సమస్య:-క్రాంతి వచ్చినంత కాంతి వచ్చె.
ఆ.వె: పంట చేతి కంది పల్లెలెల్లవెలిగె
అన్నదాత లంద రందముదము
పంటలిచ్చు గొప్ప పర్వమ్మిదనగ సం
క్రాంతి వచ్చినంత కాంతి వచ్చె.
అన్నదాత లంద రందముదము
పంటలిచ్చు గొప్ప పర్వమ్మిదనగ సం
క్రాంతి వచ్చినంత కాంతి వచ్చె.
సమస్య:-141.
*సొమ్ము సోకు తిరమె
సుగతి నంద.
ధనమదెంత యున్న మన వెంట రాబోదు
పరుల కుపకరింప ఫలము కలుగు
నెఱిగి మసులుకొనుము నీ మాట నిజమని
సొమ్ము సోకు తిరమె సుగతి నంద
పరుల కుపకరింప ఫలము కలుగు
నెఱిగి మసులుకొనుము నీ మాట నిజమని
సొమ్ము సోకు తిరమె సుగతి నంద
ఛలము,బలము,కలము,తలము పదములతో
భారతార్థంలో పూరించాను.
పాండు సుతులు నాడు బవరాన "ఛలమును"
దైవ"బలము"తోడ ధరణి గెల్చి
"సకల" మెల్ల గొనుచు శత్రుమూక జయించ
గగన"తలము"వరకు ఖ్యాతి ప్రాకె.
దైవ"బలము"తోడ ధరణి గెల్చి
"సకల" మెల్ల గొనుచు శత్రుమూక జయించ
గగన"తలము"వరకు ఖ్యాతి ప్రాకె.
"మనకు
సంవత్సరాది ఉగాది రోజే
చెప్పుకొందాం శుభాకాంక్ష లా రోజే
మంచిని ఎక్కడున్నా గ్రహిద్దాం
అభివృద్ధి పథంలో పయనిద్దాం
అంధానుకరణలను వదిలేద్దాం
అందరం కలసి మెలసి జీవిద్దాం"
మిత్రులందరికి ముక్కోటి ఏకాదశీ శుభాకాంక్షలు మరియు శుభోదయం.
చెప్పుకొందాం శుభాకాంక్ష లా రోజే
మంచిని ఎక్కడున్నా గ్రహిద్దాం
అభివృద్ధి పథంలో పయనిద్దాం
అంధానుకరణలను వదిలేద్దాం
అందరం కలసి మెలసి జీవిద్దాం"
మిత్రులందరికి ముక్కోటి ఏకాదశీ శుభాకాంక్షలు మరియు శుభోదయం.
సమస్య : 129
*అత్త లమ్మ లైన దుత్త
మిగులు.
ఆ.వె:కొత్త కోడ లైన కూతురై పంచుచు
మమత గెలిచె నత్త మామ మతుల
సొంత యిల్లని మనుచు పతి మురిసె
అత్త లమ్మ లైన దుత్త మిగులు.
మమత గెలిచె నత్త మామ మతుల
సొంత యిల్లని మనుచు పతి మురిసె
అత్త లమ్మ లైన దుత్త మిగులు.
సమస్య:--140
తప్పు లొప్పులన్న తప్పు ముప్పు.
ఆ.వె : తాను బట్టినట్టి తాడు పాము యనెడు
మందమతుల తోడ మాటలేల
ముచ్చటెరుగనట్టి మూర్ఖ జనులు చేయు
తప్పు లొప్పు లన్న తప్పు ముప్పు.
తప్పు లొప్పులన్న తప్పు ముప్పు.
ఆ.వె : తాను బట్టినట్టి తాడు పాము యనెడు
మందమతుల తోడ మాటలేల
ముచ్చటెరుగనట్టి మూర్ఖ జనులు చేయు
తప్పు లొప్పు లన్న తప్పు ముప్పు.
సమస్య:--143.
"జగణముతో జగడమగును జాగ్రత్త సుమా
కం :మగనిని సత్రాజితికో
రగ పారిజముు వినియనెనురమణుడు, రమణీ
సొగసుగ మనమట కరుగ,ని
జ గణముతో జగడమగును జాగ్రత్త సుమా.
"జగణముతో జగడమగును జాగ్రత్త సుమా
కం :మగనిని సత్రాజితికో
రగ పారిజముు వినియనెనురమణుడు, రమణీ
సొగసుగ మనమట కరుగ,ని
జ గణముతో జగడమగును జాగ్రత్త సుమా.
సమస్య:-139.
*నిటలాక్షుడు దానిని గని
నివ్వెర బోయెన్.
కం: అట భస్మాసురు నింజం
పుట యనివార్యం బటంచు పురుషోత్తము డం
తట మోహని గాగ నపుడు
నిటలాక్షుడు దానిని గని నివ్వెర బోయెన్.
పుట యనివార్యం బటంచు పురుషోత్తము డం
తట మోహని గాగ నపుడు
నిటలాక్షుడు దానిని గని నివ్వెర బోయెన్.
100.నరసింహశతకము:శేషప్పకవి.
నరసింహస్వామి అనుగ్రహముతో ఈశతకములోని 100
పద్యములకు
నాకు తెలిసిన విధముగ వివరించినాను.సహృదయముతో ఆదరించిన మిత్రులందరికి హృదయపూర్వక ధన్యవాదములు
తెలుపు చున్నాను.
ఈ శతక పఠనము వలన కలిగే ప్రయోజనము ,ఫలశ్రుతి శతకకర్తవివరిస్తున్నాడు.ఈ పద్యాలుి,ఎవరు భక్తితో విన్నా వ్రాసినా,సత్ఫలములంది భగవంతుని కృపకు పాత్రులౌతారని,పుస్తకమును పూజించిన కష్టాలు తొలగి పోతాయని ,పుణ్యకరమైన ఈ పుస్తక పఠనము వలన ముక్తికల్గునని శేషప్పకవి వివరించి శతక రచన సంపూర్ణం చేశాడు.
తెలుపు చున్నాను.
ఈ శతక పఠనము వలన కలిగే ప్రయోజనము ,ఫలశ్రుతి శతకకర్తవివరిస్తున్నాడు.ఈ పద్యాలుి,ఎవరు భక్తితో విన్నా వ్రాసినా,సత్ఫలములంది భగవంతుని కృపకు పాత్రులౌతారని,పుస్తకమును పూజించిన కష్టాలు తొలగి పోతాయని ,పుణ్యకరమైన ఈ పుస్తక పఠనము వలన ముక్తికల్గునని శేషప్పకవి వివరించి శతక రచన సంపూర్ణం చేశాడు.
సీ: శేషప్పయనుకవి చెప్పిన పద్యముల్
చెవులకానందమై చెలగుచుండు
నే మనుజుండయిన నెలమి శతకంబు
భక్తితో విన్న సత్ఫలము కలుగు
చెలగి ఈ పద్యముల్ చేర్చి వ్రాసినవారు
కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగా పుస్తకంబెపుడు పూజించిన
దురితజాలంబులు తొలగి పోవు
నిద్ది పుణ్యాకరంబని యెపుడు జనులు
కష్టమెన్నక పఠియింప గలుగు ముక్తి.
భూషణ వికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
|| శ్రీకృష్ణార్పణమస్తు.||
చెవులకానందమై చెలగుచుండు
నే మనుజుండయిన నెలమి శతకంబు
భక్తితో విన్న సత్ఫలము కలుగు
చెలగి ఈ పద్యముల్ చేర్చి వ్రాసినవారు
కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగా పుస్తకంబెపుడు పూజించిన
దురితజాలంబులు తొలగి పోవు
నిద్ది పుణ్యాకరంబని యెపుడు జనులు
కష్టమెన్నక పఠియింప గలుగు ముక్తి.
భూషణ వికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
|| శ్రీకృష్ణార్పణమస్తు.||
99.నరసింహశతకము:శేషప్పకవి.
ఓ నరసింహస్వామీ !నిన్ను అనుసరించినవారు ముక్తిని పొందారు.అదేవిధంగా
నీ పాదపద్మములు నమ్మిన నాకు మోక్షమివ్వు.నన్ను కడతేర్చి రక్షించి సేవకునిగా
చేసుకొని కాపాడితే నీకు సేవకుడినై నీ పనులుచేస్తా వేగమే దృగ్గోచరుడవు కమ్ము అని
చనువుగా పలికే కవి పలుకులు విందామా!
సీ: అమరేంద్ర వినుత నిన్ననుసరించినవారు
ముక్తి బొందిరి వేగ ముదముతోడ
నీ పాదపద్మముల్ నెర నమ్మి యున్నాను
నాకు మోక్షంబిమ్ము నళిన నేత్ర
కాచి రక్షించునన్ గడతేర్పు వేగమే
నీ సేవకుని జేయు నిశ్చయముగ
గాపాడినను నీకు గైంకర్యపరుడనై
చెలగి నీ పనులను చేయువాడ
ననుచు బలుమారు వేడెద నబ్జనాభ
నాకు ప్రత్యక్షమగుము నిన్నమ్మినాను
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
ముక్తి బొందిరి వేగ ముదముతోడ
నీ పాదపద్మముల్ నెర నమ్మి యున్నాను
నాకు మోక్షంబిమ్ము నళిన నేత్ర
కాచి రక్షించునన్ గడతేర్పు వేగమే
నీ సేవకుని జేయు నిశ్చయముగ
గాపాడినను నీకు గైంకర్యపరుడనై
చెలగి నీ పనులను చేయువాడ
ననుచు బలుమారు వేడెద నబ్జనాభ
నాకు ప్రత్యక్షమగుము నిన్నమ్మినాను
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
సమస్య:- 136.
