రములందు
         నగ్రనటుల తోడ నతివ తాను
        నన్ని పాత్రలందు నలవోకగ నొదగ
        మేలు మేలటంచు మెచ్చె జగతి.
       
ఆ.వె:దక్షణాది యందు తారయై వెలుగొందె
          కన్నె గానె గడిపె కాలమెల్ల
           భాషపైన పట్టు బహుముఖ ప్రజ్ఞయు
          గలిగి నట్టి మేటి గరిత లలిత/యీమె.
 
ఆ.వె:భారతమ్మునందు పడతి ద్రౌపది యట్లు
         దుస్ససేను వంటి దుష్టుడొకడు
         లాగె కొలువు నందు లలన కోక నపుడు
         సహన భావమూని సభను వీడె.
[12/8/2016, 6:01 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:946,947,948,949..950
ఛందస్సు:తే.గీ,ఆ.వె,
అంశం: సమస్యా పూరణ
తే.గీ:యోచనము చేయ కుండగ నుర్వి యందు
      నధ్యయనమును చేయంగ నయము గాదు
      నటులె చేయక తగినట్టి యధ్యయనము
      చింతనమును చేయ ఫలము చిక్క బోదు.

తే.గీ:అనవరతమదెంత యధ్యయనమ్మును
      చేయ బూనిన ఫలితము జీవితమున
      చింతనములేక నేదియు చెంత రాదు
       చదువ తలపుతో ఫలమబ్బు సదయులార.

తే.గీ:చదివినది యంతయు నిలలో చక్కగాను
        చింతనమ్మును చేసిన సేమమగును
       జింతనమ్మది లేక చదువెంత చదివి
      నను జగతి నుపయోగము నాస్తి యౌను.

ఆ.వె:అధ్యయనము వలన నావగింజంతైన
         ఫలిత ముండబోదు వసుధ యందు
        చింతనమ్ము తోడ చెంతచేరు నదియు
        తలపుతోడ చదువ తెలియునన్ని.

ఆ.వె:అధ్యయనము లేక నాలోచనము రాదు
         మంచి యోచనమొనరించ కున్న
          వ్యర్థమీ చదువులు వసుధ యందు ననెడి
           పలుకు లందు నిజము గలదు గనుడ
[12/8/2016, 6:37 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:951,952,953..954,955..956
ఛందస్సు: ఆ.వె;
అంశం: దేవదాసీలు.
ఆ.వె:బసవి యనొడి పేర వసుధలో పలుచోట్ల
       దేవదాసి యనగ దేహమొసగి
     పుట్టినింట నుండి భోగము లొందుచు
      గడుపు చుందు రిటులె కాలమెల్

ఆ.వె:కన్నెగానె బ్రతుకు గడుపు చుండవలెను
        దేవదాసినులిల దేవళముల
     పూజలు వ్రతము లను పుడమిలో చేయుచు
    నుపవశించు చుంద్రు నోర్పు తోడ.

ఆ.వె:ఉత్సవముల యందు నుత్సాహమును జూపి
      యొక్కపూట తినుచు నుర్వియందు
       దేవుని సతి యంచు దేవదాసిని చేయ
      బసవి,జోగిను లుగ బ్రతుకు చుంద్రు.

ఆ.వె:సంఘమందు నీమె సరసులచెంతను
       నేవగింపు నున్న నెదురు పల్క
      బోదు చింత తోనె పొద్దు పుచ్చుచునుండు
       దేవదాసి యన్న దేహ దాసె

ఆ.వె:రాజుల యుగమందు రాణిలా జీవించి
        నట్టి వీరలిప్పు డవని యందు
        కన్నె పిల్లలుగనె కాలము గడుపుచు
         పరులకు సుఖమొసగ బ్రతుకు చుంద్రు.

ఆ.వె:నృత్య కళయనంగ నేటికీ స్వంతము
      దేవదాసిలదని దేశమందు
       ననుచు నుంద్రు గాని నాకలి దీర్చంగ
       చేతుమనుచు నిపుడు చెప్పు చుంద్రు.
[12/9/2016, 5:48 PM] Dr Umadevi B: SVD:22

పేరు:సహస్రకవిభూషణ

డా.బల్లూరి ఉమాదేవి

పద్యసంఖ్య:957,958,959,960,961,962,963,964,965,966,967,968.(12 పద్యములు)

ఛందస్సు: ఆటవెలది.

అంశం: నేటిసూక్తి


ఆ.వె: మంచి మాటలెపుడు మాననీయము లంచు

         నెెరుగు మయ్య మదిని నెపుడు నీవు

        రత్నహారమటుల రహితోడ మదినిల్పు

        మాటె మంత్రమంచు మరువ బోకు



ఆ.వె:మాట యిలను ధనపు మూటవంటిది యంచు

       దాల్చ వలెను యెదను ధరణి యందు

       గొప్ప వారి మాట కూరిమితో  విన్న

      ముదము నంద గలవు ముందు ముందు.

 

ఆ.వె:విలువ గలిగినట్టి వలువల కన్నను

        నాణ్యమైన పసిడి నగల కన్న

       మంచి మాట యొకటి మహిలోన గొప్దది

       మాన్యతొసగు చుండ మంచి జరుగు


ఆ.వె:మహిని పెద్ద వారి మాటలెపుడు విన్న

   మంచి జరుగు నీకు నెంచి చూడ

   పసిడి నగల వోలె వాక్కులు సైతము

యెదను నిల్ప వయ్య యింపు గలుగు.


ఆ.వె:వలువల వలె మహిని వాక్కులు సైతము

       పరుల మెప్పు పొంద వాసి గుండ

      మంచి మాట లెపుడు మదిని నిలుపు చుండ

       జనలు మెత్తురయ్య జగతి యందు.


ఆ.వె:మంచి మాటతోడ మహిని గెల్వగ వచ్చు

        మంచి మాట వినుచు మదిని దాచ

           వెలుగు చుండు  మాట విస్తృతముగనది

            వెలుగు బాట చూపు విశ్వమందు.

             

ఆ.వె:ఆభరణము లన్ని నందముగాదాల్చి

      కోట్ల విలువ యున్నకోక గట్టి

       పొందికైన మాట భువినిపలుకుటయె

       భూషణమ్ము నంద్రు బుధులు వినుడు.


ఆ.వె:వలువలందమున్న విలువ కొంత లభించు

        మెడను హారమున్న మేలటండ్రు

       మాట మదిన నిల్ప మహిలోన ముత్యమై

        వెలుగు గుండు నెపుడు కలుగు ముదము


ఆ.వె:రహిని గూర్చు నెపుడు రత్నపతక మెదను

         నటులె మంచిమాట లాలకించి        

         మదిని దాచ కల్గు  మంచి యశ మటంచు

         నందురయ్య జనులు నవని యందు.


ఆ.వె:తనువు నందమున్న తగిన సంపద యున్న

        విలువపెంచు నట్టి వలువ లున్న

       వాటి తోడు మంచిమాటది లేకున్న

        వ్యర్థమౌను గనుమువసుధ యందు.


ఆ.వె:కోట్ల విలువచేయు కుందనమున్నను

         మెరయుచున్నహార మెదను నుండు

         నట్లు మంచిపల్కులాలించి మదిలోన

          దాచి యుంచ కల్గు ధరను శుభము.


కం:పలుకే యాభరణంబిల

    పలుకే యొసగును జగతినిభద్రము నీకున్

    పలుకును మదిలో సతతము

    నిలుపగ మహిలో విజయము నెప్పుడు/నిజముగ గల్గున్.
[12/10/2016, 5:32 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూ ి ఉమాదేవి
పద్యసంఖ్య:974,975,976
ఛందస్సు: ఆట వెలది
అంశం: నేటి సూక్తి
ఆ.వె:పరుల స్వేచ్ఛ నెపుడు భంగపరచ రాదు
        తలను దూర్చ రాదు తగని చోట్ల
         హద్దు లెరిగి మసల హాయిగా నుండును
        ననెడి విషయ మెపుడు నరయవలయు.

ఆ.వె:పరుల విషయమందు చొరబడి వారికిన్
       అడగకుండగ సలహాల నొసగ
      చులకనౌదువయ్య యిలయందు నీవును
      అడిగి నపుడు దెలిపి  యశము పొందు.
   
     
ఆ.వె:అన్య జనుల స్వేచ్ఛ నడ్డుకోదలచుట
       సబబు గాదు గనుము సంఘమందు
      పరుల విషయమందు తరచుగా దూరిన
       భంగపడుదు వయ్య పదుగురెదుట.
[12/10/2016, 6:02 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:977,978,979,980,981.
ఛందస్సు: ఆటవెలది
అంశం: నాగార్జున సాగర్

ఆ.వె:  ఆనకట్టలందు నతి పెద్ద దైనది
  బహుళ యర్థకముల వసుధలోన
 నొసగు నట్టి దిదియు నుర్విజనుల కెల్ల
ననుచు నుందు రయ్య నాదరాన.

ఆ.వె:  వేల యెకరములకు విస్తారముగ నీరు
         నందచేయునట్టి యానకట్ట
         నంతె గాక నిదియు నందచందములతో
          చూపరులకు కూర్చు సోయగమ్ము.

ఆ.వె:  నందికొండపైన నాగార్జునుండుతా
         శిష్యవర్గమునకు చేసె బోధ
         నలను ,గాన వెలసె నాగార్జునునిపేర
         నానకట్ట యయ్యె నవని యందు.

ఆ.వె:  వర్ష ఋతువు నందు వాన నీరట చేర
          కనుల విందొనర్చు ఘనముగాను
          నదుల వెంట వెలయు నాగరికతయును
           సూక్తి సత్యమగును జూడ భువిని.

ఆ.వె:  నీటి లోన పడవ నెక్కి ప్రయాణించ
           సంబరమ్ము కలుగ సాగు చుంద్రు
           ప్రకృతి సోయగాలు పరవశాన గనగ
            తరలి వచ్చుచుంద్రు ధరను జనులు
.
[12/11/2016, 11:27 AM] Dr Umadevi B: పద్యాలసవ్వడి
svd:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
11/12/16

గ్రామం:కామవరం

మండలం:కౌతాళం
జిల్లా:కర్నూల్
ఆంధ్రప్రదేశ్

మాతృభాష

ఆ.వె:తెలుగు భాష నెవరు తేలిక చేసినా
           నూరకుండ బోకు నుర్వి యందు
           తెలుగు వాడినంచు దీటుగా స్పందించు
          తెలుగు వాడి వేడి తెట పరచు.

ఆత్మవంచన
.సీ:చేవలేని పనులు చేయుచు కొందరు
            తామె గొప్ప యనుచు ధరణి యందు
        గొప్పలు పలుకుచు కూరిమింతయు లేక
             మరచి పోయినటుల మమత వీడి          
        యాత్మ వంచన తోడ నహరహమ్ము పరుల
           బాధించి కాలము బరువు గాను
      గడుపుచుందురు గనుము తెలివి యనుచు
         నట్టి వారు తుదకు నాత్మలోన
ఆ.వె:చిత్త ము భ్రమ చెంద సిగ్గుతో తలవాల్చి
        మనసులోని బాధ మరువ లేక
        తాము చేసిన పనియె తాపమొసగె నంచు
       నేడ్చుచుందురిదియు నిజము నిజము.

సంస్కారము:
చదువు బాగ చదువ సంస్కారమబ్బును
మంచి పేరువచ్చు మానవులకు
బీద గొప్ప యనెడి భేదములెంచక
కలసి మెలసి యున్న ఖ్యాతి గల్గు.
[12/12/2016, 3:55 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:985
ఛందస్సు: ఆ.వె:
అంశం: నేటిసూక్తి
సీ:మూర్ఖజనులతోడ ముదమున నెయ్యమున్
      క్రూర జనులతోడ కూరిమియును
 చోరజనులతోడ సుస్నేహ బంధమున్
     నసమర్థ జనులతో ననువుగాని
వ్యాపార మెప్పుడు ఫలితమివ్వగ బోదు
   నటువలె  భువిలోన నచ్చనట్టి
వ్యక్తులతో గూడి బ్రతుకు గడుపుటయున్
    కూడదనుచు జనులు కోరుచుందు
ఆ .వె:రట్టి పలుకులు విని యాచరించగ నీకు
        మంచి జరుగునయ్య మహిని జూడ
        పరులు మెచ్చునట్టి పనులను చేయుచు
      బ్రతుకు చుండ భావి పండుగౌను.
[12/12/2016, 6:52 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:986 నుండి 1005 వరకు 20 పద్యములు
ఛందస్సు: ఆ.వె,కం.
అంశం: భగవద్గీత

ఆ.వె:భారత రణమందు పాండుతనయునకు
       తెలిపె కృష్ణు డచట తెలుసుకొమ్మ
      టంచు పదునెనిమిది యధ్యాయములతోడ
      నున్న గీత  నచట నొప్పు గాను.

ఆ.వె:యుద్ధభూమిలోన యోధు లిద్దరు చేయు
        భాషణమ్మె నదియు భారతాన
        భక్తి గ్రంథ మవగ పఠియింత్రు జనులెల్ల
         ముక్తి మార్గమనుచు ముదము తోడ.

ఆ.వె:కామ రహితమైన కార్యాచరణమున
         మనసు శుద్ధి యౌను మహిని జూడ
        నట్టి మనసె వలయు నాధ్యాత్మితకటంచు
        చక్కగాను గీత జగతి చాటె.

ఆ.వె:భక్తియోగమనగ బ భావశుద్ధియెనంచు
          వ్యక్తి పరము గాక భక్తి పూర్వ
            కముగ తెలియ మనుచు ఘనుడైన యాశౌరి
          చేసె తత్త్వబోధ శీఘ్రము గను.

ఆ.వె:శరణు జొచ్చు వారు సంతాపమందరు
          మూడు గుణములకును మోహితు లవ
         కుండ దాట గలరు కూర్మితోడ భువిని
           యనుచు దెల్పె శౌరి యర్జునునకు.

ఆ.వె:జనన మరణ మాది సంసార సంద్రాన
        నంతు గాన కీదు లాడు చుండి
      మాయ వశము చేత మలమూత్రములతోడ
       నిండినట్టి తనువె నిజమటంచు.

ఆ.వె:ధర్మ క్షేతఅరమిదియె కర్మభూమియు నిదే
        పోరు సలుప లేను పుడమి నిపుడు
        తోడబుట్టువులను దురమందు చంపుట
        పాడియౌనె దెల్పు పరమ పురుష.

ఆ.వె:తనువు నదురు చుండె ధనువు జారుచు నుండె
       రణము చేయ లేను రథము నిలుపు
       మనుచు కోరినట్టి యర్జును తోడను
       వినుమటంచు పలికె వెన్ను డపుడు.

ఆ.వె:చేయు వాడనిలను చేయించు వాడను
          నేనె పార్థ వినుము నీవు కాదు
       పనులు మాత్రమీవు పదిలముగ చేయుము
      ఫలిత మొసగు వాడ పార్థ నేనే.