*తుమ్మెద మోమున ముసిరెను
తోయజ మనుచున్
కం:కమ్మని కమలము బోలు,ము
ఖమ్మును జూచిన సఖుండు కనుచా దీప్తిన్
నెమ్మనమున మరులు గలుగ
తుమ్మెద మోమున ముసిరెను తోయజ మనుచున్.
ఖమ్మును జూచిన సఖుండు కనుచా దీప్తిన్
నెమ్మనమున మరులు గలుగ
తుమ్మెద మోమున ముసిరెను తోయజ మనుచున్.
98.నరసింహశతకము:
శేషప్పకవి.
ఓ నరసింహస్వామీ !కాపాడినా నీవే కష్ట పెట్టినా నీవే
నిన్నే నమ్ముకొన్నానయ్యా .అప్పుడప్పుడు నీ దివ్య లక్షణ గుణాలు తెలుసుకోలేక వెఱ్ఱి
వాడినయ్యాను.ఈ నా వెఱ్ఱి గుణాలు ఖండించి నన్ను రక్షించు స్వామీ అంటూ శతకకర్తతో
పాటు మనమూ మొరపెట్టుకొందామా !.
సీ: లక్ష్మీశ నీ దివ్య లక్షణగుణముల
వినజాల కెప్పుడు వెఱ్ఱి నైతి
నా వెఱ్ఱి గుణములు నయముగా
ఖండించి నన్ను రక్షించుమో నళిననేత్ర
నిన్ను నేనమ్మితి నితర దైవముల నే
నమ్మలేదెప్పడు నాగశయన
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె
నీపాదకమలముల్ నిరుత మేను
నమ్మి యున్నాను నీపాద నచల భక్తి
వేగ దయచేసి రక్షించు వేదవేద్య
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహదురిత దూర.
వినజాల కెప్పుడు వెఱ్ఱి నైతి
నా వెఱ్ఱి గుణములు నయముగా
ఖండించి నన్ను రక్షించుమో నళిననేత్ర
నిన్ను నేనమ్మితి నితర దైవముల నే
నమ్మలేదెప్పడు నాగశయన
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె
నీపాదకమలముల్ నిరుత మేను
నమ్మి యున్నాను నీపాద నచల భక్తి
వేగ దయచేసి రక్షించు వేదవేద్య
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహదురిత దూర.
సమస్య:-126.
* నత్త పరుగు దీయ నవ్వె
లేడి.
ఆ.వె:అల్లుడాడుచుండ నానంద మొదవెను
లేడి గంతు లేయు లేత కూన
లాటల పరికించు నటునిటు వడివడి
నత్త పరుగు దీయ నవ్వె లేడి.
లేడి గంతు లేయు లేత కూన
లాటల పరికించు నటునిటు వడివడి
నత్త పరుగు దీయ నవ్వె లేడి.
97:-నరసింహశతకము:-శేషప్పకవి.
శతకకర్త ఈ పద్యములో కూర్మ,వరాహ,నరసింహ,వామన, మూర్తులను వివరించారు.ఓ
నరసింహస్వామీ!ఇట్టి పనులు నీవు తప్ప మరెవ్వరు చేయగలరని అంటూ స్వామి సామర్థ్యాన్ని
కొనియాడే తీరు చూద్దామా!
సీ: కూర్మావతారమై కుధరంబు క్రిందను
కోర్కెతో నుండవా కొమరు మిగుల
వరహావతారమై వనభూములను జొచ్చి
శిక్షింప హిరణ్యాక్షు నపుడు
నరసింహమూర్తివై నరభోజను
హిరణ్యకశిపుని ద్రుంపవా కాంతి మీర
వామనరూపమై వసుధలో బలిచక్రవర్తి
నణంపవా వైర ముడిగి
ఇట్టి పనులెల్ల చేయగా నె్వరి కేని
తగునె నరసింహ నీకె కా దగును గాక
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర.
కోర్కెతో నుండవా కొమరు మిగుల
వరహావతారమై వనభూములను జొచ్చి
శిక్షింప హిరణ్యాక్షు నపుడు
నరసింహమూర్తివై నరభోజను
హిరణ్యకశిపుని ద్రుంపవా కాంతి మీర
వామనరూపమై వసుధలో బలిచక్రవర్తి
నణంపవా వైర ముడిగి
ఇట్టి పనులెల్ల చేయగా నె్వరి కేని
తగునె నరసింహ నీకె కా దగును గాక
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర.
97:-నరసింహశతకము:-శేషప్పకవి.
శతకకర్త ఈ పద్యములో కూర్మ,వరాహ,నరసింహ,వామన, మూర్తులను వివరించారు.ఓ
నరసింహస్వామీ!ఇట్టి పనులు నీవు తప్ప మరెవ్వరు చేయగలరని అంటూ స్వామి సామర్థ్యాన్ని
కొనియాడే తీరు చూద్దామా!
సీ: కూర్మావతారమై కుధరంబు క్రిందను
కోర్కెతో నుండవా కొమరు మిగుల
వరహావతారమై వనభూములను జొచ్చి
శిక్షింప హిరణ్యాక్షు నపుడు
నరసింహమూర్తివై నరభోజను
హిరణ్యకశిపుని ద్రుంపవా కాంతి మీర
వామనరూపమై వసుధలో బలిచక్రవర్తి
నణంపవా వైర ముడిగి
ఇట్టి పనులెల్ల చేయగా నె్వరి కేని
తగునె నరసింహ నీకె కా దగును గాక
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర.
కోర్కెతో నుండవా కొమరు మిగుల
వరహావతారమై వనభూములను జొచ్చి
శిక్షింప హిరణ్యాక్షు నపుడు
నరసింహమూర్తివై నరభోజను
హిరణ్యకశిపుని ద్రుంపవా కాంతి మీర
వామనరూపమై వసుధలో బలిచక్రవర్తి
నణంపవా వైర ముడిగి
ఇట్టి పనులెల్ల చేయగా నె్వరి కేని
తగునె నరసింహ నీకె కా దగును గాక
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర.
సమస్య:123
ఆ.వె: భక్తులెల్ల చేరి భగవంతు గొల్చుచు
తీర్థయాత్ర సలుప తీవ్రముగను
దారి తానె నడుపు దైవమనుచు నమ్ము
పాదచారు లేగ బాట లేల.
తీర్థయాత్ర సలుప తీవ్రముగను
దారి తానె నడుపు దైవమనుచు నమ్ము
పాదచారు లేగ బాట లేల.
96:నరసింహశతకము:-శేషప్పకవి.
సాధారణంగా భగవంతుని స్తుతించాలంటే దశావతారాల వర్ణన
తప్పనిసరి.కవి ఈ పద్యంలో మత్స్యావతారకథను వివరిస్తున్నారు.ఆ అవతార ప్రయోజనాన్ని
తెలుపుతూ వేదాల నపహరించిన సోమకాసురుని చంపి వేదాల నివ్వడం వల్ల అవని జనులు ఆచార
నిష్టలతో ఆచరించి మోక్షార్హులౌతున్నారని వివరిస్తున్నారు.
సీ: మత్స్యావతారమై మడుగు లోపలజొచ్చి
సోమకాసురు ద్రుంచి చోద్యముగను
దెచ్చి వేదములెల్ల దేవ భూసురులకు
మెచ్చి యిచ్చితీవు మేలు నొంది
నా వేదముల నియ్య నాచార నిష్టల
ననుభవించు చునుందురవని సురలు
సకల పాపంబులు సమసి పోవునటంచు
మనుజులందరు నీదు మహిమ దెలిసి
యుందురరవింద నయన యునికి తెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహదురితదూర.
సోమకాసురు ద్రుంచి చోద్యముగను
దెచ్చి వేదములెల్ల దేవ భూసురులకు
మెచ్చి యిచ్చితీవు మేలు నొంది
నా వేదముల నియ్య నాచార నిష్టల
ననుభవించు చునుందురవని సురలు
సకల పాపంబులు సమసి పోవునటంచు
మనుజులందరు నీదు మహిమ దెలిసి
యుందురరవింద నయన యునికి తెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహదురితదూర.
తాత తండ్రు లెల్ల తాటియాకుల యందు
చదువు సంధ్య నేర్చి చక్కనైరి
యంత్రములును వచ్చె నయ్యవార్లును లేక
పుస్తకాల చదువు పురుగులందు.
చదువు సంధ్య నేర్చి చక్కనైరి
యంత్రములును వచ్చె నయ్యవార్లును లేక
పుస్తకాల చదువు పురుగులందు.
95:నరసింహశతకము:శేషప్పకవి
దీనరక్షకుడైన స్వామి అందరికి శుభాన్ని,శరణును,మంగళమును,భద్రమును,దిగ్విజయాన్ని,వైభవాన్ని , నిత్యకల్యాణాన్ని,కల్గిస్తాడు కదా!అట్టి
స్వామికి "పైవన్నీ"కలగాలని కోరే శతకకర్తతో గొంతుకలిపి మనమూ
దండాలుపెడదామా!
సీ: దనుజ సంహార చక్రధర నీకు దండంబు లిందిరాధవ నీకు వందనంబు
పతిత పావన నీకు బహు నమస్కారముల్ నీరజాతదళాక్ష నీకు శరణు
వాసవార్చిత మేఘవర్ణ నీకు భద్రంబు దీనరక్షక నీకు దిగ్విజయము
సకల వైభవములు నీకు సార్వభౌమ
నిత్యకల్యాణములునగు నీకు నెపుడు
భూషణ వికాసశ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.
సీ: దనుజ సంహార చక్రధర నీకు దండంబు లిందిరాధవ నీకు వందనంబు
పతిత పావన నీకు బహు నమస్కారముల్ నీరజాతదళాక్ష నీకు శరణు
వాసవార్చిత మేఘవర్ణ నీకు భద్రంబు దీనరక్షక నీకు దిగ్విజయము
సకల వైభవములు నీకు సార్వభౌమ
నిత్యకల్యాణములునగు నీకు నెపుడు
భూషణ వికాసశ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.