ఆ.వె:మూఢ తనము నిపుడు ముందుగా వీడుము
        ధైర్య మూను మయ్య ధరణియందు
       జయము నందు వేళ జడుపదేలనీకు
       భారమెల్ల మోపు పార్థ నీవు.

ఆ.వె:నేను నాది యనున దేదియు నిలలేదు
       నాది యనెడి దేది నీది కాదు
       దురభిమానము విడి తొడుగుము కవచమున్
         పోరు సలుప లెమ్ము పుడమియందు.

ఆ.వె:పనులు చేయ వలెను భక్తి పూర్వకముగ
        ఫలిత మునుగురించి వాంఛ వలదు
         ఆత్మకెపుడు నాశ మనునది లేదయ్య
         తనువు స్థిరము కాదు ధరణి యందు.

ఆ.వె:కామ రహితమైన కార్యములను చేయ
   నుద్భవించు జ్ఞాన ముర్వి యందు
     కామ క్రోధములవి కార్చిచ్చు వంటివి
      కాల్చు చుండు నవియు కడకు నిన్ను.

ఆ.వె:ధర్మ మునిటు నిల్ప దలచుచు కృష్ణుడు
        యుగయుగముల యందు యుత్సుకతన
        కుమతులనిల లోన కూల్చి వేయ దలచి
         నవతరించుచుండు ననవరతము.

ఆ.వె:గుణములందు సత్త్వ గుణము శ్రేష్ట
      మటంచు
 తమము వీడి చూడు ధరణి యందు
     వెలుగు కానవచ్చు వివ్వచ్చుడా యంచు
      శౌరి తెలియచేసె సంతసాన.
   
ఆ.వె:ఆత్మ కాలబోదు అగ్నిలో నెపుడును
         నీరు తడుపలేదు నెపుడు దాని
       వాయువార్పలేదు వసుధలో నాత్మను
       శాశ్వతంబు నదియు జగతి యందు.

ఆ.వె:జయము నపజయమును సమముగా గైకొన్న
    కర్మబంధము విడి ఘనుడ వౌదు
     మోహము విడ నీవు ముక్తుడౌదువటంచు
       నచ్యుతుండు దెలిపె నాదరాన.

ఆ.వె:కుతకమెక్కువైన కోరికల్ కలుగును
         కోర్కె తీరకున్న క్రోధ మొదవు
         క్రోధ మధికమైన కువలయమందున
        పతనమది మొదలగు పార్థ వినుము.

ఆ.వె:పరమ గోప్యమైన భగవంతు నుక్తిని
           నాలకించి పల్కె నర్జునుండు
          మోహమెల్ల తొలగె  మోహనకృష్ణుడా
         నాచరింతు నయ్య నాహవమ్ము.


కం:అష్టమ సుతుడై పుట్టుచు
  శిష్టుల కావంగ బోధ చేసెను గీతన్
   యిష్టముతో విని పార్థుడు
  తుష్టుండై పోరు సల్పె దురమున వడిగాన్.
[12/13/2016, 6:50 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1006,1007.
ఛందస్సు: ఆ.వె:
అంశం: నేటిసూక్తి
ఆ.వె:మంచితనము చేత మహిలోన మిత్రుల
       బంధుజనుల మదిని బాగుగాను
      గెలువ వచ్చు నటులె లలనామణులకిల
          దాన మొసగకూర్మి దాన కలుగు.

ఆ.వె:దాస జనుల పట్ల దయను చూపుచునుండు
        సేవ చేయు వారి సేమ మరసి
       గౌర వించు మెపుడు;గరితల కిలలోన
        కానుకలొస గంగ గరిమ హెచ్చు.
[12/13/2016, 7:16 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1008,1009,1010,1011.
ఛందస్సు: ఆ.వె:
అంశం: జలగ
ఆ.వె:జలగ ద్వార నేడు జగతిలో వైద్యము
      చేయ రోగి యొక్క చెడు రక్త
      మెల్ల పీల్చి రుజను మెల్లగ తగ్గించు
       నన్నమాట నిజము నమ్ముడయ్య.

ఆ.వె:నీటిలోవసించు నెత్తురు పీల్చుచు
    బ్రతుకు చుండు నిదియు వసుధ యందు
     చర్మరోగములను చక్కగా తొలగించి
      తనువు కాంతి పెంచు తరుణులకును.

ఆ.వె:చెడు రక్తమున్న చీముపట్టిన గాని
         జలగ వలన తగ్గు జగతి యందు
          పట్టు బట్ట నిదియు వదల బోదందురు
          పసుపు పైన వేయ పట్టు విడును.

ఆ.వె:పట్టు బట్ట నొక్క పట్టాన వదలద
          టండ్రు జలగ,నటులె యప్పు లొసగి
         వసుధ యందు ధనము వడ్డీలు గుంజగా
       బాధ పడుచు జనులు బ్రతుకు చుంద్రు.
[12/13/2016, 8:41 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1012,1013,1014,1015.
ఛందస్సు: ఆ.వె:
అంశం: సమస్యాపూరణం
*ఆట యందు జచ్చె నసురర విభుడు*
ఆ.వె:శిష్ట జనుల కావ శ్రీ కృష్ణుడుదయించె
         బందిఖానలోనె వసుధయందు
         మధుర పురికి నేగి మామ తో పోర నా
         యాట యందు జచ్చె నసుర విభుడు.

ఆ.వె:మల్లయుద్ధ మందు మట్టుపెట్టదలచి
       సింహబలుని భీమ సేను డపుడు
       సలిపె క్రీడ లాగ  జరుపుచున్నట్టి పో
      రాట మందు జచ్చె నసుర విభుడు.

ఆ.వె:బాలుడైన యట్టి ప్రహ్లాదుఁగావంగ
      స్తంభమందు బుట్టె శౌరి తాను
       ఛలము తోడ యచట జరిగిన యట్టిపో
       రాటమందు జచ్చె నసుర విభుడు.

ఆ.వె:రమణి సీతను గొని రావణాసురుడట
       కయ్యమునకు తాను కాలు దువ్వె
      రామచంద్రుడొచ్చి రణముచేయంగ పో
     రాట మందు జచ్చె నసుర వరుడు.
[12/14/2016, 3:04 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1016,1017,1018
ఛందస్సు: కం,ఆ.వె:
అంశం: నేటిసూక్తి.

కం:అతి నిద్ర భయము క్రోధము
నతినెమ్మదితనము మరియు నలసత్వంబున్
సతతము బద్దకమును విడ
నితోధికమైన సొమ్ము నిలలభియించున్.


ఆ.వె:భయము నుజ్జగించి బద్దకమునువీడి
నెమ్మదైన పనులు నిద్దురయును
కువలయమ్ము నందు కోపమాలస్యమున్
విడువ సంపదెల్ల వెంట వచ్చు.

ఆ.వె:బద్దకమును వీడి నిద్దురయును మాని
అలసతయును,భయము నలుకయు నతి
నెమ్మది యును వీడ నిద్ధర సంపద
లబ్బు ననెడి మాట లగ్గు కూర్చు.
[12/14/2016, 6:04 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1019,1020..1021.
ఛందస్సు: ఆ.వె:
అంశం: తెలిసి తెలియని వారు
ఆవె:తెలియని జనులకును తెలుపగ వచ్చును
       తెలిసిన ప్రజకిలను తెలుప గలము
       తెలిసి తెలియనట్లు దిరిగెడి వానికి
      వసుధ లోన తెలుప వశము గాదు.

ఆ.వె:కష్ట సాధ్యమైన కార్యము లన్నియు
      సాధ్య పరచవచ్చు శక్తి తోడ
       తనయభిమతమదియె ధరలోన ఘనమని
        తలచు వాని మార్చ తరము కదు

ఆ.వె:సకల మెరిగి నట్టి జనులకు జగతిన
       నెరుక పరచ వచ్చు నెమ్మి తోడ
      నన్ని తెలిసి నట్టు నటియించు వానిని
     నలువ మార్చలేడు నమ్ముడయ్య.
[12/15/2016, 1:19 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1022,1023..1024..1025,1026
ఛందస్సు: ఆ.వె:సీసము,కందము.
అంశం: నేటిసూక్తి:
ఆ.వె:ధనము కోరి రాజు రణములు చేయును
      కలహమెపుడు కోరు ఖలుడు తాను
      నీగ వాలు చుండు నెప్పుడూ చెత్తపై
        శాంతికోరు చుంద్రు సాధు జనులు.

ఆ.వె:ధనము కోరుచుండు ధరలోన భూపతి
        కత్తి తీయుచుండు ఖలుడు నెపుడు
        మక్షికంబుకోరు మలినంపు తిండిని
         శాంతి కోరు వారు సాధు జనులు.

ఆ.వె:ఈగలెపుడు వాలు నిరుకుసందులలోన
      అధముడెపుడు కోరు నాహవము నిలలో
       ప్రభువు సతము కోరు పైకమవనియందు
        శాంతి వలయు నెపుడు సాధువులకు.

సీ:మార్చలేరెవరిని మహిలోన జూడంగ
      జన్మగుణము లివియు జనులకెల్ల
   ధనము కోరుచు నుంద్రు ధరణిలో రాజులు
       నెమ్మనమున కోరు నీచుడెపుడు
   పోరును,నీగలె పుడుచెత్త పై వ్రాలు
      సాధువు లెల్లరు శాంతిఁ గోరి
   సంచరింతురుగదా  సతముబోధించుచు
       నాలకించెడివార లవని నెవరు?

ఆ.వె:జనుల తీరు నెపుడు జగతిలో మారదు
         కర్మననుసరించి కార్య మొదవు
         మంచివారలెపుడు మంచినే కోరంగ
         ఖలులు కోరు చుంద్రు కలహములను.

కం:కత్తులు దూయు ఖలుడెపుడు
     విత్తము నాశించుచుండు విడువక రేడున్
     చెత్తను కోరును నీగయు
    నుత్తము లగువారుశాంతి నొగి కాంక్షింతుర్.
[12/16/2016, 4:49 PM] Dr Umadevi B: నాటి ఖ్యాతి నందె  నవని యందు.

SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1035,1036,1037,1038.
ఛందస్సు: ఆ.వె:
16/12/16
అంశం: నేటిసూక్తి.

ఆ.వె:చదువుకు సమ  మైన చక్షువిలను లేదు
       సత్యవాక్యమదియె నిత్య తపము
       వలపు నధికమైన వగపు పెరుగుచుండు
       చాగబుద్ధియున్న శాంతి కలుగు.

ఆ.వె:కన్ను లున్నయట్లె కరమున చదువున్న
        పలుకు సత్యమదియె నిలను తపము
         రాగమొసగు వ్యథను త్యాగ మిచ్చు సుఖము
         ననెడి మాట నిక్క మవని యందు.

ఆ.వె:మంచి చదువ దున్న మహినవే నేత్రముల్
         రాగమున్న వ్యథయు త్యాగమున్న సుఖము
       సత్యమన్న గనుము జగతి తపమె
        నరసి మసలు కొనుము ననవరతము.

ఆ.వె:నేత్రములవె యౌను నిజమైన చదువున్న
         సమము తపము తోడ సత్య వాక్కు
         ఆర్తి యొసగు నెపుడు ననురాగమిలలోన
         ఈవి యొసగు సుఖము నిలను నిజము.
[12/16/2016, 5:48 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1035,1036,1037,1038.
ఛందస్సు: ఆ.వె:
16/12/16
అంశం:పుస్తెలు మట్టెలు.
ఆ.వె:పుస్తెలున్న పడతి పుడమిలో మాన్యయై
         గౌరవింపబడును ఘనము గాను
         మట్టెలు ధరియించి నట్టింట తిరుగంగ
          నపర లక్ష్మి యనుచు నాదరింత్రు.

ఆ.వె: కాలి వేలు తగుల నేలకు విద్యుత్తు
      వచ్చునందురయ్య వసుధయందు
      మట్టెల నిటు దాల్చ మంటనాపగలుగు
        శక్తి వచ్చు నండ్రు జగతి యందు.

ఆ.వె:భారతీయతనిట బాగుగా చాటేవి
         మట్టెలు మరి తాళి బొట్ట టండ్రు
        నివియె చిహ్నమౌను నిలను భాగ్యమునకున్
          పడతులెపుడు దాల్చ భాగ్యమబ్బు.

ఆ.వె:రమణి దాల్చు సతము రజతపు మట్టెలు
         కాలి వేళ్ళ కెపుడు ఘనముగాను
         నాడు లన్నియు నట నమరియుండుట వల్ల
         నతివ రుజలు మాను నవని యందు.

ఆ.వె:పుస్తెల నిల నల్లపూసల దాల్చుచు
         గాజులు కరములకు కాలి వేళ్ళ
          కెపుడు వెండి మట్టె లిలలోన ధరియించి
           తిరుగు నతివఁజూడ తృప్తి కలుగు.
     
ఆ.వె:పెండ్ల యైన పడతి ప్రేమతో దాల్చును
        కాలి వేళ్ళకెంతొ కాంతినిచ్చు
         మట్టెలెపుడు తనకు,కట్టిన తాళిని
         కనులకద్దు కొనుచు గడుపు పొద్దు.

ఆ.వె:పసిడి నగలు వలదు పట్టుపాన్పు వలదు
       తాళి యొక్కటున్న ధరణిలోన
        భాగ్య మెల్ల నబ్బు పతియె సౌభాగ్యమ
        టంచు పలుకు చుండు నతివ యెపుడు.

కం:మట్టెల సవ్వడి తోడను
     గట్టిగ రవళించుచున్న గాజులతోడన్
      కట్టిన తాళియు నెప్పుడు
      దిట్టముగా నుండ సతియు దేవుని కోరు
[12/16/2016, 10:05 PM] Dr Umadevi B: పద్యాలసవ్వడి

svd no:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి.
పద్యసంఖ్య:1039
ఛందస్సు:సీసము
అంశం:నేటిసూక్తి
విద్యగొప్పదెపుడు విశ్వమందు చూడ
     కనుల కంటెనుకూడ ఘనము నిదియె
ననవరతము తపమాచరించుట కన్న
       సత్యపాలనమది జగతి గొప్ప
రాగమధికమైన వగపు హెచ్చుచు నుండు
సుఖమనునదియు నెచ్చో టనైన
త్యాగము కంటెను ధరను నెక్కు వవగ
బోదు యనెడి వార్త పుడమి యందెల్లను
నరసి మసలు నున్న నాదర్శ వ్యక్తివై
ఖ్యాతి నందు దువయ  గరిమ తోడ
కాన విద్యనేర్వ కలుగును శాంతను
మాట మరువ బోకు.
[12/16/2016, 10:23 PM] Dr Umadevi B: సవరణలతో
svd no:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి.
పద్యసంఖ్య:1039
ఛందస్సు:సీసము
అంశం:నేటిసూక్తి
విద్యగొప్పదెపుడు విశ్వమందు నుచూడ
     కనుల కంటెనుకూడ ఘనము నిదియె
ననవరతము తపమాచరించుట కన్న
       సత్యపాలనమది జగతి గొప్ప
రాగమధికమైన వగపు హెచ్చుచు నుండు
     సుఖమనునదియు నెచ్చో టనైన
త్యాగము కంటెను ధరను నెక్కు వవగ
     బోదు యనెడి వార్త పుడమి యందు
ఆ.వె:నరసి మసలు నున్న నాదర్శ వ్యక్తివై
       ఖ్యాతి నందు దువయ  గరిమ తోడ
      కాన విద్యనేర్వ కలుగును శాంతను
      మాట మరువ బోకు మహిని నీవు.
[12/17/2016, 4:42 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1040,1041,1042.,1043,1044
ఛందస్సు: ఆ.వె:
అంశం: నేటిసూక్తి.
ఆ.వె:ఒజ్జ చెంత విద్య నుర్వి యందున నేర్వ
         వలయు నెల్ల జనులు వసుధయందు
         నదియు నెట్లు ననగ నయముగా గునపాన
          గొయ్యి తవ్వి జలము గూర్చి నట్లు.