సమస్య:123
ఆ.వె:నేడు జనుల యందు నిష్ఠ తగ్గుచు, చేయ
చిత్తశుద్ధి లేని చేష్ట లయ్యె,
పాప భీతి నెట్లొ పాపు కొనగ నెంచ,
*భక్తి నాగరికత బాట బట్టె
చిత్తశుద్ధి లేని చేష్ట లయ్యె,
పాప భీతి నెట్లొ పాపు కొనగ నెంచ,
*భక్తి నాగరికత బాట బట్టె
94.నరసింహశతకము:-శేషప్పకవి.
ఈ లోకంలో దుర్మార్గులతో చెలిమి చేస్తే కల్గె చేటును
గురించి కవి చక్కగా వివరిస్తున్నాడు.కాస్తో కూస్తో తెలివున్నవారెవరు ఇలాంటి పనులు
చేయరు.ఒకవేళ చేస్తే ఎలా వుంటుందో చక్కని పోలికలతో వివరిస్తున్నారు.పాము పుట్టలమీద
పవ్వళించినట్లు,పులుల
గుంపు చేరబోయినట్లు.మొసళ్ళు నిండిన మడుగులో ప్రవేశించినట్లు,గంగ సమీపంలో ఇల్లు
కట్టినట్లు,చెదలున్న
భూమిలో చాప వేసినట్లు,ఓటి
బిందెలో పాలు ఉంచినట్లు,-----ఇవన్నీ ఎలావ్యర్థాలో "ఓ స్వామీ"నీ భక్తులు
దుష్టులతో చెలిమి చేస్తే అంతే వ్యర్థలై పోతారు.
సీ: ఫణుల పుట్టల మీద పవ్వళించిన యట్లు
పులుల గుంపున జేరబోయినట్లు
మకరివర్గంబున్న మడుగు జొచ్చినయట్లు
గంగ దాపున నిండ్లు గట్టినట్లు
చెదలుభూమిని చాప చేర బరచినయట్లు
ఓటిబిందెల పాలు నునిచినట్లు
వెఱ్ఱివానికి బహు విత్తమిచ్చినయట్లు
కమ్మగుడిసె ముందు గాల్చినట్లు
స్వామి నీ భక్తపరులుదుర్జనులతోడ
చెలిమి చేసిన యేట్లయిన చేటు వచ్చు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
పులుల గుంపున జేరబోయినట్లు
మకరివర్గంబున్న మడుగు జొచ్చినయట్లు
గంగ దాపున నిండ్లు గట్టినట్లు
చెదలుభూమిని చాప చేర బరచినయట్లు
ఓటిబిందెల పాలు నునిచినట్లు
వెఱ్ఱివానికి బహు విత్తమిచ్చినయట్లు
కమ్మగుడిసె ముందు గాల్చినట్లు
స్వామి నీ భక్తపరులుదుర్జనులతోడ
చెలిమి చేసిన యేట్లయిన చేటు వచ్చు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
ఇందులో"కమ్మ గుడిసెముందు గాల్చినట్లు"అనే
ప్రయోగం అర్థం కాలే దు.మాండలిక ప్రయోగమేమో.మిత్రెలెవరైనా తెలుప గలరు.
93. నరసింహశతకము
:-శేషప్పకవి.
ఓ స్వామీ నన్ను పోషించే దాతవు నీవేకదా!ఆ ధైర్యంతో నిన్నే నమ్ముకొన్నాను.నీ లాంటి ప్రభువును ఎక్కడా చూడలేదు.నే చేసిన పాపాలు తొలగించి నన్ను నిర్వహిచవయ్యా అనే కవితో మనమూ గొంతు కలుపుదామా!
నవసరోజదళాక్ష నన్ను పోషించెడి
దాతవునీవంచు ధైర్య పడితి
నా మనంబున నిన్ను నమ్మియుందును
దండ్రి మేలు నాకొనరింపు నీలదేహ
భళిభళి నీ యంత ప్రభువు నెక్కడ జూడ
బుడమిలోనీ పేరు పొగడ వచ్చు
ముందు చేసిన పాపమును నశింపగ చేసి నిర్వహింపుము నన్ను నేర్పు తోడ
పరమ సంతోషమాయె నాప్రాణములకు
నీ ఋణము తీర్చుకొననేర నీరజాక్ష
భూషణవికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
ఓ స్వామీ నన్ను పోషించే దాతవు నీవేకదా!ఆ ధైర్యంతో నిన్నే నమ్ముకొన్నాను.నీ లాంటి ప్రభువును ఎక్కడా చూడలేదు.నే చేసిన పాపాలు తొలగించి నన్ను నిర్వహిచవయ్యా అనే కవితో మనమూ గొంతు కలుపుదామా!
నవసరోజదళాక్ష నన్ను పోషించెడి
దాతవునీవంచు ధైర్య పడితి
నా మనంబున నిన్ను నమ్మియుందును
దండ్రి మేలు నాకొనరింపు నీలదేహ
భళిభళి నీ యంత ప్రభువు నెక్కడ జూడ
బుడమిలోనీ పేరు పొగడ వచ్చు
ముందు చేసిన పాపమును నశింపగ చేసి నిర్వహింపుము నన్ను నేర్పు తోడ
పరమ సంతోషమాయె నాప్రాణములకు
నీ ఋణము తీర్చుకొననేర నీరజాక్ష
భూషణవికాస శ్రీధర్మపురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
మంచి శతకపద్యాలను శృంగారనైషదాది
కావ్యాలను సులభమైన రీతిలో వివరిస్తున్న శ్రీ పిస్కా సత్యనారాయణగారికి జన్మదిన
శుభాకాంక్షలు.
"పి"ల్లలకే కాదు పెద్దలకు సైతం మంచి సం
"స్కా"రయుతమైన శ్లోకములను
"స"రళమైన భావార్థములతో,అ
"త్య"ంతానందము కల్గు విధమున
"నా"నాకవుల చక్కని పద్య
"రా"జములను,అందలి విశేష విష
"య"ములను సుందరంగా తెల్పుతూ పురా
"ణ"ప్రసిద్ధములైన ఘట్టాలను పరిచయం చేస్తున్న
శ్రీపిస్కా సత్యనారాయణగారికి అచ్చంగా"తెలుగుబృందం"సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
"పి"ల్లలకే కాదు పెద్దలకు సైతం మంచి సం
"స్కా"రయుతమైన శ్లోకములను
"స"రళమైన భావార్థములతో,అ
"త్య"ంతానందము కల్గు విధమున
"నా"నాకవుల చక్కని పద్య
"రా"జములను,అందలి విశేష విష
"య"ములను సుందరంగా తెల్పుతూ పురా
"ణ"ప్రసిద్ధములైన ఘట్టాలను పరిచయం చేస్తున్న
శ్రీపిస్కా సత్యనారాయణగారికి అచ్చంగా"తెలుగుబృందం"సభ్యుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
కన్నయ్యకోసం రాధ ఎదురు చూపులు .
పోదము బృందావనికని
మాధవుని దలంచి దాను మమతల విరులన్
మోదమ్మున మది నిడుకొని
రాధిక యేతెంచె నటకు రాగము తోడన్.
మాధవుని దలంచి దాను మమతల విరులన్
మోదమ్మున మది నిడుకొని
రాధిక యేతెంచె నటకు రాగము తోడన్.
డా:బి.ఉమాదేవి,
16/12/14.
16/12/14.
93.నరసింహ
శతకము:-శేషప్పకవి.
ఓ స్వామీ నన్ను పోషించే దాతవు నీవే అనే ధైర్యంతో
వున్నాను.కావున నాకు మేలొనరించవయ్యా.నే చేసిన పాపాలు పోగొట్టు.నీలాంటి ప్రభువు
నెక్కడా చూడలేదయ్యా! నీఋణం నిజంగా తీర్చుకోలేనయ్యా స్వామీ అనే కవితో మనమూ గొంతు
కలుపుదామా.
సీ: నవసరోజదళాక్ష నన్ను పోషించెడి
దాతవు నీవంచు ధైర్య పడితి
నామనంబున నిన్ను నమ్మియుందును దండ్రి
మేలు నాకొనరింపు నీలదేహ
భళిభళి నీయంత ప్రభువు నెక్కడ జూడ
బుడమిలో నీపేరు పొగడ వచ్చు
ముందు జేసిన పాపమును నశింపగ చేసి
నిర్వహింపుము నన్ను నేర్పుతోడ
పర మ సంతోషమాయె నా ప్రాణములకు
నీఋణము తీర్చుకొన నేర నీరజాక్ష.
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
దాతవు నీవంచు ధైర్య పడితి
నామనంబున నిన్ను నమ్మియుందును దండ్రి
మేలు నాకొనరింపు నీలదేహ
భళిభళి నీయంత ప్రభువు నెక్కడ జూడ
బుడమిలో నీపేరు పొగడ వచ్చు
ముందు జేసిన పాపమును నశింపగ చేసి
నిర్వహింపుము నన్ను నేర్పుతోడ
పర మ సంతోషమాయె నా ప్రాణములకు
నీఋణము తీర్చుకొన నేర నీరజాక్ష.
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
92:నరసింహశతకము:-శేషప్పకవి.
సీ : ఓనరసింహస్వామీ! నీవు మెచ్చుకొనేట్లుగా నే పూజింప
లేను.పోనీ యేమైనా ఆభరణాలు పెట్టి పూజిద్దామంటే
నీదగ్గర అన్నీ వున్నాయికదా!కౌస్తుభ రత్నము ముందే నీ దగ్గరుంది.మంచి భోజనం పెడదామంటే దేవతలకే భోజనం(అమృతం)పెట్టిన స్వామివి నీవు.నాకున్నంతలో కాసులేమైనా ఇద్దామంటే కలిమినిచ్చే తల్లే నీ భార్య కదా! అన్నీ వున్నవాడివి అఖిల లోకాధిపతివి నీవు.నీకు సొమ్ములు పెట్ట నేనెంత వాణ్ణయ్యా అనే కవి పలుకులు విందామా !.