ఆ.వె:మానవుండు గొయ్యి మానుగ ద్రవ్వుచు
       జలము దెచ్చి నట్లు జగతి యందు
       గురువు చరణములను గొప్పగా సేవించి
       విద్య నేర్వు మయ్య వేగమీవు.

ఆ.వె:భూమి తల్లిఁద్రవ్వి భూగర్భజలమున్
         త్రవ్వి తీసి నట్లు తపనతోడ
       గురువు చెంత చేరి గుట్టుగా విద్యలన్
       నేర్వ వలెను గాదె నేర్పు తోడ.
     
 ఆ.వె:నేల తల్లిఁ త్రవ్వి నీరు గైకొన్నట్లు
         నిష్ట పూర్వకముగ నిలను జనులు
      గురువు చెంత చేరి గుహ్యమైన చదువు
      నేర్వ వలయు పరమ నిష్ట తోడ.

ఆ.వె:నేల త్రవ్వినంత నీటి యూటయు రాదు
          కష్ట పడక నెపుడు కార్యమవదు
         నాశ్రయించు మెపుడు నధ్యాపకుల పాద
         మబ్బు నీకు చదువు నవని యందు.
[12/17/2016, 6:35 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1048
ఛందస్సు: కం.
అంశం: సమస్యాపూరణం
*వృద్ధ పితామహుడు లక్ష్మి బెండిలి యాడెన్.*

కం:బుద్ధులు చెప్పుచు జగతిన
      వృద్ధపితామహుడు లక్ష్మిఁ బెండిలి యాడెన్
      వృద్ధియు కావలె కులమని
       వద్దని చెప్పెడి పలుకులు వసుధలొ వినకన్.
[12/17/2016, 6:42 PM] Dr Umadevi B: సవరించిన పద్యాలు
SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1040,1041,1042.,1043,1044
ఛందస్సు: ఆ.వె:
అంశం: నేటిసూక్తి.
ఆ.వె:ఒజ్జ చెంత విద్య నుర్వి యందున నేర్వ
         వలయు నెల్ల జనులు వాసిగాను
         నదియు నెట్లు ననగ నయముగా గునపాన
          గొయ్యి తవ్వి జలము గూర్చి నట్లు.

ఆ.వె:మానవుండు గొయ్యి మానుగ ద్రవ్వుచు
       జలము దెచ్చి నట్లు జగతి యందు
       గురువు చరణములను గొప్పగా సేవించి
       విద్య నేర్వు మయ్య వేగమీవు.

ఆ.వె:భూమి తల్లిఁద్రవ్వి భూగర్భజలములన్
         త్రవ్వి తీసి నట్లు తపనతోడ
       గురువు చెంత చేరి గుట్టుగా విద్యలన్
       నేర్వ వలెను గాదె నేర్పు తోడ.
     
 ఆ.వె:నేల తల్లిఁ త్రవ్వి నీరు గైకొనినటు
         లిష్ట పూర్వకముగ నిలను జనులు
      గురువు చెంత చేరి గుహ్యమైన చదువు
      నేర్వ వలయు పరమ నిష్ట తోడ.

ఆ.వె:నేల త్రవ్వినంత నీటి యూటయు రాదు
          కష్ట పడక నెపుడు కార్యమవదు
         ఆశ్రయించు మెపుడు నధ్యాపకుల పాద
         మబ్బు నీకు చదువు నవని యందు.
[12/18/2016, 5:46 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1049.,1050.,1051,1052..1053.
ఛందస్సు: ఆ.వె:
అంశం: నేటిసూక్తి
18/12/16

కం:తనమనమున సతతము గత
      మును దలచెడి వాడెపుడును ముదుసలి యవగా
       ఘనముగ భావిని దలచుచు
      మనమున చింతించు వాడు మహియవ్వనుడే.

కం:తనగత యనుభవములనిల
     ననవరతము దలచు వాడు నగు ముదుసలి తా
  ఘనముగ భవితను సతతము
   మనమున యూహించు వాడు మహి యువకు డగున్.

ఆ.వె:భవిత గూర్చి తలచి బ్రతుకువాడిలలోన
        నిత్య యవ్వనుండు నిజము నిజము
       పాతసంగతులను పదెపదె తలచెడి
       వాడు జగతి ముసలి వాడె గనుము.
     
ఆ.వె:గతమును దలచుచును గంభీరముగ కాల
        మునుగడిపెడి వాడు పుడమిలోన
        ముసలివాడె నండ్రు ముదమున భవితను
       తలచి మురియువాడె తరుణు డెపుడు.

ఆ.వె:జరిగినట్టి దాని జగతిన తలచుచు
         వేదనొందు వాడు వృద్ధుడౌను
          భావిని గురియించి బాగుగా తలచెడి
         వాడె ఘను డగుచు వాసిగాంచు.
[12/18/2016, 8:00 PM] Dr Umadevi B: శీర్షిక:  అమ్మ.
1.ఆ.వె:తల్లి ప్రేమ విలువ ధరణిలో నెంచంగ
      తరమె యేరి కైన దలచి చూడ
       ముద్దు మోము గాంచి మురియుచు నాతల్లి
         భాగ్యశాలి నంచు పరవశించు..
2.ఆ.వె:ఆకలెరగి తాను నడగక పోయినా
           కడుపు చూసి నింపు కరుణ తోడ
           సుంత బాధ పడిన సొమ్మసిల్లును తాను
          అమ్మ ప్రేమ కిలను నంత మేది.
3.ఆ.వె:తల్లి ప్రేమ కెవడు ధరను గట్టగలడు
             సాటిలేని యట్టి మేటి మమత
               నంద చేయు శక్తి యమ్మదే మహిలోన
             తల్లికన్న నెవరు దైవ మిలను.
4.ఆ.వె:విశ్వమందు తాను వేదనను భరియించి
             జన్మ మొసగు నట్టి జనని యెపుడు
              దైవ మేగ నెంచ ధరణిలో సర్వదా
             దైవతములకెల్ల దైవమామె.

5.కం:అమ్మను మించిన దైవ
          మ్మిమ్మహిలో నెందు గనిన నెచ్చట లేదే
           కమ్మగ బిడ్డలు తల్లిని
          నమ్మా యని పిలువగనె హాయిని బొందున
[12/19/2016, 4:41 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1054,1055,1056,1057
,1058
ఛందస్సు: ఆ.వె:,తే.గీ,కం.
అంశం: నేటిసూక్తి

ఆ.వె:పండితులను చేర పాండిత్యమబ్బును
        దాన కలుగు విద్య ధరణి యందు
        విద్యతోడ కలుగు వినయంబు నెప్పుడు
         జనులు మెత్తురయ్య సంతసాన.

ఆ.వె:చదువు నేర్వ వలయు చక్కగా విద్వాంసు
        చెంత సుంత యైన చింత లేక
         విద్యతోడ కల్గు వినయంబు నచ్చోట
       ప్రేమ కల్గు జనుల హృదయమందు.

తే.గీ:పండితులతో తిరుగ బుద్ధి వంతుడగును
      విద్యతోడ తనకిలను  వినయ మబ్బు
       విద్య వినయంబు లున్నచో వేగిరమ్మె
       దక్కు ప్రేమాను రాగాలు ధరణి యందు.

తే.గీ:పండితుల సహవాసము వలన నెన్నొ
      మంచి విద్యలు లభియించి మాన్యుడగును
     దాని వలన నబ్బు వినయము దప్పకిలను              
     మమత యనురాగములు నబ్బు మహిని జూడ.

కం:మెండుగ భక్తిని జూపుచు
       పండితులను చేరకలుగు వసుధను విద్యల్
      దండిగ వినయంబబ్బగ
       నిండుగ జనులెల్ల మెచ్చ నెమ్మది కల్గున్.
[12/19/2016, 6:00 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1062,1063,1064,1065,1066,1067.
ఛందస్సు: ఆ.వె:
అంశం: వధూవరులు

1.ఆ.వె:ధరను పెండ్లి జరిగె 'ధరణి నాగేంద్ర'ల
         శుభవివాహమిచట చూడరండు
         నాశిసులను నొసగ నందరు హరుహాన
           తరలి రండు నక్షతలను వేయ.

2.ఆ.వె:దివిని దేవతలును భువినిపండితుల్
           నిర్ణయించినట్టి నిశ్చయమిది
       పెళ్ళి మంటపమున పేర్మి తో 'నాగేంద్ర'
     మరి'ధరణి'లకిల మనువు కుదిరె.

3.ఆ.వె:చేయి చేయి కలిపి చేదోడు వాదోడు
            గాను జీవనమ్ము గరుపుటకును
             పెద్దలెల్ల చేరి పెళ్ళి నిశ్చయమును
            చేసినారు కాన శీఘ్రముగను,

4.ఆ.వె:రండు మిత్రులార రమణీయముగ పెళ్ళి
          గాంచు దాము మనము కన్నులార
         "ఆలుమగలు మీరు హాయిగా నుండుడు"
          జగము మెచ్చునట్టి జంట యగుడు.

5.ఆ.వె:దైవకరుణ మంది దీర్ఘాయువును పొంది
        సంతసాన మీరు జనుమ మెల్ల
         పాలు శర్కరముల వలెను బ్రతుక గడుప వలె
       ననుచు మ్రొక్కు డయ్య నాది దంపతులకు.

ఆ.వె:వధువును విడ నంచు వరుడు బాసను చేయు
        వధువు వలన పెరుగు వంశ మెల్ల
     కలిసి చేయునట్టి కాపురమ్మె యగును
     పూలనావ నిజము పుడమి యందు.
[12/19/2016, 8:47 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1059,1060,1061
ఛందస్సు: కందము
అంశం: సమస్యా పూరణము
కం:ఇచ్చకముల నాడుచుతా
      పచ్చల హారమును కోరె పడతియు మగనిన్
     దెచ్చెచు మామయె మొగుడై
     నెచ్చెలి కోరికను మామ నేర్పున దీర్చెన్.

కం:ముచ్చట తోడను తరుణిని
      మెచ్చుచు పరిణయమునాడ మేదిని లోనన్
      దెచ్చుచు వజ్రపుహారము
      నెచ్చెలి కోరికను మామ నేర్పున దీర్చెన్.

కం:వచ్చెను తారయు మోజున
     తుచ్ఛపు సుఖముల వాంఛ తోడను దరికిన్
       మెచ్చుచు గురుసతి యనకయె
       నెచ్చెలి కోరికను మామ నేర్పున దీర్చె
[12/20/2016, 4:59 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1075,1076,1077,1078,1079.
ఛందస్సు: ఆ.వె:కందము .
అంశం:నేటిసూక్తి

ఆ.వె:సంతసమ్ము గూర్చు జగతిలో నెప్పుడూ
        తాపము దొలగించి తనువునకును
      హితము కూర్చు నట్టి వింపైన గీతముల్
        సతము వినుచు నుండ శాంతి కల్గు.
       
ఆ.వె:తాపముడుపి మనకు ధరలోన ముదమును
      కూర్చు చుండు సతము కూర్మి తోడ
     జంతు జాలములకు సత్త్వమొసగుచున్న
   గానమిదియె రండు గనగ మీరు.
   
ఆ.వె:హర్ష మొసగు నిదియు నవనిలో జనులకు
        వలపు నందు నైన వగపు నైన
       జంతు జాలములకు సంకీర్తన మటంచు
      నాదరాన నుడివె యన్నమయ్య.

ఆ.వె:జనుల బాధ లెపుడు జగతిలో బాపుచూ
     సంతసమ్ముతోడ జయము నొసగు
      జంతుజాలములను చక్కగా కాపాడు
      నదియు నామ స్మరణ మండ్రు బుధులు.

కం:హరిసంకీర్తనమే యిల
     నరులకు ముదమిచ్చి తాప నాశమొనర్చున్
      పరవశమును గూర్చుచు తా
      పరిపరి విధముల సకలుర పరిరక్షించున్.
[12/20/2016, 6:57 PM] Dr Umadevi B: సవరణలతో
ఆ.వె:జనుల మనములోని జడుపులు తొలగించి
        సతము నింపు చుండు సంతసమ్ము
      హరి ననవరతమ్ము నర్చించి కీర్తించ
       జయము కల్గు ననుట సత్య మిలను.

తే.గీ:నవ విధములగు భక్తులు నవని యందు
      గలవు నందు కీర్తనంబు ఘనము నెపుడు
      కీర్తనములను బాడంగ నార్తి దొలగు
   . పక్షులకును పశువు లకున్ వసుధయందు.
[12/20/2016, 8:37 PM] Dr Umadevi B: సవరించిన పద్యం

తే.గీ:నవ విధములగు భక్తులు నవని యందు
      గలవు నందు కీర్తనమది ఘనము నెపుడు
      కీర్తనములను బాడంగ నార్తి దొలగు
   . పక్షులకును పశువు లకున్ వసుధయందు.
[12/21/2016, 10:11 AM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1086,1087
ఛందస్సు: ఆ.వె:
అంశం:ధర్మరాజు గారిచ్చిన సూక్తికి బద్యములు.
ఆ.వె:జన్మ మొసగి నట్టి జనని కంటెను గొప్ప
        కార్యమేది లేదు గనుడు మీరు
        కాశి యాత్రకన్న కడలి స్నానము కన్న
          నమ్మ సేవ మిన్న నవని యందు.

ఆ.వె:భూప్రదక్షణములు పొలుపుగా చేసినా
          తీర్థయాత్రలనుచు దేశములను
          వచ్చు ఫలముకన్న వసుధ నమ్మకు మ్రొక్క
          పుణ్యమబ్బు ననుట పొల్లు కాదు
[12/21/2016, 6:21 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1091 నుండి 1102వరకు
 12 పద్యములు
ఛందస్సు: ఆ.వె:
అంశం:రైతు దుస్థితి.

ఆ.వె:పుడమి యందు రైతు పొలము దున్నుచు నుండి
         పగలురేయి యనక పాటు పడగ
          పంట  పండె గాని పైకమే రాదయ్యె
         అప్పు లటులె మిగిలె నవని యందు.                  

.ఆ.వె:అన్నదాత తానె నవనిలో నొకనాడు
         మింగ జూత మన్న మెతుకు లేదు
       కాల మెంత మారె కష్టాలు మెండాయ
        యేమి చేయవలయు నేది దారి.                              

..ఆ.వె:అందమైన పంట యవనిలో పండించి
        పంట చూసి మదిని పరవశించ
       వర్షధార చేత బాగుగా తడిసిన
         ధాన్యము గని రైతు తల్లడిల్లె                                    

  .ఆ.వె:అప్పు మిగిలి పోయె తిప్పలు మెండాయె
           నడలి పోయి చూచె నన్నదాత
         వరుణుని దయలేక పంటలెండగ తాలు
             ధాన్యము గని రైతు తల్లడిల్లె.    
                           
ఆ.వె:అన్న దాత యన్న నవనిలో రైతేను
       అన్నమిచ్చు వాడు నతడు గాదె?
      తాను కష్టపడుచు ధరణి జనులకెల్ల
       పంట లంద చేయు పదిలముగను.

ఆ.వె:వర్ష మెక్కు వైన పడక పోయినగాని
         బాధ పడుచు నుండు బడుగు రైతు
         పగలు రేయి యనక పాటు పడుచునున్న
         ఫలిత మేమి లేక బాధ పడును.

ఆ.వె:విత్తు తెచ్చి నాటి వేచిచూచుచునుండ
         వాన జాడ లేక వడలె తాను
        చేసినట్టి యప్పు చిక్కుల నిడుచుండ
        నడలు చుండె తాను  నవని యందు.

ఆ.వె:అరక చేత బట్టి యనవరతంబిటు
        పొలము దున్నుచుండు పుడమి యందు
        ముచ్చటగను తాను మూడు పనులను చేయు
         విత్తు నాటి పెరుగ కోయుచుండు.

ఆ.వె:అన్నదాత యనగ నవనిలో రైతేను
         ననుచు  పొగడు చుండ హర్ష మొందు
          వర్ష ధార లేక వట్టి పోగా నేల
         గుండె లవియునట్లు కుమిలె తాను.

ఆ.వె:పుడమి లోన రైతు పొద్దస్తమానముల్
         పాటు పడుచు నున్న ఫలము సున్న
         కాపు గాచె గాని కాసులె రావయ్యె
        ఆలి మెడను పుస్తె లమ్మ వలసె.

ఆవె:వానకురియ రైతు వదనము వికసించె
        పంట పండు ననుచు పరవశించె
         కుంభ వృష్టి కురియ కుములుచు రైతన్న
         భోరు మనుచు నేడ్చె పుడమి యందు.
       
   ఆ.వె:కుండ పోత గాను కురిసేను వర్షమ్ము
        అన్నదాత గుండె లవసి పోయె
       చేతి వద్ద పంట చేజారి పోవగా
        కంటి ముందు నప్పు కానిపించె.
[12/22/2016, 3:57 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1103,1104 ,1105,1106
ఛందస్సు: ఆ.వె:
అంశం:నేటిసూక్తి

ఆ.వె:పరులననుసరించి బ్రతుకుట కంటెను
   వనిని వృక్ష మగుట వాసి గాదె
    పశులు పక్షులవలె బ్రతికిన మేలౌను
     దాస్యపు బ్రతుకన్మ ధరను రోత.

ఆ.వె:తరువు కెంతొ స్వేచ్ఛ ధరణిలో గలదయ్య
       పశువు లైన మరియు పక్షులైన
      క్రూరమృగములైన కూరిమితో బ్రతుకు
      పరుల నాశ్రయించ బతుకు రోత.

ఆ.వె:పక్షి యెగుర గలదు బానిసత్వములేక
      పశువు పక్షులెల్ల బతుక గలవు
     యాంక్షలేవి లేక నడవుల యందున
      బానిసలుగ నిలను బ్రతుక నేల?

ఆ.వె:ధనికులిండ్ల యందు దాస్యము చేయక                    
        పశువు పక్షు లల్లె పరవశాన
        గడుప వచ్చు బ్రతుకు కష్టములకు నోర్చి
      యనుచు నరయు మయ్య ననవరతము.
[12/22/2016, 4:58 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1107,1108.
ఛందస్సు: ఆ.వె:
అంశం:మానవ సేవే మాధవ సేవ

ఆ.వె:అవిటి వారికైన నంధుల కైనను
       సాయ పడిన మెచ్చు శౌరి యెపుడు
       ఆర్త జనుల సేవె యాపరంధాముని
      సేవ యనుచు సతము చేయవయ్య.

ఆ.వె:గుడుల కేగి హరిని కొలుచుట కంటెను
        వెలుపలున్న జనుల విసుగు కొనక
         చేత నైన కొలది చేయూత నివ్వంగ
       స్వామి మెచ్చు నెపుడు జగతి యందు.
[12/22/2016, 5:49 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1109,1110,1111.
ఛందస్సు: ఆ.వె:
అంశం:సమస్యా పూరణం.
సమస్య: *కలడు కలండనెడి వాడు కలనుం గనమే.*
ఆ.వె:కలడెచ్చట నీ శ్రీహరి
         నిలలో జూపుము ననుచును నిడగా నిడుముల్
       పలికెను ప్రహ్లాదుడు తా
      కలడు కలండనెడి వాని కలనుం గనమే!

ఆ.వె:కొలిచెడు జనముల కెపుడును
     తలచిన మాత్రాన కృపను ధరలో చూపున్
      సులువుగ వరముల నొసగుచు
     కలడు కలండనెడి వాని కలనుం గనమే.

ఆ.వె:పిలిచిన వెంటనె వత్తువు
       తలచిన యంతనె వసుధను తరుణికి వలువల్
        విలువను తెలిసిన వారికి
  కలడు కలండనెడి వాని కలనుం గనమే.
[12/25/2016, 5:28 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1112,1113,1114,1115
ఛందస్సు: ఆ.వె:
అంశం;ఏసుక్రీస్తు
ఆ.వె:గొడ్ల పాక యందు కూరిమి నింపుచు
       నవతరించె యేసు నవని యందు
      మురిసె మేరి జనులు మోదము నందిరి
      తొలగె వెతలటంచు తృప్తి తోడ.

ఆ.వె:తోటి వారి కెల్ల తోడుపడు డనుచు  
        నిలను తెలిపె తాను హితము నపుడు
        మనుజులందు చూపు మంచి కరుణనంచు
        శిలువ నెక్కె తాను శీఘ్రముగను.

ఆ.వె:పరవశించి ప్రజలు భజనలు చేయంగ
        నర్ధరాత్రమందు నవనియందు
        పుట్టయేసుక్రీస్తు పులకరించుచు తాను
       సంబరాలు జరిపె సంతసాన.

తే.గీ:శాంతి సందేశములనిట సకల జనుల
       కంద జేయగ వచ్చెను నర్ధరాత్ర
     ౹మందు క్రీస్తు గనగరండు నాదరాన
      సంబరములు హెచ్చాయె సదయులార.
[12/25/2016, 7:27 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1116,1117,1118.
ఛందస్సు: ఆ.వె:
ఆ.వె:మంచి పూలనుండి మధువును గ్రోలుచు
       తేనెటీగ లొసగు తేనె నెపుడు
       నటులె మంచి గ్రంథ మక్కరన్ జదువ
       బుద్ధిమంతు డగును పుడమి యందు.

ఆ.వె:అన్ని పూల నుండి యానందముగ తాను
       తేనె గ్రోలి నట్లు తేనె టీగ
       విద్య నేర్వ వలయు వేగమే గ్రంథముల్
       చదువు కొనుచు జనులు జగతి యందు.

తే.గీ:భువిని విడువక సతతము పుస్తకమును
      చదివిన కలుగు జ్ఞానము చక్కగాను
      తేనె టీగలువిరిలోని తేనెఁగ్రోలి
      నటుల  పండితుడై వెల్గు ననవరతము.
[12/26/2016, 7:55 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1123,1124,1125..1126..1127
అంశం:అటల్ బిహారి వాజపేయ్
26/12/16.
ఆ.వె:భరత జాతి గన్న భాగ్యశాలి యితడు
        బ్రహ్మచారిగానె బ్రతుకు గడిపె
        దిగువ నెగువ సభల దేశమందెన్నికై
        వాసిగాంచె గనుడు వాజపేయి.

ఆ.వె:ముదము తోడ ప్రజలు మూడు పర్యాయముల్
      నెన్ను కొనగ నయ్యె నేత యితడు
      కఠిన తరములైన కార్యములొనరించి
       మంచి పేరు నందె మహిని గనుడు.

ఆ.వె:పాంచజన్య మాది పత్రికలందున
        పనియు చేసె నితడు ,వాసిగాను
         వాణిని విని మంచి పార్లమెంటేరియ
          నంచు జనులు పొగడి రవని యందు.

ఆ.వె:వాజపేయి గొప్ప పండితోత్తముడౌను
        మంచి రచన లెన్నొ మహిని జేసె
         భాషలందు మంచి పట్టును గలిగిన
           ధన్యజీవి యితడు ధరణి యందు.

ఆ.వె:భరత దేశమందు ప్రఖ్యాతిగాంచిన
       బిరుదులందినట్టి ధీరుడితడు
       ప్రజల సేవె తనకు పరమావధి యనుచు
        పాలనమ్ము చేసె వాజపేయి.
[12/27/2016, 7:15 PM] Dr Umadevi B: రు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1128.
అంశం:నేటిసూక్తి.
ఆ.వె:కన్నె పిల్లలకును గర్భవతులకును
       కొత్తదంపతులకు కూర్మి తోడ      
        వయసు మీరినట్టి వారికి, రోగికిన్
         అన్న మిడిన ముందు నఘము రాదు.
[12/27/2016, 8:54 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1129..1130,1131
అంశం:కవి -రవి
ఆ.వె:సకల విషయములను సర్వసాక్షి గనును
       గగన మందు రవియుకాననవియు
      నెల్ల కాంచుచుండు నిలను కవియనుట
       సత్యదూరమవదు జగతి యందు.
     

కం:వేకువ నొసగెడు రవియును
    తాకరుణ నుజూప పంట ధరణిన పండున్
    నాకము జూడక పోయిన
     యీకవి చూచిన యటువలె నభివర్ణించున్.

ఆ.వె:రవియు నింగి యందు రాణించుచు సతము
       వెలుగు నొసగి జనుల వెతలు దీర్చు
       కమ్మనైన యట్టి కావ్యముల్ వ్రాయుచు
      కవియు జనుల గుండె గదిని దూరు.
[12/28/2016, 7:29 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1132,1133,1134,1135,1136,1137
ఛందస్సు:తే.గీ,ఆ.వె,
అంశం:నేటిసూక్తి.

తే.గీ:కలహ మైనను కల్యాణ కార్యమైన
        నుత్తములతోడ చేయంగ నుర్వి యందు
        చెలిమి చేయుచు నుండంగ సేమమొదవు
       కూడ దెప్పుడు స్నేహము కుజను లందు.

ఆ.వె:సత్పురుషుల తోడ సాంగత్యమొనరించ
       శాంతి కల్గు చుండు సౌఖ్య మబ్బు    
       జగడమైనగాని సహవాసమేయైన
       మేలు కలుగు నెపుడు మేదినందు.

ఆ.వె:స్నేహమెపుడు వలయు సుజనుల తోడను
        పనులవేవి యైన వసుధయందు
        కయ్యమైన నదియు నెయ్యమే యైననూ
          మానవులకు నెల్ల మంచి కలుగు.

ఆ.వె:దుర్మతులకు నెపుడు దూరముగా నుండు
       వాదమైన గాని వలపె యైన
        సత్పురుషులతోడ సాగంగ శుభమగు
         కూర్మి చూపవలదు కుజనులందు.

ఆ.వె:చెడ్డ వారి తోడ చెలిమి కూడదెపుడు
       మంచి వారి జతను మసలవలెను
       కలహమైన గాని గమనమైనను గాని
      సాధుజనుల తోడ సలుప వలెను.

ఆ.వె.సత్పురుషుల తోడ సఖ్యము చేయంగ
       దాని వలన మేలు ధరణియందు
      సతము కలుగు చుండు సందేహము వలదు
      దూరముండు మెపుడు దుర్జనులకు

ఆ.వె:పొందు నైన గాని పోరాటమందైన
        మంచి వారి పొత్తు మహిని కలుగ
       బాగుపడును బతుకు వసుధలో నిజముగా
       దుష్ట జనుల తోడ దోస్తి వలదు.
[12/28/2016, 9:13 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1139,1140,1141,1142.
ఛందస్సు:ఆ.వె.
అంశం:కల్తీ మందులు.

ఆ.వె:కలిమి కాశ పడుచు కల్తిమందు లొసగ
        బాధ్యుడౌదు వారి బాధలకును
       నమ్ముకొన్న వారి నాశము కోరకు
       హితము కలుగ బోదు నిలను నీకు.

ఆ.వె.స్వార్థబుద్ధి తోడ జగతిన కొందరు
        మందు కల్తి చేసి మహిని నమ్మ
        వాడినట్టి జనులు వసుధలో మరణింప
        దూరమగును శాంతి దోషి యౌను.

ఆ.వె:పుడమిలోన జనులు పురుగు మందుల కల్తి
        చేసి యమ్ము చుంద్రు కాసుల కాశించి
        నట్టి వారి వలన నన్నదాత బతుకు
        కాలి బూడి దౌను గడియలోనె.

ఆ.వె:గుండె చెరువు యగును కువలయమందున
        కల్తి చేయ మందు కర్షకులకు
         కాలిపోగ పంట కన్నీరు మిగలగ
         తల్లడిల్లు చుంద్రు తపన తోడ.
[12/29/2016, 9:40 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1143,1144
ఛందస్సు :ఆ.వె
అంశం:నేటిసూక్తి.

ఆ.వె:బరువదెక్కువైన పడవ సంద్రమునందు
         చేరలేక దరిని చిక్కు బడిన
       యటుల  వాంఛ లెక్కు వైన సంసారపు
        జలధి దాట తరమె జగతి యందు.

తే.గీ:బరువు నధికమైన పడవ వోలె
        దరికి చేరగ లేక  నాసంద్రమును దాట
      వలను కాక పోయిన యట్లు వసుధ యందు
      భవజలధిని దాటగలేక బాధనొందు.
[12/29/2016, 11:01 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1145,1146,1147.
ఛందస్సు :ఆ.వె,సీసం.
29/12/16
అంశం:ఇల్లరికం.

ఆ.వె:ఇల్లరికపు టల్లుడిలలోన నీతడే
      అత్తవారి యింట నన్ని సుఖము
      లనుభవించు చుండు నమ్మాయికి  మగడై
       పనియు పాట లేక బ్రతుకు చుండు.