నీదగ్గర అన్నీ వున్నాయికదా!కౌస్తుభ రత్నము ముందే నీ దగ్గరుంది.మంచి భోజనం పెడదామంటే దేవతలకే భోజనం(అమృతం)పెట్టిన స్వామివి నీవు.నాకున్నంతలో కాసులేమైనా ఇద్దామంటే కలిమినిచ్చే తల్లే నీ భార్య కదా! అన్నీ వున్నవాడివి అఖిల లోకాధిపతివి నీవు.నీకు సొమ్ములు పెట్ట నేనెంత వాణ్ణయ్యా అనే కవి పలుకులు విందామా !.
సీ: నిగమగోచర నేను నీకు మెప్పగునట్లు లెస్సగా
బూజింప లేదు సుమ్మీ
నాకు తోచిన భూషణములు పెట్టెదనన్న కౌస్తుభమణి
నీకు ముందె గలదు
భక్ష్య భోజ్యముల నర్పణము జేసెద నన్న నీవు
పెట్టితి సుధ నిర్జరులకు
కలిమి కొద్దిగ గానుకల నొసంగెదనన్న
భార్గవీదేవి నీ భార్య యయ్యె
నన్నిగలవాడవఖిల లోకాధిపతివి
నీకు సొమ్ములు పెట్ట నేనెంత వాడ
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
బూజింప లేదు సుమ్మీ
నాకు తోచిన భూషణములు పెట్టెదనన్న కౌస్తుభమణి
నీకు ముందె గలదు
భక్ష్య భోజ్యముల నర్పణము జేసెద నన్న నీవు
పెట్టితి సుధ నిర్జరులకు
కలిమి కొద్దిగ గానుకల నొసంగెదనన్న
భార్గవీదేవి నీ భార్య యయ్యె
నన్నిగలవాడవఖిల లోకాధిపతివి
నీకు సొమ్ములు పెట్ట నేనెంత వాడ
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
91.నరసింహశతకము:-శేషప్పకవి.
స్వామి చెంతకు చేరడానికి కావలసిన అర్హతలను గురించి
చక్కగా కవి వివరిస్తున్నారు.ఓ స్వామి! నీ కధలు వింటుంటే పులకరించి పోయేవాడు,నీ నామ కీర్తనలో మై
మరచి పోయేవాడు,నీ
పాదపద్మాలకు సాష్టాంగనమస్కారమొనరించే వాడు,ఎల్లప్పుడూ నీ
నామస్మరణం చేస్తూ హృదయకమలంలో నిన్ను చేర్చుకొనేవాడు ఖచ్చితంగా నీ లోకంలోనే
వుంటాడనే చక్కని పద్యాన్ని చూద్దామా!
సీ: నీ కథల్ చెవులలో సోకుట మొదలుగ
బులకాంకురము మేన బుట్టువాడు
నయమైన నీనామ దివ్యకీర్తనలలోన
మగ్నుడై దేహంబు మరచు వాడు
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు
ప్రేమతో దండమర్పించువాడు
హాపుండరీకాక్ష హారామ హరియంచు
వేడ్కతో గేకలు వేయువాడు
చిత్త కమలంబునను నిన్ను జేర్చువాడు
నీదు లోకము నందుండు నీరజాక్ష
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర.
బులకాంకురము మేన బుట్టువాడు
నయమైన నీనామ దివ్యకీర్తనలలోన
మగ్నుడై దేహంబు మరచు వాడు
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు
ప్రేమతో దండమర్పించువాడు
హాపుండరీకాక్ష హారామ హరియంచు
వేడ్కతో గేకలు వేయువాడు
చిత్త కమలంబునను నిన్ను జేర్చువాడు
నీదు లోకము నందుండు నీరజాక్ష
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న
"క"విత్వరచన చేయ
నుత్సుకత గలవారి ,ప
"ట్టు"దలను మెచ్చి వారల ప్రోత్సహింప నెంచి
"ప"ద్య రచన కనువైన ఛందో రీతుల నెల్ల,త
"ల్లి"(మాతృ)భాషలో నందజేస్తూ,సు
"ప్ర"సిద్ధమైన ఉదాహరణల నొసగుతూ,ప్రశం
"సా"ర్హమైన వ్యాఖ్యలతో నుత్తేజ పరుస్తూ,మృ
"దు"వైన పదాలతో హుషారు గొల్పే 'బాబాయి'
"గా" రుగా "అచ్చంగాతెలుగు'బృందానికి చిరప
"రి"చితులైన శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారి
"కి"అచ్చంగా తెలుగు బృందసభ్యుల తరఫున జన్మదినశుభాకాంక్షలు.
మొదటి అక్షరాలలో దాగిన వ్యక్తిని గమనించారా !
"ట్టు"దలను మెచ్చి వారల ప్రోత్సహింప నెంచి
"ప"ద్య రచన కనువైన ఛందో రీతుల నెల్ల,త
"ల్లి"(మాతృ)భాషలో నందజేస్తూ,సు
"ప్ర"సిద్ధమైన ఉదాహరణల నొసగుతూ,ప్రశం
"సా"ర్హమైన వ్యాఖ్యలతో నుత్తేజ పరుస్తూ,మృ
"దు"వైన పదాలతో హుషారు గొల్పే 'బాబాయి'
"గా" రుగా "అచ్చంగాతెలుగు'బృందానికి చిరప
"రి"చితులైన శ్రీ కట్టుపల్లి ప్రసాద్ గారి
"కి"అచ్చంగా తెలుగు బృందసభ్యుల తరఫున జన్మదినశుభాకాంక్షలు.
మొదటి అక్షరాలలో దాగిన వ్యక్తిని గమనించారా !
89.నరసింహశతకము:-శేషప్పకవి.
ఓ నరసింహస్వామీ! నీ మహిమలు మాలాంటి నరుల కెలా
తెలుస్తాయయ్యా?తెలిస్తే
ఆ ముక్కంటికి తెలియాలి లేదా బ్రహ్మ దేవుడికి తెలియా లి నీ మాయా సమర్థత కళ్ళార
చూసిన బలికి తెలుసు.ఇంకా వేయికన్నులు గల ఇంద్రునికి తెలుసు.నరులెవ్వరైనా తెలుసంటే
నవ్విపోతారంతే అంటూ స్వామి ఔన్నత్త్యాన్ని వివరించే పద్యమిది.
సీ: నాగేంద్ర శయన నీ నామ మాధుర్యంబు
మూడుకన్నుల సాంబమూర్తి కెరుక
పంకజాతాక్ష నీ బల పరాక్రమమెల్ల
భారతీ పతియైన బ్రహ్మ కెరుక
మధుకైటభారి నీ మాయా సమర్థత
వసుధలో బలిచక్ర వర్తికెరుక
పరమాత్మ నీదగు పక్షపాతిత్వంబు
దశ శతాక్షుల పురందరుని కెరుక
వీరికెరుకగు నీ కథల్వింతలెల్౹ల
నరుల కెరుకన్ననెవరైన నవ్విపోరె
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
మూడుకన్నుల సాంబమూర్తి కెరుక
పంకజాతాక్ష నీ బల పరాక్రమమెల్ల
భారతీ పతియైన బ్రహ్మ కెరుక
మధుకైటభారి నీ మాయా సమర్థత
వసుధలో బలిచక్ర వర్తికెరుక
పరమాత్మ నీదగు పక్షపాతిత్వంబు
దశ శతాక్షుల పురందరుని కెరుక
వీరికెరుకగు నీ కథల్వింతలెల్౹ల
నరుల కెరుకన్ననెవరైన నవ్విపోరె
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
88.నరసింహశతకము:-శేషప్పకవి
సముద్రంవలె గంభీరుడు,సామగాన విలోలుడు,శ్రీవత్సాంకితుడు,కౌస్తుభ రత్నధరుడు,పంచాయుధ ధరుడు,దీన రక్షకుడు,దైత్య శిక్షకుడు,నాగశయనుడు,నవరత్న కుండల శ్రవణ విరాజితుడు,బ్రహ్మ,రుద్ర,ఇంద్రా దుల చేత అర్చింపబడే ఆ విశ్వ రూపుని కవితో పాటు మనమూ స్తుతిద్దామా!.
సముద్రంవలె గంభీరుడు,సామగాన విలోలుడు,శ్రీవత్సాంకితుడు,కౌస్తుభ రత్నధరుడు,పంచాయుధ ధరుడు,దీన రక్షకుడు,దైత్య శిక్షకుడు,నాగశయనుడు,నవరత్న కుండల శ్రవణ విరాజితుడు,బ్రహ్మ,రుద్ర,ఇంద్రా దుల చేత అర్చింపబడే ఆ విశ్వ రూపుని కవితో పాటు మనమూ స్తుతిద్దామా!.
సీ:భువనేశ గోవింద రవికోటి సంకాశ
పక్షివాహన భక్త పారిజాత
అంభోజ భవరుద్ర జంభారి సన్నుత
సామగాన విలోల సారసాక్ష
వనధి గంభీర శ్రీవత్స కౌస్తుభ వక్ష
శంఖచక్ర గదాసి శార్ఙహస్త
దీనరక్షక వాసుదేవ దైత్యవినాశ
నారదార్చిత దివ్య నాగ శయన
చారు నవరత్న కుండల శ్రవణయుగళ
విబుధ వందిత పాదాబ్జ విశ్వరూప
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
పక్షివాహన భక్త పారిజాత
అంభోజ భవరుద్ర జంభారి సన్నుత
సామగాన విలోల సారసాక్ష
వనధి గంభీర శ్రీవత్స కౌస్తుభ వక్ష
శంఖచక్ర గదాసి శార్ఙహస్త
దీనరక్షక వాసుదేవ దైత్యవినాశ
నారదార్చిత దివ్య నాగ శయన
చారు నవరత్న కుండల శ్రవణయుగళ
విబుధ వందిత పాదాబ్జ విశ్వరూప
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
సమస్య:28
తనయుని పెండ్లియాడి వనితామణి గాంచె కుమార రత్నమున్.