ఆ.వె:సుతుడు లేని వారు సుఖముగా తాముండి
        యాడపిల్ల కలుగ నడలి పోక
          నర్హుడైన వరున కాపిల్ల నొసగుచు
          నింట నల్లు నుంచుటిల్లరికము.

సీ:మగసంతు లేనట్టి మామకూతురినిటు
        పెండ్లి యాడి యటనె ప్రేమ పంచి
     కాలమానందముగా గడుపుట యౌను
         నిల్లరికమటన్న నిలను జూడ
     అత్తమామల సేవ నానందముగ చేయు
        జీతము లేనట్టి జీతగాడు
   నైన చులకనౌను నాలితో బాటుతా
         నందరు జనముల కచట చేర
తే.గీ:నటుల కాక పుత్రుడై యత్త వారి
        యింట మసిలిన మెత్తురు నిల్లరికపు
        టల్లు డనెడి హీనత వోయి యల్లుడన్న
        కొడుకనెడి ప్రీతి హెచ్చును కువలయాన.
[12/30/2016, 6:10 PM] Dr Umadevi B: SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1148,1149,1150,1151.
ఛందస్సు :ఆ.వె,సీ.
అంశం:భీష్ముడు

ఆ.వె:బ్రహ్మచారిగానె బ్రతుకును గడిపిన
      ధర్మమూర్తి యతడు ధరణి యందు
        సంగరమ్ము నందు శౌర్యమ్ము జూపిన
       శాంతనవుడితండు సత్యశీలి.

ఆ.వె:సత్యవతిసుతులను చక్కగా పెంచుచున్
        వారి బతుకు దీర్చె వాసిగాను
       వారి తనయులనిల బాగుగా పెంచుచు
       తాత యయ్యె నతడు ధరణి యందు.

ఆ.వె:తండ్రి పెండ్లి కొరకు దాశరాజును కూడి
       మనువు నాడ ననుచు మాట యొసగి
      ప్రతిన చేసి తాను ప్రతిథి పొందెనుగదా
     పుత్రుడన్న నితడె పుడమి యందు.
   

సీ:శాపవశము చేత శంతను పుత్రులై
   భువిని వసువు లెల్ల బుట్టినారు
గంగ తల్లియునయ్యె కలుపుకొనె తనలో
శాపముక్తులైరి సంతసాన
తండ్రికొరకు తాను త్యాగము చేయుచు
  భీషణ ప్రతినతో భీష్ముడయ్యె
దేవవ్రతుడనంగ దీర్ఘాయువును బొంది
శాంతనవుడు తాను చక్కగాను
ఆ.వె:కురుపితామహుడుగ కూరిమిన్ జూపుచు
        యుద్ధరంగమందు యోద్ధ యయ్యె
        శస్త్రములను వీడి సంగర రంగాన
         నంపశయ్య చేరె నమరజీవి.
[12/31/2016, 6:41 AM] Dr Umadevi B: మన్నించండి ఇది నిన్నటిసూక్తికి వ్రాసిన పద్యములు.నెట్ అందుబాటులో లేకపోవడంవల్ల ఆలస్యమైంది


SVD:22
పేరు:సహస్రకవిభూషణ
డా.బల్లూరి ఉమాదేవి
పద్యసంఖ్య:1152,1153,115
ఛందస్సు:ఆ.వె
అంశం:నేటిసూక్తి
ఆ.వె:మంచికీర్తనమ్ము మహిని పాడుచునుండ
         మంచి కర్మలెపుడు మానుగాను
       నాచరించ కల్గు నానందమనుమాట
         మరురబోకు మెపుడు మదిని పుత్రి.

ఆ.వె:ఎదురెదురుగ నుండి నింపును కల్గించు
        కర్మ కీర్తనములు కమ్మిలట్లు
         శుభముకూర్చు చుండు సుజనుల కనయము
         చేయు మెపుడు వీని చింత తొలగు.

ఆ.వె:శాంతి సౌఖ్య మబ్బు సంకీర్తనల చేయ
       నాచరించ కర్మ హర్ష మొదవు
       మంచి మార్గమందు మంచిగా పయనించ
      దైవమెపుడు మెచ్చు ధరణి యందు.

Saturday, January 28, 2017

సమస్యాపూరణం - 3

సమస్య:-క్రాంతి వచ్చినంత కాంతి వచ్చె.
ఆ.వె: పంట చేతి కంది పల్లెలెల్లవెలిగె
అన్నదాత లంద రందముదము
పంటలిచ్చు గొప్ప పర్వమ్మిదనగ సం
క్రాంతి వచ్చినంత కాంతి వచ్చె.
సమస్య:-141.
*సొమ్ము సోకు తిరమె సుగతి నంద.
ధనమదెంత యున్న మన వెంట రాబోదు
పరుల కుపకరింప ఫలము కలుగు
నెఱిగి మసులుకొనుము నీ మాట నిజమని
సొమ్ము సోకు తిరమె సుగతి నంద

ఛలము,బలము,కలము,తలము పదములతో భారతార్థంలో పూరించాను.
పాండు సుతులు నాడు బవరాన "ఛలమును"
దైవ"బలము"తోడ ధరణి గెల్చి
"
సకల" మెల్ల గొనుచు శత్రుమూక జయించ
గగన"తలము"వరకు ఖ్యాతి ప్రాకె.

"మనకు సంవత్సరాది ఉగాది రోజే
చెప్పుకొందాం శుభాకాంక్ష లా రోజే
మంచిని ఎక్కడున్నా గ్రహిద్దాం
అభివృద్ధి పథంలో పయనిద్దాం
అంధానుకరణలను వదిలేద్దాం
అందరం కలసి మెలసి జీవిద్దాం"
మిత్రులందరికి ముక్కోటి ఏకాదశీ శుభాకాంక్షలు మరియు శుభోదయం.
సమస్య : 129
*అత్త లమ్మ లైన దుత్త మిగులు.
ఆ.వె:కొత్త కోడ లైన కూతురై పంచుచు
మమత గెలిచె నత్త మామ మతుల
సొంత యిల్లని మనుచు పతి మురిసె
అత్త లమ్మ లైన దుత్త మిగులు.

సమస్య:--140
తప్పు లొప్పులన్న తప్పు ముప్పు.
ఆ.వె : తాను బట్టినట్టి తాడు పాము యనెడు
మందమతుల తోడ మాటలేల
ముచ్చటెరుగనట్టి మూర్ఖ జనులు చేయు
తప్పు లొప్పు లన్న తప్పు ముప్పు.

సమస్య:--143.
"
జగణముతో జగడమగును జాగ్రత్త సుమా
కం :మగనిని సత్రాజితికో 
రగ పారిజముు వినియనెనురమణుడు, రమణీ
సొగసుగ మనమట కరుగ,ని 
జ గణముతో జగడమగును జాగ్రత్త సుమా.

సమస్య:-139.
*నిటలాక్షుడు దానిని గని నివ్వెర బోయెన్.
కం: అట భస్మాసురు నింజం
పుట యనివార్యం బటంచు పురుషోత్తము డం
తట మోహని గాగ నపుడు 
నిటలాక్షుడు దానిని గని నివ్వెర బోయెన్.

100.నరసింహశతకము:శేషప్పకవి.
నరసింహస్వామి అనుగ్రహముతో ఈశతకములోని 100 పద్యములకు నాకు తెలిసిన విధముగ వివరించినాను.సహృదయముతో ఆదరించిన మిత్రులందరికి హృదయపూర్వక ధన్యవాదములు 
తెలుపు చున్నాను.
ఈ శతక పఠనము వలన కలిగే ప్రయోజనము ,ఫలశ్రుతి శతకకర్తవివరిస్తున్నాడు.ఈ పద్యాలుి,ఎవరు భక్తితో విన్నా వ్రాసినా,సత్ఫలములంది భగవంతుని కృపకు పాత్రులౌతారని,పుస్తకమును పూజించిన కష్టాలు తొలగి పోతాయని ,పుణ్యకరమైన ఈ పుస్తక పఠనము వలన ముక్తికల్గునని శేషప్పకవి వివరించి శతక రచన సంపూర్ణం చేశాడు.
సీ: శేషప్పయనుకవి చెప్పిన పద్యముల్
చెవులకానందమై చెలగుచుండు
నే మనుజుండయిన నెలమి శతకంబు 
భక్తితో విన్న సత్ఫలము కలుగు
చెలగి ఈ పద్యముల్ చేర్చి వ్రాసినవారు
కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగా పుస్తకంబెపుడు పూజించిన
దురితజాలంబులు తొలగి పోవు
నిద్ది పుణ్యాకరంబని యెపుడు జనులు
కష్టమెన్నక పఠియింప గలుగు ముక్తి.
భూషణ వికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
||
శ్రీకృష్ణార్పణమస్తు.||

99.నరసింహశతకము:శేషప్పకవి.
ఓ నరసింహస్వామీ !నిన్ను అనుసరించినవారు ముక్తిని పొందారు.అదేవిధంగా నీ పాదపద్మములు నమ్మిన నాకు మోక్షమివ్వు.నన్ను కడతేర్చి రక్షించి సేవకునిగా చేసుకొని కాపాడితే నీకు సేవకుడినై నీ పనులుచేస్తా వేగమే దృగ్గోచరుడవు కమ్ము అని చనువుగా పలికే కవి పలుకులు విందామా!
సీ: అమరేంద్ర వినుత నిన్ననుసరించినవారు
ముక్తి బొందిరి వేగ ముదముతోడ
నీ పాదపద్మముల్ నెర నమ్మి యున్నాను
నాకు మోక్షంబిమ్ము నళిన నేత్ర
కాచి రక్షించునన్ గడతేర్పు వేగమే
నీ సేవకుని జేయు నిశ్చయముగ
గాపాడినను నీకు గైంకర్యపరుడనై
చెలగి నీ పనులను చేయువాడ
ననుచు బలుమారు వేడెద నబ్జనాభ
నాకు ప్రత్యక్షమగుము నిన్నమ్మినాను
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.

సమస్య:- 136.
*తుమ్మెద మోమున ముసిరెను తోయజ మనుచున్
కం:కమ్మని కమలము బోలు,ము
ఖమ్మును జూచిన సఖుండు కనుచా దీప్తిన్
నెమ్మనమున మరులు గలుగ
తుమ్మెద మోమున ముసిరెను తోయజ మనుచున్.

98.నరసింహశతకము: శేషప్పకవి.
ఓ నరసింహస్వామీ !కాపాడినా నీవే కష్ట పెట్టినా నీవే నిన్నే నమ్ముకొన్నానయ్యా .అప్పుడప్పుడు నీ దివ్య లక్షణ గుణాలు తెలుసుకోలేక వెఱ్ఱి వాడినయ్యాను.ఈ నా వెఱ్ఱి గుణాలు ఖండించి నన్ను రక్షించు స్వామీ అంటూ శతకకర్తతో పాటు మనమూ మొరపెట్టుకొందామా !.
సీ: లక్ష్మీశ నీ దివ్య లక్షణగుణముల
వినజాల కెప్పుడు వెఱ్ఱి నైతి
నా వెఱ్ఱి గుణములు నయముగా 
ఖండించి నన్ను రక్షించుమో నళిననేత్ర
నిన్ను నేనమ్మితి నితర దైవముల నే
నమ్మలేదెప్పడు నాగశయన
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె 
నీపాదకమలముల్ నిరుత మేను
నమ్మి యున్నాను నీపాద నచల భక్తి
వేగ దయచేసి రక్షించు వేదవేద్య
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహదురిత దూర.

సమస్య:-126.
* నత్త పరుగు దీయ నవ్వె లేడి.
ఆ.వె:అల్లుడాడుచుండ నానంద మొదవెను
లేడి గంతు లేయు లేత కూన
లాటల పరికించు నటునిటు వడివడి
నత్త పరుగు దీయ నవ్వె లేడి.

97:-నరసింహశతకము:-శేషప్పకవి.
శతకకర్త ఈ పద్యములో కూర్మ,వరాహ,నరసింహ,వామన, మూర్తులను వివరించారు.ఓ నరసింహస్వామీ!ఇట్టి పనులు నీవు తప్ప మరెవ్వరు చేయగలరని అంటూ స్వామి సామర్థ్యాన్ని కొనియాడే తీరు చూద్దామా!
సీ: కూర్మావతారమై కుధరంబు క్రిందను
కోర్కెతో నుండవా కొమరు మిగుల
వరహావతారమై వనభూములను జొచ్చి 
శిక్షింప హిరణ్యాక్షు నపుడు
నరసింహమూర్తివై నరభోజను 
హిరణ్యకశిపుని ద్రుంపవా కాంతి మీర
వామనరూపమై వసుధలో బలిచక్రవర్తి
నణంపవా వైర ముడిగి
ఇట్టి పనులెల్ల చేయగా నె్వరి కేని 
తగునె నరసింహ నీకె కా దగును గాక
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర.

97:-నరసింహశతకము:-శేషప్పకవి.
శతకకర్త ఈ పద్యములో కూర్మ,వరాహ,నరసింహ,వామన, మూర్తులను వివరించారు.ఓ నరసింహస్వామీ!ఇట్టి పనులు నీవు తప్ప మరెవ్వరు చేయగలరని అంటూ స్వామి సామర్థ్యాన్ని కొనియాడే తీరు చూద్దామా!
సీ: కూర్మావతారమై కుధరంబు క్రిందను
కోర్కెతో నుండవా కొమరు మిగుల
వరహావతారమై వనభూములను జొచ్చి 
శిక్షింప హిరణ్యాక్షు నపుడు
నరసింహమూర్తివై నరభోజను 
హిరణ్యకశిపుని ద్రుంపవా కాంతి మీర
వామనరూపమై వసుధలో బలిచక్రవర్తి
నణంపవా వైర ముడిగి
ఇట్టి పనులెల్ల చేయగా నె్వరి కేని 
తగునె నరసింహ నీకె కా దగును గాక
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర.

సమస్య:123
ఆ.వె: భక్తులెల్ల చేరి భగవంతు గొల్చుచు
తీర్థయాత్ర సలుప తీవ్రముగను
దారి తానె నడుపు దైవమనుచు నమ్ము
పాదచారు లేగ బాట లేల.

96:నరసింహశతకము:-శేషప్పకవి.
సాధారణంగా భగవంతుని స్తుతించాలంటే దశావతారాల వర్ణన తప్పనిసరి.కవి ఈ పద్యంలో మత్స్యావతారకథను వివరిస్తున్నారు.ఆ అవతార ప్రయోజనాన్ని తెలుపుతూ వేదాల నపహరించిన సోమకాసురుని చంపి వేదాల నివ్వడం వల్ల అవని జనులు ఆచార నిష్టలతో ఆచరించి మోక్షార్హులౌతున్నారని వివరిస్తున్నారు.
సీ: మత్స్యావతారమై మడుగు లోపలజొచ్చి
సోమకాసురు ద్రుంచి చోద్యముగను
దెచ్చి వేదములెల్ల దేవ భూసురులకు
మెచ్చి యిచ్చితీవు మేలు నొంది
నా వేదముల నియ్య నాచార నిష్టల
ననుభవించు చునుందురవని సురలు
సకల పాపంబులు సమసి పోవునటంచు
మనుజులందరు నీదు మహిమ దెలిసి
యుందురరవింద నయన యునికి తెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహదురితదూర.


సమస్య :125.
‪#పుస్తకాల చదువు పురుగులందు.
తాత తండ్రు లెల్ల తాటియాకుల యందు
చదువు సంధ్య నేర్చి చక్కనైరి
యంత్రములును వచ్చె నయ్యవార్లును లేక
పుస్తకాల చదువు పురుగులందు.

95:నరసింహశతకము:శేషప్పకవి
దీనరక్షకుడైన స్వామి అందరికి శుభాన్ని,శరణును,మంగళమును,భద్రమును,దిగ్విజయాన్ని,వైభవాన్ని , నిత్యకల్యాణాన్ని,కల్గిస్తాడు కదా!అట్టి స్వామికి "పైవన్నీ"కలగాలని కోరే శతకకర్తతో గొంతుకలిపి మనమూ దండాలుపెడదామా!
సీ: దనుజ సంహార చక్రధర నీకు దండంబు లిందిరాధవ నీకు వందనంబు
పతిత పావన నీకు బహు నమస్కారముల్ నీరజాతదళాక్ష నీకు శరణు
వాసవార్చిత మేఘవర్ణ నీకు భద్రంబు దీనరక్షక నీకు దిగ్విజయము
సకల వైభవములు నీకు సార్వభౌమ
నిత్యకల్యాణములునగు నీకు నెపుడు 
భూషణ వికాసశ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.

సమస్య:123
‪#భక్తి నాగరికత బాట బట్టె
ఆ.వె:నేడు జనుల యందు నిష్ఠ తగ్గుచు, చేయ
చిత్తశుద్ధి లేని చేష్ట లయ్యె,
పాప భీతి నెట్లొ పాపు కొనగ నెంచ,
*భక్తి నాగరికత బాట బట్టె

94.నరసింహశతకము:-శేషప్పకవి.
ఈ లోకంలో దుర్మార్గులతో చెలిమి చేస్తే కల్గె చేటును గురించి కవి చక్కగా వివరిస్తున్నాడు.కాస్తో కూస్తో తెలివున్నవారెవరు ఇలాంటి పనులు చేయరు.ఒకవేళ చేస్తే ఎలా వుంటుందో చక్కని పోలికలతో వివరిస్తున్నారు.పాము పుట్టలమీద పవ్వళించినట్లు,పులుల గుంపు చేరబోయినట్లు.మొసళ్ళు నిండిన మడుగులో ప్రవేశించినట్లు,గంగ సమీపంలో ఇల్లు కట్టినట్లు,చెదలున్న భూమిలో చాప వేసినట్లు,ఓటి బిందెలో పాలు ఉంచినట్లు,-----ఇవన్నీ ఎలావ్యర్థాలో "ఓ స్వామీ"నీ భక్తులు దుష్టులతో చెలిమి చేస్తే అంతే వ్యర్థలై పోతారు.
సీ: ఫణుల పుట్టల మీద పవ్వళించిన యట్లు
పులుల గుంపున జేరబోయినట్లు
మకరివర్గంబున్న మడుగు జొచ్చినయట్లు
గంగ దాపున నిండ్లు గట్టినట్లు
చెదలుభూమిని చాప చేర బరచినయట్లు 
ఓటిబిందెల పాలు నునిచినట్లు
వెఱ్ఱివానికి బహు విత్తమిచ్చినయట్లు
కమ్మగుడిసె ముందు గాల్చినట్లు
స్వామి నీ భక్తపరులుదుర్జనులతోడ
చెలిమి చేసిన యేట్లయిన చేటు వచ్చు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
ఇందులో"కమ్మ గుడిసెముందు గాల్చినట్లు"అనే ప్రయోగం అర్థం కాలే దు.మాండలిక ప్రయోగమేమో.మిత్రెలెవరైనా తెలుప గలరు.

93. నరసింహశతకము :-శేషప్పకవి.
ఓ స్వామీ నన్ను పోషించే దాతవు నీవేకదా!ఆ ధైర్యంతో నిన్నే నమ్ముకొన్నాను.నీ లాంటి ప్రభువును ఎక్కడా చూడలేదు.నే చేసిన పాపాలు తొలగించి నన్ను నిర్వహిచవయ్యా అనే కవితో మనమూ గొంతు కలుపుదామా!
నవసరోజదళాక్ష నన్ను పోషించెడి
దాతవునీవంచు ధైర్య పడితి
నా మనంబున నిన్ను నమ్మియుందును
దండ్రి మేలు నాకొనరింపు నీలదేహ
భళిభళి నీ యంత ప్రభువు నెక్కడ జూడ 
బుడమిలోనీ పేరు పొగడ వచ్చు
ముందు చేసిన పాపమును నశింపగ చేసి నిర్వహింపుము నన్ను నేర్పు తోడ
పరమ సంతోషమాయె నాప్రాణములకు
నీ ఋణము తీర్చుకొననేర నీరజాక్ష
భూషణవికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.

మంచి శతకపద్యాలను శృంగారనైషదాది కావ్యాలను సులభమైన రీతిలో వివరిస్తున్న శ్రీ పిస్కా సత్యనారాయణగారికి జన్మదిన శుభాకాంక్షలు.
"
పి"ల్లలకే కాదు పెద్దలకు సైతం మంచి సం
"
స్కా"రయుతమైన శ్లోకములను 
"
స"రళమైన భావార్థములతో,
"
త్య"ంతానందము కల్గు విధమున
"
నా"నాకవుల చక్కని పద్య
"
రా"జములను,అందలి విశేష విష
"
య"ములను సుందరంగా తెల్పుతూ పురా
"
ణ"ప్రసిద్ధములైన ఘట్టాలను పరిచయం చేస్తున్న
శ్రీపిస్కా సత్యనారాయణగారికి అచ్చంగా"తెలుగుబృందం"సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

కన్నయ్యకోసం రాధ ఎదురు చూపులు .
పోదము బృందావనికని
మాధవుని దలంచి దాను మమతల విరులన్
మోదమ్మున మది నిడుకొని
రాధిక యేతెంచె నటకు రాగము తోడన్.
డా:బి.ఉమాదేవి,
16/12/14.

93.నరసింహ శతకము:-శేషప్పకవి.
ఓ స్వామీ నన్ను పోషించే దాతవు నీవే అనే ధైర్యంతో వున్నాను.కావున నాకు మేలొనరించవయ్యా.నే చేసిన పాపాలు పోగొట్టు.నీలాంటి ప్రభువు నెక్కడా చూడలేదయ్యా! నీఋణం నిజంగా తీర్చుకోలేనయ్యా స్వామీ అనే కవితో మనమూ గొంతు కలుపుదామా.
సీ: నవసరోజదళాక్ష నన్ను పోషించెడి
దాతవు నీవంచు ధైర్య పడితి
నామనంబున నిన్ను నమ్మియుందును దండ్రి 
మేలు నాకొనరింపు నీలదేహ
భళిభళి నీయంత ప్రభువు నెక్కడ జూడ
బుడమిలో నీపేరు పొగడ వచ్చు
ముందు జేసిన పాపమును నశింపగ చేసి
నిర్వహింపుము నన్ను నేర్పుతోడ
పర మ సంతోషమాయె నా ప్రాణములకు
నీఋణము తీర్చుకొన నేర నీరజాక్ష.
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.

92:నరసింహశతకము:-శేషప్పకవి.
సీ : ఓనరసింహస్వామీ! నీవు మెచ్చుకొనేట్లుగా నే పూజింప లేను.పోనీ యేమైనా ఆభరణాలు పెట్టి పూజిద్దామంటే
నీదగ్గర అన్నీ వున్నాయికదా!కౌస్తుభ రత్నము ముందే నీ దగ్గరుంది.మంచి భోజనం పెడదామంటే దేవతలకే భోజనం(అమృతం)పెట్టిన స్వామివి నీవు.నాకున్నంతలో కాసులేమైనా ఇద్దామంటే కలిమినిచ్చే తల్లే నీ భార్య కదా! అన్నీ వున్నవాడివి అఖిల లోకాధిపతివి నీవు.నీకు సొమ్ములు పెట్ట నేనెంత వాణ్ణయ్యా అనే కవి పలుకులు విందామా !.
సీ: నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా
బూజింప లేదు సుమ్మీ
నాకు తోచిన భూషణములు పెట్టెదనన్న కౌస్తుభమణి
నీకు ముందె గలదు
భక్ష్య భోజ్యముల నర్పణము జేసెద నన్న నీవు
పెట్టితి సుధ నిర్జరులకు
కలిమి కొద్దిగ గానుకల నొసంగెదనన్న
భార్గవీదేవి నీ భార్య యయ్యె
నన్నిగలవాడవఖిల లోకాధిపతివి
నీకు సొమ్ములు పెట్ట నేనెంత వాడ
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.

91.నరసింహశతకము:-శేషప్పకవి.
స్వామి చెంతకు చేరడానికి కావలసిన అర్హతలను గురించి చక్కగా కవి వివరిస్తున్నారు.ఓ స్వామి! నీ కధలు వింటుంటే పులకరించి పోయేవాడు,నీ నామ కీర్తనలో మై మరచి పోయేవాడు,నీ పాదపద్మాలకు సాష్టాంగనమస్కారమొనరించే వాడు,ఎల్లప్పుడూ నీ నామస్మరణం చేస్తూ హృదయకమలంలో నిన్ను చేర్చుకొనేవాడు ఖచ్చితంగా నీ లోకంలోనే వుంటాడనే చక్కని పద్యాన్ని చూద్దామా!
సీ: నీ కథల్ చెవులలో సోకుట మొదలుగ
బులకాంకురము మేన బుట్టువాడు
నయమైన నీనామ దివ్యకీర్తనలలోన 
మగ్నుడై దేహంబు మరచు వాడు
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు
ప్రేమతో దండమర్పించువాడు
హాపుండరీకాక్ష హారామ హరియంచు
వేడ్కతో గేకలు వేయువాడు
చిత్త కమలంబునను నిన్ను జేర్చువాడు
నీదు లోకము నందుండు నీరజాక్ష
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న
"క"విత్వరచన చేయ నుత్సుకత గలవారి ,
"
ట్టు"దలను మెచ్చి వారల ప్రోత్సహింప నెంచి
"
ప"ద్య రచన కనువైన ఛందో రీతుల నెల్ల,
"
ల్లి"(మాతృ)భాషలో నందజేస్తూ,సు
"
ప్ర"సిద్ధమైన ఉదాహరణల నొసగుతూ,ప్రశం
"
సా"ర్హమైన వ్యాఖ్యలతో నుత్తేజ పరుస్తూ,మృ
"
దు"వైన పదాలతో హుషారు గొల్పే 'బాబాయి'
"
గా" రుగా "అచ్చంగాతెలుగు'బృందానికి చిరప
"
రి"చితులైన శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారి
"
కి"అచ్చంగా తెలుగు బృందసభ్యుల తరఫున జన్మదినశుభాకాంక్షలు.
మొదటి అక్షరాలలో దాగిన వ్యక్తిని గమనించారా !

89.నరసింహశతకము:-శేషప్పకవి.
ఓ నరసింహస్వామీ! నీ మహిమలు మాలాంటి నరుల కెలా తెలుస్తాయయ్యా?తెలిస్తే ఆ ముక్కంటికి తెలియాలి లేదా బ్రహ్మ దేవుడికి తెలియా లి నీ మాయా సమర్థత కళ్ళార చూసిన బలికి తెలుసు.ఇంకా వేయికన్నులు గల ఇంద్రునికి తెలుసు.నరులెవ్వరైనా తెలుసంటే నవ్విపోతారంతే అంటూ స్వామి ఔన్నత్త్యాన్ని వివరించే పద్యమిది.
సీ: నాగేంద్ర శయన నీ నామ మాధుర్యంబు
మూడుకన్నుల సాంబమూర్తి కెరుక
పంకజాతాక్ష నీ బల పరాక్రమమెల్ల
భారతీ పతియైన బ్రహ్మ కెరుక
మధుకైటభారి నీ మాయా సమర్థత
వసుధలో బలిచక్ర వర్తికెరుక
పరమాత్మ నీదగు పక్షపాతిత్వంబు
దశ శతాక్షుల పురందరుని కెరుక
వీరికెరుకగు నీ కథల్వింతలెల్౹ల
నరుల కెరుకన్ననెవరైన నవ్విపోరె
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర

88.నరసింహశతకము:-శేషప్పకవి
సముద్రంవలె గంభీరుడు,సామగాన విలోలుడు,శ్రీవత్సాంకితుడు,కౌస్తుభ రత్నధరుడు,పంచాయుధ ధరుడు,దీన రక్షకుడు,దైత్య శిక్షకుడు,నాగశయనుడు,నవరత్న కుండల శ్రవణ విరాజితుడు,బ్రహ్మ,రుద్ర,ఇంద్రా దుల చేత అర్చింపబడే ఆ విశ్వ రూపుని కవితో పాటు మనమూ స్తుతిద్దామా!.
సీ:భువనేశ గోవింద రవికోటి సంకాశ
పక్షివాహన భక్త పారిజాత
అంభోజ భవరుద్ర జంభారి సన్నుత 
సామగాన విలోల సారసాక్ష
వనధి గంభీర శ్రీవత్స కౌస్తుభ వక్ష
శంఖచక్ర గదాసి శార్ఙహస్త
దీనరక్షక వాసుదేవ దైత్యవినాశ
నారదార్చిత దివ్య నాగ శయన
చారు నవరత్న కుండల శ్రవణయుగళ
విబుధ వందిత పాదాబ్జ విశ్వరూప
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.

సమస్య:28
తనయుని పెండ్లియాడి వనితామణి గాంచె కుమార రత్నమున్.
ఉ:అనవరతంబుయన్నకనుసన్నలలోచరియించు వాయునం
దనుడట లక్కయింటను కుతంత్రము నంత నెఱింగి యాగృహం
బనలున కాహుతిచ్చి వనియందు చరింప హిడింబ యాపృథా
తనయుని పెండ్లియాడి వనితామణి గాంచె కుమార రత్నమున్.

87.నరసింహ శతకము:-శేషప్పకవి.
ఓ స్వామీ! నేనతి దురాత్ముడనని నీవు నాకు కలలో కూడా కన్పించడం లేదు.సరే ప్రత్యక్షం కాకపోయినా ఫర్వాలేదు లేవయ్యా!నా కొక మంచి ఉపాయం తోచింది.అదేంటంటావా!గట్టి కొయ్యను తెచ్చి నీ రూపం చిత్రించి ధూపదీపాలతో నిత్యనైవేద్యములతో కొలుస్తాను.నా కంతే చాలనే కవి పలుకులు చూద్దామా!
సీ:అమరేంద్రవినుత నే నతి దురాత్ముడనంచు
కలలోన నైనను గనుల బడవు
నీవు ప్రత్యక్షమై నిల్వకుండిన మానె
దొడ్డగా నొక యుక్తి దొరికె నయ్య
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి
నీస్వరూపము చేసి నిలుపు కొందు
ధూప దీపములిచ్చి తులసితో పూజించి
నిత్యనైవేద్యము ల్నేమముగను
నడుపుచును నిన్ను గొలిచెద నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గల్గు నా కింతె చాలు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.