తనయుని పెండ్లియాడి వనితామణి గాంచె కుమార రత్నమున్.
ఉ:అనవరతంబుయన్నకనుసన్నలలోచరియించు వాయునం
దనుడట లక్కయింటను కుతంత్రము నంత నెఱింగి యాగృహం
బనలున కాహుతిచ్చి వనియందు చరింప హిడింబ యాపృథా
తనయుని పెండ్లియాడి వనితామణి గాంచె కుమార రత్నమున్.
దనుడట లక్కయింటను కుతంత్రము నంత నెఱింగి యాగృహం
బనలున కాహుతిచ్చి వనియందు చరింప హిడింబ యాపృథా
తనయుని పెండ్లియాడి వనితామణి గాంచె కుమార రత్నమున్.
87.నరసింహ
శతకము:-శేషప్పకవి.
ఓ స్వామీ! నేనతి దురాత్ముడనని నీవు నాకు కలలో కూడా
కన్పించడం లేదు.సరే ప్రత్యక్షం కాకపోయినా ఫర్వాలేదు లేవయ్యా!నా కొక మంచి ఉపాయం తోచింది.అదేంటంటావా!గట్టి
కొయ్యను తెచ్చి నీ రూపం చిత్రించి ధూపదీపాలతో నిత్యనైవేద్యములతో కొలుస్తాను.నా
కంతే చాలనే కవి పలుకులు చూద్దామా!
సీ:అమరేంద్రవినుత నే నతి దురాత్ముడనంచు
కలలోన నైనను గనుల బడవు
నీవు ప్రత్యక్షమై నిల్వకుండిన మానె
దొడ్డగా నొక యుక్తి దొరికె నయ్య
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి
నీస్వరూపము చేసి నిలుపు కొందు
ధూప దీపములిచ్చి తులసితో పూజించి
నిత్యనైవేద్యము ల్నేమముగను
నడుపుచును నిన్ను గొలిచెద నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గల్గు నా కింతె చాలు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
కలలోన నైనను గనుల బడవు
నీవు ప్రత్యక్షమై నిల్వకుండిన మానె
దొడ్డగా నొక యుక్తి దొరికె నయ్య
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి
నీస్వరూపము చేసి నిలుపు కొందు
ధూప దీపములిచ్చి తులసితో పూజించి
నిత్యనైవేద్యము ల్నేమముగను
నడుపుచును నిన్ను గొలిచెద నమ్మి బుద్ధి
నీ ప్రపంచంబు గల్గు నా కింతె చాలు
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
86.నరసింహశతకము:-శేషప్పకవి.
ఓ గరుడవాహనా! నీవు గొప్పదాతవని కొలువ వచ్చా.అర్థిమార్గంలో నానా వేషాలు వేసి నావిద్యలన్నీ ప్రదర్శించా.నీకు ఆనందమైతే నే నడిగింది ఇచ్చి నాకోర్కె దీర్చు.నీకు నా వేషాలు నచ్చలేదనుకో ఇక మాటి మాటికి వేషాలేయనంటూ గారాలు పోయే భక్తుని అంతరంగము చూద్దామా!
ఓ గరుడవాహనా! నీవు గొప్పదాతవని కొలువ వచ్చా.అర్థిమార్గంలో నానా వేషాలు వేసి నావిద్యలన్నీ ప్రదర్శించా.నీకు ఆనందమైతే నే నడిగింది ఇచ్చి నాకోర్కె దీర్చు.నీకు నా వేషాలు నచ్చలేదనుకో ఇక మాటి మాటికి వేషాలేయనంటూ గారాలు పోయే భక్తుని అంతరంగము చూద్దామా!
తార్క్ష్యవాహన నీవు దండిదాత వటంచు
గోరి వేడుక నిన్ను గొల్వ వచ్చి
అర్థిమార్గము నేననుసరించితినయ్య
లావైన పదునారుగులక్షలైన
వేషముల్వేసి నా విద్య చాతుర్యంబు
జూపసాగితి నీకు సుందరాంగ
ఆనందమైన నే నడుగ వచ్చినదిచ్చి
వాంఛ వదీర్పుము నీలవర్ణ వేగ
నీకు నా విద్య హర్షంబు గాక యున్న
తేపతేపకు వేషములల్ తేను సుమ్మి
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
గోరి వేడుక నిన్ను గొల్వ వచ్చి
అర్థిమార్గము నేననుసరించితినయ్య
లావైన పదునారుగులక్షలైన
వేషముల్వేసి నా విద్య చాతుర్యంబు
జూపసాగితి నీకు సుందరాంగ
ఆనందమైన నే నడుగ వచ్చినదిచ్చి
వాంఛ వదీర్పుము నీలవర్ణ వేగ
నీకు నా విద్య హర్షంబు గాక యున్న
తేపతేపకు వేషములల్ తేను సుమ్మి
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర
85.నరసింహశతకము:-శేషప్పకవి.
నరసింహస్వామితో కవి చనువుగా పోట్లాడుతూ అలిగే తీరు చూద్దామా! ఓ స్వామీ నీకే నాపై ప్రేమ లేదు.నిన్నే నమ్ముకొని ఎక్కడికీ పోకుండా వున్నందుకు నేనంటే ప్రేమ లేదు కదూ! నేనెక్కడికి పోయినా నా కింత ముద్ద అన్నం దొరుకుతుంది."తిరుపతి"కెళితే వెంకటేశ్వరుడన్నం పెట్టడా?పురుషోత్తమక్షేత్రానికి(పూరీ)పోతే జగన్నాథుడు,కంచి కెళితే వరదరాజస్వామి,అన్నం పెట్టరను కొన్నావా?అంటూ కవితో పాటు మనమూ ప్రశ్నిద్దామా?.
నరసింహస్వామితో కవి చనువుగా పోట్లాడుతూ అలిగే తీరు చూద్దామా! ఓ స్వామీ నీకే నాపై ప్రేమ లేదు.నిన్నే నమ్ముకొని ఎక్కడికీ పోకుండా వున్నందుకు నేనంటే ప్రేమ లేదు కదూ! నేనెక్కడికి పోయినా నా కింత ముద్ద అన్నం దొరుకుతుంది."తిరుపతి"కెళితే వెంకటేశ్వరుడన్నం పెట్టడా?పురుషోత్తమక్షేత్రానికి(పూరీ)పోతే జగన్నాథుడు,కంచి కెళితే వరదరాజస్వామి,అన్నం పెట్టరను కొన్నావా?అంటూ కవితో పాటు మనమూ ప్రశ్నిద్దామా?.
సీ: తిరుపతి స్థలమందు తిన్నగా నేనున్న
వెంకటేశుడు మేత మేయలేడొ
పురుషోత్తమునకే బోయిన జాలు
జగన్నాథు డన్నంబు గడప లేడొ
శ్రీరంగమునకు నేచేర బోయిన జాలు
స్వామి గ్రాసము పెట్టి సాకలేడొ
కాంచీ పురములోన గదిసి నే కొల్వున్న
గరి వరదుడు పొట్ట గడుప లేడొ
ఎందు బోవక నేను నీమందిరమున
నిల్చితిని నీకు నామీద నెనరు లేదు
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూ
వెంకటేశుడు మేత మేయలేడొ
పురుషోత్తమునకే బోయిన జాలు
జగన్నాథు డన్నంబు గడప లేడొ
శ్రీరంగమునకు నేచేర బోయిన జాలు
స్వామి గ్రాసము పెట్టి సాకలేడొ
కాంచీ పురములోన గదిసి నే కొల్వున్న
గరి వరదుడు పొట్ట గడుప లేడొ
ఎందు బోవక నేను నీమందిరమున
నిల్చితిని నీకు నామీద నెనరు లేదు
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూ
3:నరసింహశతకము:-శేషప్పకవి.
కవి ఈ పద్యంలో శ్రీ నరసింహస్వామి వారిని వర్ణించిన తీరు
అద్భుతంగా వుంది.స్వామివారి అలంకరణ,ఆభరణల వర్ణన చక్కగా
వివరించబడింది.స్వామి"దివ్యకౌస్తుభాలంకృతుడు.అందమైన మకరకుండలాలు గలవాడు.పట్టు
పీతాంబరాలతో విరాజితుడు.సూర్య చంద్రులు నయనాలుగా గలవాడు.రాక్షసాంతకుడు.లక్ష్మీశుడు,బ్రహ్మజనకుడు,సర్వేశుడైన
ఆపరమపురుషుని కవితో పాటు మనమూ కొలుద్దామా!
సీ:గరుడవాహన దివ్య కౌస్తుభాలంకార
రవికోటితేజ సారంగ వదన
మణిగణాన్విత హేమ మకుటాభరణ
చారు మకరకుండల దసవ్మందహాస
కాంచనాంబర రత్న కాంచీ విభూషిత
సురవరార్చిత చంద్ర సూర్య నయన
కమలనాభ ముకుంద గంగాధరస్తుత
రాక్షసాంతక నాగరాజ శయన
పతిత పావన లక్ష్మీశ బ్రహ్మ జనక
భక్తవత్సల సర్వేశ పరమపురుష
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.
రవికోటితేజ సారంగ వదన
మణిగణాన్విత హేమ మకుటాభరణ
చారు మకరకుండల దసవ్మందహాస
కాంచనాంబర రత్న కాంచీ విభూషిత
సురవరార్చిత చంద్ర సూర్య నయన
కమలనాభ ముకుంద గంగాధరస్తుత
రాక్షసాంతక నాగరాజ శయన
పతిత పావన లక్ష్మీశ బ్రహ్మ జనక
భక్తవత్సల సర్వేశ పరమపురుష
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.
శ్లో:ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్టన్
వామ కరేణ వరదాభయ పద్మచిహ్నం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువును శ్రీ శంకర భగవత్పాదులు కరావలంబ స్తోత్రంలో స్తుతించే పద్యమిది.ఒకచేత్తో చక్రము మరోచేత్తో శంఖము ధరించి,సముద్రరాజ సుత యైన లక్ష్మిని ఇంకోచేత,అభయముద్ర మరోచేత దాల్చిన స్వామియే శరణము.
(శ్రీనివాస్ వల్లభనేని గారు అడిగిన శ్లోకం లభ్యం
కావడంతో పోస్ట్ చేస్తున్నాను).
మన్యేన సింధుతనయా మవలంబ్య తిష్టన్
వామ కరేణ వరదాభయ పద్మచిహ్నం
లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం.
చతుర్భుజుడైన శ్రీమహావిష్ణువును శ్రీ శంకర భగవత్పాదులు కరావలంబ స్తోత్రంలో స్తుతించే పద్యమిది.ఒకచేత్తో చక్రము మరోచేత్తో శంఖము ధరించి,సముద్రరాజ సుత యైన లక్ష్మిని ఇంకోచేత,అభయముద్ర మరోచేత దాల్చిన స్వామియే శరణము.
(శ్రీనివాస్ వల్లభనేని గారు అడిగిన శ్లోకం లభ్యం
కావడంతో పోస్ట్ చేస్తున్నాను).
81. నరసింహ శతకము:-శేషప్ప
కవి.
ఓస్వామీ !ఈ శరీరము అస్థిరమైనదని తెలుసుకోలేక మా
స్వతంత్రమైన మదము కళ్ళకు కప్పడం వల్ల కామ మోహాల్లో మునిగి పోయాం.ఆ బ్రహ్మదేవుడైనా
ఈ శరీరాన్ని "గట్టి బంగారం"తో చేయక వట్టి తోలు ఎముకలతో మురికి చెత్త
చేర్చి మూట కట్టాడు.నిన్ను చూడలేము అంటూ తనువు అశాశ్వితమనే విషయాన్ని కవి
వివరిస్తున్నాడు.
సీ: పద్మాక్ష మమతచే బరము సందెదమంచు
విఱ్ఱవీగుదుమయ్య వెఱ్ఱి పుట్టి
మా స్వతంత్రంబైన మదము కండ్లకు గప్ప
మొగము పట్టదు కామ మోహమునకు
బ్రహ్మదేవుండైన పైడి దేహము గల్గ జేసి
వేయక మమ్ము జెరిచె నతడు
తుచ్ఛమైనటువంటి తోలెమ్ముకలతోడి
మురికి చెత్తను చేర్చి మూటకట్టె
నీశరీరాలు పడిపోవుటెరుగ కేము
కాముకులమైతి మిక మిమ్ము కానలేము
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
విఱ్ఱవీగుదుమయ్య వెఱ్ఱి పుట్టి
మా స్వతంత్రంబైన మదము కండ్లకు గప్ప
మొగము పట్టదు కామ మోహమునకు
బ్రహ్మదేవుండైన పైడి దేహము గల్గ జేసి
వేయక మమ్ము జెరిచె నతడు
తుచ్ఛమైనటువంటి తోలెమ్ముకలతోడి
మురికి చెత్తను చేర్చి మూటకట్టె
నీశరీరాలు పడిపోవుటెరుగ కేము
కాముకులమైతి మిక మిమ్ము కానలేము
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
మిత్రులందరికి గీతాజయంతి శుభాకాంక్షలు.
"సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్"
ఉపనిషత్తులే గోవులు,గోపాలకృష్ణుడే పాలుపిదికేవాడు,అర్జునుడు దూడ ,మహత్తరమైన గీతామృతమే పితికిన పాలు,సుధీజనులే (పండితులే)ఆ పాలను త్రాగువారు.
"సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్"
ఉపనిషత్తులే గోవులు,గోపాలకృష్ణుడే పాలుపిదికేవాడు,అర్జునుడు దూడ ,మహత్తరమైన గీతామృతమే పితికిన పాలు,సుధీజనులే (పండితులే)ఆ పాలను త్రాగువారు.
80 నరసింహశతకము:-శేషప్పకవి.
ఇది వేదాంతపరమైన పద్యము.ఈ జీవితం ఓ మాయా
నాటకం.అశాశ్వితమైన దేహానికి ఇహలోక సౌఖ్యాలెన్ని వున్నా అవి తాత్కాలికమే.శరీర
దారుఢ్యం జీవనపర్యంతం ఒకే తీరుగా వుండదు కదా!అంతేకాదు ఈ శరీరము బాల్య యవ్వన
వృద్ధాప్యములనే మూడింటితో నిండిన మురికి కొంప.ఇది శాశ్వితమనే భ్రమతో కాపాడుదామను
కొందామన్నా "కాలమనే మృత్యువు"కాటేయక మానదు.అందుకే ఓస్వామీ!ఇక మరో జన్మ
వద్దయ్యా నన్నేలుకో అంటున్న కవితో పాటు మనమూ ప్రార్థన చేద్దామా!.
సీ: ఇహలోక సౌఖ్యము లిచ్చగించెద మన్న
దేహమెప్పటికి తా స్థిరతనొంద
దాయుష్య మున్న పర్యంతంబు పటుతయు
నొక్కతీరున నుండ దుర్వి లోన
బాల్య యవ్వనము దుర్బల వార్ధక్యములను
మూటిలో మునిగెడి మురికి కొంప
భ్రాంతితో దీని గాపాడుద మనుకొన్న
గాలమృత్యువు చేత గోలుపోవు
నమ్మరాదయ్య యిది మాయ నాటకంబు
జన్మమిక నొల్ల నన్నేలు జలజ నాథ
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.
దేహమెప్పటికి తా స్థిరతనొంద
దాయుష్య మున్న పర్యంతంబు పటుతయు
నొక్కతీరున నుండ దుర్వి లోన
బాల్య యవ్వనము దుర్బల వార్ధక్యములను
మూటిలో మునిగెడి మురికి కొంప
భ్రాంతితో దీని గాపాడుద మనుకొన్న
గాలమృత్యువు చేత గోలుపోవు
నమ్మరాదయ్య యిది మాయ నాటకంబు
జన్మమిక నొల్ల నన్నేలు జలజ నాథ
భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.
79.నరసింహశతకము:-శేషప్పకవి.
ఓనరసింహస్వామీ! మంచి చేయక పోయినా ఫరవాలేదు చెడు మాత్రం చేయకూడదంటూ శతక కర్త చేసే హితబోధ మనమూ విందామా!సాధారణంగా మంచి గ్రంథాలు చదివితే సమస్తము అవగతమైనట్లే అంటారు.కానిహరిదాసులను నిందించ కుండా వుంటే చాలు ఆ గ్రంథాలన్నీ చదివినట్లేనట.అదే విధంగా చెయ్యెత్తి దానం చేయక పోయినాఇచ్చే వాళ్ళను తప్పించకుండా వుంటే చాలు దానం చేసినట్లే నట ఇంకా సజ్జనులను మోసగించకుండా వుంటే చాలు పెద్ద బహుమానమిచ్చినట్లట.దేవాగ్రహారాలు "స్వాహా"చేయకుండా వుంటే చాలు బంగారు స్తంభాలున్న ఆలయాలు కట్టించినట్లట.అంతేకాదు ఇతరుల "వర్షాశనం"అంటే వారి ఒక సంవత్సరం ఆహారం ముంచకుండా వుంటే అన్నసత్రాలు కట్టించి నట్లేనట.ఇలా అన్యాపదేశంగా అట్టి పనులు చేయ రాదని హెచ్చరిస్తున్నారు.
ఓనరసింహస్వామీ! మంచి చేయక పోయినా ఫరవాలేదు చెడు మాత్రం చేయకూడదంటూ శతక కర్త చేసే హితబోధ మనమూ విందామా!సాధారణంగా మంచి గ్రంథాలు చదివితే సమస్తము అవగతమైనట్లే అంటారు.కానిహరిదాసులను నిందించ కుండా వుంటే చాలు ఆ గ్రంథాలన్నీ చదివినట్లేనట.అదే విధంగా చెయ్యెత్తి దానం చేయక పోయినాఇచ్చే వాళ్ళను తప్పించకుండా వుంటే చాలు దానం చేసినట్లే నట ఇంకా సజ్జనులను మోసగించకుండా వుంటే చాలు పెద్ద బహుమానమిచ్చినట్లట.దేవాగ్రహారాలు "స్వాహా"చేయకుండా వుంటే చాలు బంగారు స్తంభాలున్న ఆలయాలు కట్టించినట్లట.అంతేకాదు ఇతరుల "వర్షాశనం"అంటే వారి ఒక సంవత్సరం ఆహారం ముంచకుండా వుంటే అన్నసత్రాలు కట్టించి నట్లేనట.ఇలా అన్యాపదేశంగా అట్టి పనులు చేయ రాదని హెచ్చరిస్తున్నారు.
సీ:హరిదాసులను నిందనాడకుండిన జాలు
సకల గ్రంథములెల్ల జదివినట్లు
బిక్షమియ్యంగ దప్పించ కుండిన జాలు
జేముట్టి దానంబు చేసినట్లు
మంచి సజ్జనుల వంచింప కుండిన జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు
గనక కంబపు గుళ్ళు గట్టినట్లు
ఒకరి వర్షాశనము ముంచకున్న జాలు
పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
సకల గ్రంథములెల్ల జదివినట్లు
బిక్షమియ్యంగ దప్పించ కుండిన జాలు
జేముట్టి దానంబు చేసినట్లు
మంచి సజ్జనుల వంచింప కుండిన జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు
గనక కంబపు గుళ్ళు గట్టినట్లు
ఒకరి వర్షాశనము ముంచకున్న జాలు
పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
79.నరసింహశతకము:-శేషప్పకవి.