86.నరసింహశతకము:-శేషప్పకవి.
ఓ గరుడవాహనా! నీవు గొప్పదాతవని కొలువ వచ్చా.అర్థిమార్గంలో నానా వేషాలు వేసి నావిద్యలన్నీ ప్రదర్శించా.నీకు ఆనందమైతే నే నడిగింది ఇచ్చి నాకోర్కె దీర్చు.నీకు నా వేషాలు నచ్చలేదనుకో ఇక మాటి మాటికి వేషాలేయనంటూ గారాలు పోయే భక్తుని అంతరంగము చూద్దామా!
తార్క్ష్యవాహన నీవు దండిదాత వటంచు
గోరి వేడుక నిన్ను గొల్వ వచ్చి
అర్థిమార్గము నేననుసరించితినయ్య
లావైన పదునారుగులక్షలైన
వేషముల్వేసి నా విద్య చాతుర్యంబు
జూపసాగితి నీకు సుందరాంగ
ఆనందమైన నే నడుగ వచ్చినదిచ్చి
వాంఛ వదీర్పుము నీలవర్ణ వేగ
నీకు నా విద్య హర్షంబు గాక యున్న
తేపతేపకు వేషములల్ తేను సుమ్మి
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర

85.నరసింహశతకము:-శేషప్పకవి.
నరసింహస్వామితో కవి చనువుగా పోట్లాడుతూ అలిగే తీరు చూద్దామా! ఓ స్వామీ నీకే నాపై ప్రేమ లేదు.నిన్నే నమ్ముకొని ఎక్కడికీ పోకుండా వున్నందుకు నేనంటే ప్రేమ లేదు కదూ! నేనెక్కడికి పోయినా నా కింత ముద్ద అన్నం దొరుకుతుంది."తిరుపతి"కెళితే వెంకటేశ్వరుడన్నం పెట్టడా?పురుషోత్తమక్షేత్రానికి(పూరీ)పోతే జగన్నాథుడు,కంచి కెళితే వరదరాజస్వామి,అన్నం పెట్టరను కొన్నావా?అంటూ కవితో పాటు మనమూ ప్రశ్నిద్దామా?.
సీ: తిరుపతి స్థలమందు తిన్నగా నేనున్న 
వెంకటేశుడు మేత మేయలేడొ
పురుషోత్తమునకే బోయిన జాలు
జగన్నాథు డన్నంబు గడప లేడొ
శ్రీరంగమునకు నేచేర బోయిన జాలు
స్వామి గ్రాసము పెట్టి సాకలేడొ
కాంచీ పురములోన గదిసి నే కొల్వున్న 
గరి వరదుడు పొట్ట గడుప లేడొ
ఎందు బోవక నేను నీమందిరమున
నిల్చితిని నీకు నామీద నెనరు లేదు
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూ


3:నరసింహశతకము:-శేషప్పకవి.
కవి ఈ పద్యంలో శ్రీ నరసింహస్వామి వారిని వర్ణించిన తీరు అద్భుతంగా వుంది.స్వామివారి అలంకరణ,ఆభరణల వర్ణన చక్కగా వివరించబడింది.స్వామి"దివ్యకౌస్తుభాలంకృతుడు.అందమైన మకరకుండలాలు గలవాడు.పట్టు పీతాంబరాలతో విరాజితుడు.సూర్య చంద్రులు నయనాలుగా గలవాడు.రాక్షసాంతకుడు.లక్ష్మీశుడు,బ్రహ్మజనకుడు,సర్వేశుడైన ఆపరమపురుషుని కవితో పాటు మనమూ కొలుద్దామా!
సీ:గరుడవాహన దివ్య కౌస్తుభాలంకార 
రవికోటితేజ సారంగ వదన
మణిగణాన్విత హేమ మకుటాభరణ
చారు మకరకుండల దసవ్మందహాస
కాంచనాంబర రత్న కాంచీ విభూషిత
సురవరార్చిత చంద్ర సూర్య నయన
కమలనాభ ముకుంద గంగాధరస్తుత 
రాక్షసాంతక నాగరాజ శయన
పతిత పావన లక్ష్మీశ బ్రహ్మ జనక
భక్తవత్సల సర్వేశ పరమపురుష
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.

శ్లో:ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్టన్
వామ కరేణ వరదాభయ పద్మచిహ్నం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువును శ్రీ శంకర భగవత్పాదులు కరావలంబ స్తోత్రంలో స్తుతించే పద్యమిది.ఒకచేత్తో చక్రము మరోచేత్తో శంఖము ధరించి,సముద్రరాజ సుత యైన లక్ష్మిని ఇంకోచేత,అభయముద్ర మరోచేత దాల్చిన స్వామియే శరణము.
(
శ్రీనివాస్ వల్లభనేని గారు అడిగిన శ్లోకం లభ్యం
కావడంతో పోస్ట్ చేస్తున్నాను).

81. నరసింహ శతకము:-శేషప్ప కవి.
ఓస్వామీ !ఈ శరీరము అస్థిరమైనదని తెలుసుకోలేక మా స్వతంత్రమైన మదము కళ్ళకు కప్పడం వల్ల కామ మోహాల్లో మునిగి పోయాం.ఆ బ్రహ్మదేవుడైనా ఈ శరీరాన్ని "గట్టి బంగారం"తో చేయక వట్టి తోలు ఎముకలతో మురికి చెత్త చేర్చి మూట కట్టాడు.నిన్ను చూడలేము అంటూ తనువు అశాశ్వితమనే విషయాన్ని కవి వివరిస్తున్నాడు.
సీ: పద్మాక్ష మమతచే బరము సందెదమంచు
విఱ్ఱవీగుదుమయ్య వెఱ్ఱి పుట్టి
మా స్వతంత్రంబైన మదము కండ్లకు గప్ప
మొగము పట్టదు కామ మోహమునకు
బ్రహ్మదేవుండైన పైడి దేహము గల్గ జేసి
వేయక మమ్ము జెరిచె నతడు
తుచ్ఛమైనటువంటి తోలెమ్ముకలతోడి 
మురికి చెత్తను చేర్చి మూటకట్టె
నీశరీరాలు పడిపోవుటెరుగ కేము
కాముకులమైతి మిక మిమ్ము కానలేము
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.

మిత్రులందరికి గీతాజయంతి శుభాకాంక్షలు.
"
సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్"
ఉపనిషత్తులే గోవులు,గోపాలకృష్ణుడే పాలుపిదికేవాడు,అర్జునుడు దూడ ,మహత్తరమైన గీతామృతమే పితికిన పాలు,సుధీజనులే (పండితులే)ఆ పాలను త్రాగువారు.

80 నరసింహశతకము:-శేషప్పకవి.
ఇది వేదాంతపరమైన పద్యము.ఈ జీవితం ఓ మాయా నాటకం.అశాశ్వితమైన దేహానికి ఇహలోక సౌఖ్యాలెన్ని వున్నా అవి తాత్కాలికమే.శరీర దారుఢ్యం జీవనపర్యంతం ఒకే తీరుగా వుండదు కదా!అంతేకాదు ఈ శరీరము బాల్య యవ్వన వృద్ధాప్యములనే మూడింటితో నిండిన మురికి కొంప.ఇది శాశ్వితమనే భ్రమతో కాపాడుదామను కొందామన్నా "కాలమనే మృత్యువు"కాటేయక మానదు.అందుకే ఓస్వామీ!ఇక మరో జన్మ వద్దయ్యా నన్నేలుకో అంటున్న కవితో పాటు మనమూ ప్రార్థన చేద్దామా!.
సీ: ఇహలోక సౌఖ్యము లిచ్చగించెద మన్న 
దేహమెప్పటికి తా స్థిరతనొంద
దాయుష్య మున్న పర్యంతంబు పటుతయు
నొక్కతీరున నుండ దుర్వి లోన
బాల్య యవ్వనము దుర్బల వార్ధక్యములను
మూటిలో మునిగెడి మురికి కొంప
భ్రాంతితో దీని గాపాడుద మనుకొన్న 
గాలమృత్యువు చేత గోలుపోవు
నమ్మరాదయ్య యిది మాయ నాటకంబు
జన్మమిక నొల్ల నన్నేలు జలజ నాథ
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.

79.నరసింహశతకము:-శేషప్పకవి.
ఓనరసింహస్వామీ! మంచి చేయక పోయినా ఫరవాలేదు చెడు మాత్రం చేయకూడదంటూ శతక కర్త చేసే హితబోధ మనమూ విందామా!సాధారణంగా మంచి గ్రంథాలు చదివితే సమస్తము అవగతమైనట్లే అంటారు.కానిహరిదాసులను నిందించ కుండా వుంటే చాలు ఆ గ్రంథాలన్నీ చదివినట్లేనట.అదే విధంగా చెయ్యెత్తి దానం చేయక పోయినాఇచ్చే వాళ్ళను తప్పించకుండా వుంటే చాలు దానం చేసినట్లే నట ఇంకా సజ్జనులను మోసగించకుండా వుంటే చాలు పెద్ద బహుమానమిచ్చినట్లట.దేవాగ్రహారాలు "స్వాహా"చేయకుండా వుంటే చాలు బంగారు స్తంభాలున్న ఆలయాలు కట్టించినట్లట.అంతేకాదు ఇతరుల "వర్షాశనం"అంటే వారి ఒక సంవత్సరం ఆహారం ముంచకుండా వుంటే అన్నసత్రాలు కట్టించి నట్లేనట.ఇలా అన్యాపదేశంగా అట్టి పనులు చేయ రాదని హెచ్చరిస్తున్నారు.
సీ:హరిదాసులను నిందనాడకుండిన జాలు
సకల గ్రంథములెల్ల జదివినట్లు
బిక్షమియ్యంగ దప్పించ కుండిన జాలు
జేముట్టి దానంబు చేసినట్లు
మంచి సజ్జనుల వంచింప కుండిన జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు
గనక కంబపు గుళ్ళు గట్టినట్లు
ఒకరి వర్షాశనము ముంచకున్న జాలు
పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.

79.నరసింహశతకము:-శేషప్పకవి.
ఓనరసింహస్వామీ! మంచి చేయక పోయినా ఫరవాలేదు చెడు మాత్రం చేయకూడదంటూ శతక కర్త చేసే హితబోధ మనమూ విందామా!సాధారణంగా మంచి గ్రంథాలు చదివితే సమస్తము అవగతమైనట్లే అంటారు.కానిహరిదాసులను నిందించ కుండా వుంటే చాలు ఆ గ్రంథాలన్నీ చదివినట్లేనట.అదే విధంగా చెయ్యెత్తి దానం చేయక పోయినాఇచ్చే వాళ్ళను తప్పించకుండా వుంటే చాలు దానం చేసినట్లే నట ఇంకా సజ్జనులను మోసగించకుండా వుంటే చాలు పెద్ద బహుమానమిచ్చినట్లట.దేవాగ్రహారాలు "స్వాహా"చేయకుండా వుంటే చాలు బంగారు స్తంభాలున్న ఆలయాలు కట్టించినట్లట.అంతేకాదు ఇతరుల "వర్షాశనం"అంటే వారి ఒక సంవత్సరం ఆహారం ముంచకుండా వుంటే అన్నసత్రాలు కట్టించి నట్లేనట.ఇలా అన్యాపదేశంగా అట్టి పనులు చేయ రాదని హెచ్చరిస్తున్నారు.
సీ:హరిదాసులను నిందనాడకుండిన జాలు
సకల గ్రంథములెల్ల జదివినట్లు
బిక్షమియ్యంగ దప్పించ కుండిన జాలు
జేముట్టి దానంబు చేసినట్లు
మంచి సజ్జనుల వంచింప కుండిన జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు
గనక కంబపు గుళ్ళు గట్టినట్లు
ఒకరి వర్షాశనము ముంచకున్న జాలు
పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.

ఆశే నా శ్వాస:
ఏ జన్మలో చేశానో తపము
ఈ జన్మలో పొందాను వరము 
ఎక్కడో అనాథగా పుట్టాను నేను
ఇక్కడే చిన్ని చేతుల్లో ఇమిడి పోయాను
తన పేరుకు ముందో వెనుకో చేరిపోయాను
తన చేతిని విడువక ఆభరణమై పోయాను
తనువంతా గాయాలైనా
బాధ లేదు ఇసుమంతైనా
తన మోవి తగిలితే చాలు
పలుకుతా యెన్నెన్నో రాగాలు
నాకు లేదు భాషా భేదం
మీకొసగేను అమితానందం
నాలో నుండి వచ్చే స్వరం
చేరుస్తుందిదే బృందావనం
పూలతో పాటు దారానికి అబ్బుతుంది తావి
నాజన్మ చరితార్థమైంది చేరి తన మోవి
ఇంతకన్నా లేదు మరో ఆశ 
ఇదే ఇదే కావాలి నాకు శ్వాస.
డా:ఉమాదేవి బల్లూరి.
22-11-14

అనురాగానికి నెలవు
ఆత్మీయతకు కొలువు
తన మదిలాగే విశాల
మైన గదులున్న ఇల్లు
సువాసనలు వెదజల్లే
చక్కని యా సిరిమల్లె
తీగతో పాటు మది నలరించే
గులాబి చామంతి మందారపు చెట్లు
తనను కలవాలన్న నిరీక్షణ
సఫలమైన శుభసమయం
పంచుకొన్నాం మధుర భావాలను
పెంచుకొన్నాం స్నేహ వల్లరులను
ముఖపుస్తక మిత్రురాలిని
ముఖాముఖిగా కలుసుకొని
పసందైనవిందారగించి ప్రేమతో
అందించిన కోక నందుకొన్న
మధురమైన శుభతరుణం
మరువలేని మధురక్షణం.
ఇంతకూ ఆ"తనె"వరో అర్థమైందనుకోంటూ.