ఓనరసింహస్వామీ! మంచి చేయక పోయినా ఫరవాలేదు చెడు మాత్రం చేయకూడదంటూ శతక కర్త చేసే హితబోధ మనమూ విందామా!సాధారణంగా మంచి గ్రంథాలు చదివితే సమస్తము అవగతమైనట్లే అంటారు.కానిహరిదాసులను నిందించ కుండా వుంటే చాలు ఆ గ్రంథాలన్నీ చదివినట్లేనట.అదే విధంగా చెయ్యెత్తి దానం చేయక పోయినాఇచ్చే వాళ్ళను తప్పించకుండా వుంటే చాలు దానం చేసినట్లే నట ఇంకా సజ్జనులను మోసగించకుండా వుంటే చాలు పెద్ద బహుమానమిచ్చినట్లట.దేవాగ్రహారాలు "స్వాహా"చేయకుండా వుంటే చాలు బంగారు స్తంభాలున్న ఆలయాలు కట్టించినట్లట.అంతేకాదు ఇతరుల "వర్షాశనం"అంటే వారి ఒక సంవత్సరం ఆహారం ముంచకుండా వుంటే అన్నసత్రాలు కట్టించి నట్లేనట.ఇలా అన్యాపదేశంగా అట్టి పనులు చేయ రాదని హెచ్చరిస్తున్నారు.
ఓనరసింహస్వామీ! మంచి చేయక పోయినా ఫరవాలేదు చెడు మాత్రం చేయకూడదంటూ శతక కర్త చేసే హితబోధ మనమూ విందామా!సాధారణంగా మంచి గ్రంథాలు చదివితే సమస్తము అవగతమైనట్లే అంటారు.కానిహరిదాసులను నిందించ కుండా వుంటే చాలు ఆ గ్రంథాలన్నీ చదివినట్లేనట.అదే విధంగా చెయ్యెత్తి దానం చేయక పోయినాఇచ్చే వాళ్ళను తప్పించకుండా వుంటే చాలు దానం చేసినట్లే నట ఇంకా సజ్జనులను మోసగించకుండా వుంటే చాలు పెద్ద బహుమానమిచ్చినట్లట.దేవాగ్రహారాలు "స్వాహా"చేయకుండా వుంటే చాలు బంగారు స్తంభాలున్న ఆలయాలు కట్టించినట్లట.అంతేకాదు ఇతరుల "వర్షాశనం"అంటే వారి ఒక సంవత్సరం ఆహారం ముంచకుండా వుంటే అన్నసత్రాలు కట్టించి నట్లేనట.ఇలా అన్యాపదేశంగా అట్టి పనులు చేయ రాదని హెచ్చరిస్తున్నారు.
సీ:హరిదాసులను నిందనాడకుండిన జాలు
సకల గ్రంథములెల్ల జదివినట్లు
బిక్షమియ్యంగ దప్పించ కుండిన జాలు
జేముట్టి దానంబు చేసినట్లు
మంచి సజ్జనుల వంచింప కుండిన జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు
గనక కంబపు గుళ్ళు గట్టినట్లు
ఒకరి వర్షాశనము ముంచకున్న జాలు
పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
సకల గ్రంథములెల్ల జదివినట్లు
బిక్షమియ్యంగ దప్పించ కుండిన జాలు
జేముట్టి దానంబు చేసినట్లు
మంచి సజ్జనుల వంచింప కుండిన జాలు
నింపుగా బహుమానమిచ్చినట్లు
దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు
గనక కంబపు గుళ్ళు గట్టినట్లు
ఒకరి వర్షాశనము ముంచకున్న జాలు
పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు
భూషణ వికాస శ్రీధర్మపురి నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
ఆశే నా శ్వాస:
ఏ జన్మలో చేశానో తపము
ఈ జన్మలో పొందాను వరము
ఎక్కడో అనాథగా పుట్టాను నేను
ఇక్కడే చిన్ని చేతుల్లో ఇమిడి పోయాను
తన పేరుకు ముందో వెనుకో చేరిపోయాను
తన చేతిని విడువక ఆభరణమై పోయాను
తనువంతా గాయాలైనా
బాధ లేదు ఇసుమంతైనా
తన మోవి తగిలితే చాలు
పలుకుతా యెన్నెన్నో రాగాలు
నాకు లేదు భాషా భేదం
మీకొసగేను అమితానందం
నాలో నుండి వచ్చే స్వరం
చేరుస్తుందిదే బృందావనం
పూలతో పాటు దారానికి అబ్బుతుంది తావి
నాజన్మ చరితార్థమైంది చేరి తన మోవి
ఇంతకన్నా లేదు మరో ఆశ
ఇదే ఇదే కావాలి నాకు శ్వాస.
ఏ జన్మలో చేశానో తపము
ఈ జన్మలో పొందాను వరము
ఎక్కడో అనాథగా పుట్టాను నేను
ఇక్కడే చిన్ని చేతుల్లో ఇమిడి పోయాను
తన పేరుకు ముందో వెనుకో చేరిపోయాను
తన చేతిని విడువక ఆభరణమై పోయాను
తనువంతా గాయాలైనా
బాధ లేదు ఇసుమంతైనా
తన మోవి తగిలితే చాలు
పలుకుతా యెన్నెన్నో రాగాలు
నాకు లేదు భాషా భేదం
మీకొసగేను అమితానందం
నాలో నుండి వచ్చే స్వరం
చేరుస్తుందిదే బృందావనం
పూలతో పాటు దారానికి అబ్బుతుంది తావి
నాజన్మ చరితార్థమైంది చేరి తన మోవి
ఇంతకన్నా లేదు మరో ఆశ
ఇదే ఇదే కావాలి నాకు శ్వాస.
డా:ఉమాదేవి బల్లూరి.
22-11-14
22-11-14
అనురాగానికి నెలవు
ఆత్మీయతకు కొలువు
తన మదిలాగే విశాల
మైన గదులున్న ఇల్లు
సువాసనలు వెదజల్లే
చక్కని యా సిరిమల్లె
తీగతో పాటు మది నలరించే
గులాబి చామంతి మందారపు చెట్లు
తనను కలవాలన్న నిరీక్షణ
సఫలమైన శుభసమయం
పంచుకొన్నాం మధుర భావాలను
పెంచుకొన్నాం స్నేహ వల్లరులను
ముఖపుస్తక మిత్రురాలిని
ముఖాముఖిగా కలుసుకొని
పసందైనవిందారగించి ప్రేమతో
అందించిన కోక నందుకొన్న
మధురమైన శుభతరుణం
మరువలేని మధురక్షణం.
ఇంతకూ ఆ"తనె"వరో అర్థమైందనుకోంటూ.
ఆత్మీయతకు కొలువు
తన మదిలాగే విశాల
మైన గదులున్న ఇల్లు
సువాసనలు వెదజల్లే
చక్కని యా సిరిమల్లె
తీగతో పాటు మది నలరించే
గులాబి చామంతి మందారపు చెట్లు
తనను కలవాలన్న నిరీక్షణ
సఫలమైన శుభసమయం
పంచుకొన్నాం మధుర భావాలను
పెంచుకొన్నాం స్నేహ వల్లరులను
ముఖపుస్తక మిత్రురాలిని
ముఖాముఖిగా కలుసుకొని
పసందైనవిందారగించి ప్రేమతో
అందించిన కోక నందుకొన్న
మధురమైన శుభతరుణం
మరువలేని మధురక్షణం.
ఇంతకూ ఆ"తనె"వరో అర్థమైందనుకోంటూ.
నా స్వగతం(రిమోట్)
ఉపకారం చేస్తున్నా నేను మీకు ,
కానీ
అపకారం చేస్తున్నారు మీరు నాకు
మీకు శ్రమను తగ్గించాలని నేనూహిస్తే
నాకదనపు శ్రమను మీరిస్తున్నారు
అకటా!
ఈ మానవులెంత దయా విహీనులో కదా
కూర్చొన్నచోటునుండి కదలకుండా
కావలసిన దాన్నే చూచే వీలు నే కల్పిస్తే
నొక్కి నొక్కి చితక్కొట్టేస్తూ
చీటికి మాటికి ముందు వెనుక
అరచేతులతో చరచి చరచి
హింసిస్తున్నారే ?ఇది భావ్యమా ?మిత్రులూ!
అంతటితో నాగక పసిపిల్లలకు నన్ను
ఆటవస్తువును చేశారేంటబ్బా!
బోసినవ్వుల పసిపాపలు
ప్రేమతో ఆడుకొన్నా కోపంతో కసిరి విసిరినా
నాకు నొక్కులే నొప్పులే తిప్పలే చిక్కులే
నన్నలుము కొన్న అక్కరాలను
ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నారే
ఏదో ఓసారో మరోసారే కాదు
ఒకరో ఇద్దరో కానేకాదు అందరూ
బొటనవేలికో చూపుడు వేలికో
పని కల్పించి మరీ కష్టపెడుతున్నారే
ఎవరికి తెలుపను నా వెతను
ఎలా తీరును నా తపన.
ఉపకారం చేస్తున్నా నేను మీకు ,
కానీ
అపకారం చేస్తున్నారు మీరు నాకు
మీకు శ్రమను తగ్గించాలని నేనూహిస్తే
నాకదనపు శ్రమను మీరిస్తున్నారు
అకటా!