నా స్వగతం(రిమోట్)
ఉపకారం చేస్తున్నా నేను మీకు ,
కానీ
అపకారం చేస్తున్నారు మీరు నాకు
మీకు శ్రమను తగ్గించాలని నేనూహిస్తే
నాకదనపు శ్రమను మీరిస్తున్నారు
అకటా!
ఈ మానవులెంత దయా విహీనులో కదా
కూర్చొన్నచోటునుండి కదలకుండా
కావలసిన దాన్నే చూచే వీలు నే కల్పిస్తే
నొక్కి నొక్కి చితక్కొట్టేస్తూ
చీటికి మాటికి ముందు వెనుక
అరచేతులతో చరచి చరచి
హింసిస్తున్నారే ?ఇది భావ్యమా ?మిత్రులూ!
అంతటితో నాగక పసిపిల్లలకు నన్ను
ఆటవస్తువును చేశారేంటబ్బా!
బోసినవ్వుల పసిపాపలు 
ప్రేమతో ఆడుకొన్నా కోపంతో కసిరి విసిరినా
నాకు నొక్కులే నొప్పులే తిప్పలే చిక్కులే
నన్నలుము కొన్న అక్కరాలను
ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నారే
ఏదో ఓసారో మరోసారే కాదు
ఒకరో ఇద్దరో కానేకాదు అందరూ
బొటనవేలికో చూపుడు వేలికో 
పని కల్పించి మరీ కష్టపెడుతున్నారే
ఎవరికి తెలుపను నా వెతను
ఎలా తీరును నా తపన.

దేవతలను పారద్రోలి బలిచక్రవర్తి బలిష్టుడై యుండ శ్రీహరి దేవతల కోరిక మేరకు వటురూపమున వచ్చి మూడడుగుల నేలను కోరి త్రివిక్రమ రూపుడైబలిని అణచి వేస్తాడు.ఆతరువాత భర్తను మన్నించమని వేడిన "బలి"భార్యకు వరమొసగి వారి ద్వారం చెంత నుంటానని మాట ఇస్తాడు నాటినుండి ఇది"బలిపాడ్యమి"గా ప్రసిద్ధి చెంది దీపావళి పండుగలో భాగమయింది.
బలి పాడ్యమి సందర్భంగా ఇంకో మూడు పద్యాలు.
కం:బలి యాగడముల నోపగ
జాలము తండ్రీ,మురారి,జలజాక్షా,నీ
జాలము తోడను వానిని
బలహీనుని జేయుమంచు ప్రార్థించి రటన్. 1
ఆ.వె:సురల పల్కులెల్ల సుందరంబుగవిని
వత్తు నేను మీకు వలదు భయము
యనుచు దేవతలకు నభయంబు నొసగుచు
వటువు గానె విష్ణు వటకు వచ్చె 2
ఆ.వె:పొట్టి రూపు తోడ పుడమిని వేడంగ
శ్రీహరి యని యెరిగి సర్వ మొసగె
బలిని యణచి యతని భార్యకు వరమిచ్చి
కాపు గాచి తీవు కృపణ శీలి. 3
రేపు యమద్వితీయ"అంటే యముడు తనసోదరియైన యమున చేతి వంట భుజించి కానుకలొసగి ఆశిస్సులందించిన రోజు."భగినీ హస్తభోజన"గాప్రసిద్ధి చెందింది.
ఆ.వె:యమున చేతి వంట యద్భుతము యటంచు
భగిని చేసి నట్టి భక్ష్యములను
ఆదరంబున దినె నాయముండు నిదియె
పండుగయ్యె గాదె పృథ్వి యందు.
ఆశ్వీజబహుళ అమావాస్యనాడు లక్ష్మీపూజ చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.తన్మూలంగా సకలైశ్వర్యాల సిద్ధిస్తాయనే నమ్మకమే నేటికీ దీపావళీ పండుగలో భాగమైన "అమావాస్య"నాడు విద్యుదలంకరణాలతో ముఖ్యంగా అమ్మవారిని ధనముతోనూ,వివిధఆభరణాలతో విశేషంగా అలంకరించి పూజించడం దేశమంతటా జరుగుతున్నది.
ఈసందర్భంగా మరో మూడు పద్యాలు.
ఆ.వె: అమవశి నిశి లోన అర్ధరాతిరి యందు
అవని జనుల కెల్ల హర్ష మొదవె
కాంతి పుంజమటుల కాంతులు వ్యాపించె
పట్టపగలు వోలె ప్రభలు నిండె. 1
ఆ.వె:లక్ష్మి పూజ సేయ లలనా మణులు చేరి
భక్తి పూర్వకముగ భజన చేసి
కొలువ నపుడె యమ్మ కోరికల్ దీర్చుచు
దీక్ష జూసి మురిసి దీవ నోసగె. 2
ఆ.వె:వణిజులకును నిదియె వైశ్యులకెల్లను
పెద్ద పండు గనుచు పేర్మి చేత
జమ ఖర్చు లెంచి జయలక్ష్మిని గొలువ
జయము నొసగు నంబ జంకు వలదు. 3
లోక కంటకుడైన నరకాసురుని లోకపూజ్యుడైన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై వెళ్ళి విజయలక్ష్మితో తిరిగొచ్చాడుఇదియే "నరకచతుర్దశి" "దీపావళి" పండుగలుగా టపాకాయలు కాల్చి సంబరంగా చేసుకొంటున్నాము.
ఈసందర్భంగా ముచ్చటగా మూడు పద్యాలు.
ఆ.వె: వరముపేర్మి చేత వసుమతీ తనయుండు
మగువలను మునులను మట్టుబెట్ట
నెంచి వారి నెల్ల నిర్బంధమొనరింప
వాని పీచ మణచె వృష్ణి కులుడు.
ఆ.వె:అరి నొకపరి జూచు హరినొక పరిజూచు
వాడి చూపు లనొక వంక వలపు
జూపుల ప్రియ సఖుని జూచుచు మ్రోగించె
సమర భేరి నపుడె సత్యభామ.
అ.వే:శౌరి తోడ నతివ సయ్యాట లాడుచు
సంహరించె నరకుఁసత్యభామ
నాటి నుండి నిదియే నరకచతుర్దశి
పండుగయ్యె గాదె పృథ్వి యందు.
సమస్యా పూరణం:
"
కొమ్మల నమ్మిన జనులకు కూడే కరువౌ"
కమ్మని మాటల తోడను
నమ్మక మేర్పడ బలుకుచు నవలా మణులన్
యిమ్ముగ నాకర్షించెడి
కొమ్మల నమ్మిన జనులకు కూడే కరువౌ.
సమస్య ::6
భరత భూమి రక్ష బడులు గుడులు.
తెల్లదొరలు వచ్చి తెగబడి పోరుచు
భరత జాతి దోచి భంగ పరుప
సంప్రదాయములును సంస్కృతు లేకాచె
భరతభూమి రక్ష బడులు గుడులు.
అమ్మయ్య పండగైపోయింది.మరో పండుగ(దీపావళి)వరకు కాస్త "టెన్షన్"ఫ్రీ.
ఊళ్ళకెళ్ళిన వారంతా స్వస్థానాలకు చేరారనుకొంటూ
ఓ చిన్నపద్యంతో మితృలందరికి శుభరాత్రి.
సంబర మందుచు మనుజులు
అంబరమంటిన విధమున నత్యంతానం
దంబున మురియుచు సత్స్నే
హంబున బంధమధికమని హర్షించి రిలన్.

29:సమస్య.
ముదిమి మీది కొచ్చి మూల బడితి.
ఆ.వె:శక్తి యుక్తి తోడ సంసార మీదుచు
బతుకు బండి లాగు బడుగు నేను
సత్తువేమి లేక సంపాదనయు లేక
ముదిమి మీది కొచ్చి మూల బడితి.
''మితృలందరికి శుభసాయంత్రం.
శమీ శమేతి పాపం
శమీ శతృ వినాశనం'
ఆ వె:పాడ్యమి తిథి నుండి పరమేశు రాణిని
ప్రస్తుతించి కొల్చి భక్తి తోడ
విజయదశమి నాడు విజయంబు గోరుచు
జమ్మి చెట్టు కొలువ జయము లొదవు.

ఆదిశక్తి కరుణ కోరుతూ ఆటవెలదిలో ఓ పద్యం.
సకల జనుల గాచు శక్తిమాతవు నీవె
భక్తి తోడ గొలుతు భాగ్య మొసగు
నిన్ను నమ్మి యున్న నీడేరు కోర్కెలు
విజయ మొసగు మమ్మ విజయ దుర్గ.

తెలుగు కవిత్వము సమస్యాపూరణము :-11
*******************************
*******// 
Umadevi Balluri//*********
నవనవలాడెడి సుమముల
దవనము తోడన్ గలిపి కదంబపు మాలన్
జపమును గూర్చెదనిక, కే
*
శవ పూజల వలన జన్మ సార్థక మౌగా! 
*************************************
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి జన్మదినాన్ని స్మరిస్తూ
అసమాన ప్రతిభాశాలి
బహుముఖ ప్రఙ్ఙాశాలి
శతాధిక గ్రంథకర్త
అత్యున్నత పురస్కార గ్రహీత
తెలుగు వెలుగులను దశదిశల
వ్యాపింప జేసిన వేదమూర్తి
సంస్కృతీ సాహిత్యాలు
అవిభాజ్యాలని రచనలద్వార
జగతికి తెలిపిన సాహిత్యకారుడు
వేయిపడగలను వేయి పుటలలో 
బంధించిన గ్రంథకర్త
రచనహాస్యమైనా వ్యంగ్యమైనా
సూటిగా నిర్మొహమోటంగా 
వ్యక్తీకరించడం ఈమహామనీషినైజం
రామాయణ కల్పవృక్షాన్ని
తెలుగు వారి కందించిన
ఈ మహాకావ్య సాగరునకు
వినమ్రతతో
అక్షర కుసుమాంజలి
""తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింప దరము గాదు"
అంటూ ఏనుగు లక్ష్మణకవి భర్తృహరి శ్లోకానికి అనువాదం చేశారు.అదే విధంగా ఎన్నో కష్టమైన పనులు చేయవచ్చు కాని దుష్టులకు ఙ్ఞానబోధ చేయడం
సాధ్యంకాదని నరసింహశతకకర్త తెలియచేస్తున్నారు.
సీ:భుజబలంబున పెద్దపులుల జంపగవచ్చు పాము కంఠము చేత బట్టవచ్చు
బ్రహ్మరాక్షసకోట్ల బార ద్రోలగ వచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు
జిహ్వకిష్టము గాని చేదు మ్రింగగ వచ్చు పదును ఖడ్గము చేత నదుమ వచ్చు
కష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు దిట్టుపోతుల నోళ్ళు రట్టవచ్చు
పుడమిలో దుష్టులకు ఙ్ఞానబోధ తెలిపి
సజ్జనుల జేయ లేడెంతచతురు డయిన
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర
నేను పుట్టినప్పటి నుండి పుణ్యకార్యాలు గాని,తీర్థయాత్రలుగానీ,వ్రతాలుగానీ దానాలు గానీ,చేయలేదు.నీచాటు జొచ్చాను,తెలిసో తెలియకో చేసిన పాపాలు ద్రుంచి పోషించమంటూ శేషప్పకవి
ప్రార్థిస్తున్నారు.
1
ధరణి లోపలనేను తల్లి గర్భమునందు బుట్టి నప్పటి నుండి పుణ్యమెరుగ
నేకాదశి వ్రతమెన్నడుండగ లేదు తీర్థయాత్రలకైన తిరుగలేదు
పారమార్థికమైన పనులు సేయగలేదు బిక్షమొక్కనికైన పెట్టలేదు
ఙ్నానవంతులకైన బూని మ్రొక్కగలేదు ఇతర దానములనయిన నియ్యలేదు
నళినదళ నేత్ర నిన్ను నే నమ్మినాను
చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.
2
ఇలలోన నే జన్మ మెత్తినప్పటి నుండి బహు గడించితినయ్య పాతకములు
తెలిసి జేసితి కొన్ని తెలియ జాలకచేసి బాధ నొందితినయ్య పద్మనాభ
అనుభవించేటప్పుడతి ప్రయాసంబంచు ప్రజలు చెప్పగ చాల భయము కలిగె
నెగిరి పొయ్యేటందు కేయుపాయంబైన చేయచూదామంటె చేతకాదు
సూర్యశశి నేత్ర నీ చాటు జొచ్చినాను
కలుషములు ద్రుంచి నన్నేలు కష్టమనక.
భూషణవికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
\
మిత్రులందరికి వినాాయకచవతి మరియు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
బుజ్జిగణపతి.
స్నానాల గదిలోన అమ్మ తలపులతోడ 
నలుగుతోనే రూపు దాల్చినట్టి 
శైలసుత తనయా నీకు వందనం
అమ్మ ఆనతి పైన ఎవ్వరిని రానీక
ఉండ్రాళ్ళు మెక్కుతూ నుండంగ
మూషిక రూపాన వచ్చిన యసురుని
మట్టు బెట్టిన గౌరి తనయా నీకు వందనం
అంతటితొ నాగక నా యసురునే నీవు
వాహనంబుగ చేకొేంటి వయ్య
విజయంబు చేకొని ఇంటికేతెంచిన
పరమశివుని గాంచి జనకుడని యెరుగక
లోని కంపక యడ్డు పడిన సురశ్రేష్టుడీవె
శివుడాగ్రహంబున రుద్రుడై నీ శిరము ఖండింప
నేలకూలితివయ్య గిరి పౌత్ర నీవు
అమ్మ వేడంగ నయ్యకరుణింప
కరిరాజ ముఖుడవై వెలుగొందు చున్నావు
గుజ్జు రూపముతోడ నడయాడుచుండంగ
నిను జూచి ఫక్కున నవ్వె యానెలరేడు
అందుకే నేటికీ క్షీణించు చున్నాడు
విఘ్ననివారకుడవు అభయప్రదాతవు
ఆపద్బాంధుడవీవె ఆది దేవ
మ్రొక్కులిడుదుము నీకు కరుణించి కాపాడు
ప్రజల వెతలనెల్ల పరిహరించుమొ దేవ
జయజయ గణనాథ జయము జయము.
Umadevi Balluri
మిత్రులందరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
నిరీక్షణ
ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు...
ఇదిగో ఇప్పుడే వస్తానంటూ వెళ్ళావు
ఇప్పటిదాకా రాకుండా దాక్కున్నావు
నీ రాక కోసం అప్పటి నుండీ..
కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే వున్నా
ఆశను చంపుకోలేక
కదిలే మబ్బుల నడిగా 
ఎగిరే పక్షుల నడిగా
నీ జాడేమైనా చెబుతాయేమో నన్న ఆకాంక్షతో
అలల సవ్వడి విన్నా
గాలి గలగలలు విన్నా
చెవులు రిక్కించుకొని
కళ్ళు విప్పార్చుకొని
మరీ మరీ చూశా
ప్చ్.......ఎప్పటిలా 
మళ్ళీ నిరాశే
నాలాటి కాంత లు"అట"కోకొల్లలేమో?
అందుకేనేమో
ఇటువైపు చూడనన్నా చూడవు
నాట్యమాడే నెమలిని చూస్తే
నీ సిగ పించం గుర్తొస్తోంది
ఏ వెదురు కర్రను చూసినా
నీమోహన మురళే అనిపిస్తోంది
ఓ నా స్వామీ
ఈ భ్రమలన్నీ తొలగేలా
నా కోరికలన్నీ తీరేలా
ఒక్కసారి ఒకే ఒక్క సారి
రావా..........ఇలా 16 /8 14