ఈ మానవులెంత దయా విహీనులో కదా
కూర్చొన్నచోటునుండి కదలకుండా
కావలసిన దాన్నే చూచే వీలు నే కల్పిస్తే
నొక్కి నొక్కి చితక్కొట్టేస్తూ
చీటికి మాటికి ముందు వెనుక
అరచేతులతో చరచి చరచి
హింసిస్తున్నారే ?ఇది భావ్యమా ?మిత్రులూ!
అంతటితో నాగక పసిపిల్లలకు నన్ను
ఆటవస్తువును చేశారేంటబ్బా!
బోసినవ్వుల పసిపాపలు
ప్రేమతో ఆడుకొన్నా కోపంతో కసిరి విసిరినా
నాకు నొక్కులే నొప్పులే తిప్పలే చిక్కులే
నన్నలుము కొన్న అక్కరాలను
ఆనవాలు కూడా లేకుండా చేస్తున్నారే
ఏదో ఓసారో మరోసారే కాదు
ఒకరో ఇద్దరో కానేకాదు అందరూ
బొటనవేలికో చూపుడు వేలికో
పని కల్పించి మరీ కష్టపెడుతున్నారే
ఎవరికి తెలుపను నా వెతను
ఎలా తీరును నా తపన.
దేవతలను పారద్రోలి బలిచక్రవర్తి బలిష్టుడై యుండ శ్రీహరి
దేవతల కోరిక మేరకు వటురూపమున వచ్చి మూడడుగుల నేలను కోరి త్రివిక్రమ రూపుడైబలిని
అణచి వేస్తాడు.ఆతరువాత భర్తను మన్నించమని వేడిన "బలి"భార్యకు వరమొసగి
వారి ద్వారం చెంత నుంటానని మాట ఇస్తాడు నాటినుండి ఇది"బలిపాడ్యమి"గా
ప్రసిద్ధి చెంది దీపావళి పండుగలో భాగమయింది.
బలి పాడ్యమి సందర్భంగా ఇంకో మూడు పద్యాలు.
కం:బలి యాగడముల నోపగ
జాలము తండ్రీ,మురారి,జలజాక్షా,నీ
జాలము తోడను వానిని
బలహీనుని జేయుమంచు ప్రార్థించి రటన్. 1
ఆ.వె:సురల పల్కులెల్ల సుందరంబుగవిని
వత్తు నేను మీకు వలదు భయము
యనుచు దేవతలకు నభయంబు నొసగుచు
వటువు గానె విష్ణు వటకు వచ్చె 2
ఆ.వె:పొట్టి రూపు తోడ పుడమిని వేడంగ
శ్రీహరి యని యెరిగి సర్వ మొసగె
బలిని యణచి యతని భార్యకు వరమిచ్చి
కాపు గాచి తీవు కృపణ శీలి. 3
బలి పాడ్యమి సందర్భంగా ఇంకో మూడు పద్యాలు.
కం:బలి యాగడముల నోపగ
జాలము తండ్రీ,మురారి,జలజాక్షా,నీ
జాలము తోడను వానిని
బలహీనుని జేయుమంచు ప్రార్థించి రటన్. 1
ఆ.వె:సురల పల్కులెల్ల సుందరంబుగవిని
వత్తు నేను మీకు వలదు భయము
యనుచు దేవతలకు నభయంబు నొసగుచు
వటువు గానె విష్ణు వటకు వచ్చె 2
ఆ.వె:పొట్టి రూపు తోడ పుడమిని వేడంగ
శ్రీహరి యని యెరిగి సర్వ మొసగె
బలిని యణచి యతని భార్యకు వరమిచ్చి
కాపు గాచి తీవు కృపణ శీలి. 3
రేపు యమద్వితీయ"అంటే యముడు తనసోదరియైన యమున చేతి
వంట భుజించి కానుకలొసగి ఆశిస్సులందించిన రోజు."భగినీ
హస్తభోజన"గాప్రసిద్ధి చెందింది.
ఆ.వె:యమున చేతి వంట యద్భుతము యటంచు
భగిని చేసి నట్టి భక్ష్యములను
ఆదరంబున దినె నాయముండు నిదియె
పండుగయ్యె గాదె పృథ్వి యందు.
ఆ.వె:యమున చేతి వంట యద్భుతము యటంచు
భగిని చేసి నట్టి భక్ష్యములను
ఆదరంబున దినె నాయముండు నిదియె
పండుగయ్యె గాదె పృథ్వి యందు.
ఆశ్వీజబహుళ
అమావాస్యనాడు లక్ష్మీపూజ చేయడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.తన్మూలంగా
సకలైశ్వర్యాల సిద్ధిస్తాయనే నమ్మకమే నేటికీ దీపావళీ పండుగలో భాగమైన "అమావాస్య"నాడు
విద్యుదలంకరణాలతో ముఖ్యంగా అమ్మవారిని ధనముతోనూ,వివిధఆభరణాలతో
విశేషంగా అలంకరించి పూజించడం దేశమంతటా జరుగుతున్నది.
ఈసందర్భంగా మరో మూడు పద్యాలు.
ఆ.వె: అమవశి నిశి లోన అర్ధరాతిరి యందు
అవని జనుల కెల్ల హర్ష మొదవె
కాంతి పుంజమటుల కాంతులు వ్యాపించె
పట్టపగలు వోలె ప్రభలు నిండె. 1
ఆ.వె:లక్ష్మి పూజ సేయ లలనా మణులు చేరి
భక్తి పూర్వకముగ భజన చేసి
కొలువ నపుడె యమ్మ కోరికల్ దీర్చుచు
దీక్ష జూసి మురిసి దీవ నోసగె. 2
ఆ.వె:వణిజులకును నిదియె వైశ్యులకెల్లను
పెద్ద పండు గనుచు పేర్మి చేత
జమ ఖర్చు లెంచి జయలక్ష్మిని గొలువ
జయము నొసగు నంబ జంకు వలదు. 3
ఈసందర్భంగా మరో మూడు పద్యాలు.
ఆ.వె: అమవశి నిశి లోన అర్ధరాతిరి యందు
అవని జనుల కెల్ల హర్ష మొదవె
కాంతి పుంజమటుల కాంతులు వ్యాపించె
పట్టపగలు వోలె ప్రభలు నిండె. 1
ఆ.వె:లక్ష్మి పూజ సేయ లలనా మణులు చేరి
భక్తి పూర్వకముగ భజన చేసి
కొలువ నపుడె యమ్మ కోరికల్ దీర్చుచు
దీక్ష జూసి మురిసి దీవ నోసగె. 2
ఆ.వె:వణిజులకును నిదియె వైశ్యులకెల్లను
పెద్ద పండు గనుచు పేర్మి చేత
జమ ఖర్చు లెంచి జయలక్ష్మిని గొలువ
జయము నొసగు నంబ జంకు వలదు. 3
లోక కంటకుడైన నరకాసురుని లోకపూజ్యుడైన
శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై వెళ్ళి విజయలక్ష్మితో తిరిగొచ్చాడుఇదియే
"నరకచతుర్దశి" "దీపావళి" పండుగలుగా టపాకాయలు కాల్చి సంబరంగా
చేసుకొంటున్నాము.
ఈసందర్భంగా ముచ్చటగా మూడు పద్యాలు.
ఆ.వె: వరముపేర్మి చేత వసుమతీ తనయుండు
మగువలను మునులను మట్టుబెట్ట
నెంచి వారి నెల్ల నిర్బంధమొనరింప
వాని పీచ మణచె వృష్ణి కులుడు.
ఆ.వె:అరి నొకపరి జూచు హరినొక పరిజూచు
వాడి చూపు లనొక వంక వలపు
జూపుల ప్రియ సఖుని జూచుచు మ్రోగించె
సమర భేరి నపుడె సత్యభామ.
అ.వే:శౌరి తోడ నతివ సయ్యాట లాడుచు
సంహరించె నరకుఁసత్యభామ
నాటి నుండి నిదియే నరకచతుర్దశి
పండుగయ్యె గాదె పృథ్వి యందు.
ఈసందర్భంగా ముచ్చటగా మూడు పద్యాలు.
ఆ.వె: వరముపేర్మి చేత వసుమతీ తనయుండు
మగువలను మునులను మట్టుబెట్ట
నెంచి వారి నెల్ల నిర్బంధమొనరింప
వాని పీచ మణచె వృష్ణి కులుడు.
ఆ.వె:అరి నొకపరి జూచు హరినొక పరిజూచు
వాడి చూపు లనొక వంక వలపు
జూపుల ప్రియ సఖుని జూచుచు మ్రోగించె
సమర భేరి నపుడె సత్యభామ.
అ.వే:శౌరి తోడ నతివ సయ్యాట లాడుచు
సంహరించె నరకుఁసత్యభామ
నాటి నుండి నిదియే నరకచతుర్దశి
పండుగయ్యె గాదె పృథ్వి యందు.
సమస్యా పూరణం:
"కొమ్మల నమ్మిన జనులకు కూడే కరువౌ"
"కొమ్మల నమ్మిన జనులకు కూడే కరువౌ"
కమ్మని మాటల తోడను
నమ్మక మేర్పడ బలుకుచు నవలా మణులన్
యిమ్ముగ నాకర్షించెడి
కొమ్మల నమ్మిన జనులకు కూడే కరువౌ.
నమ్మక మేర్పడ బలుకుచు నవలా మణులన్
యిమ్ముగ నాకర్షించెడి
కొమ్మల నమ్మిన జనులకు కూడే కరువౌ.
సమస్య ::6
భరత భూమి రక్ష బడులు గుడులు.
భరత భూమి రక్ష బడులు గుడులు.
తెల్లదొరలు వచ్చి తెగబడి పోరుచు
భరత జాతి దోచి భంగ పరుప
సంప్రదాయములును సంస్కృతు లేకాచె
భరతభూమి రక్ష బడులు గుడులు.
భరత జాతి దోచి భంగ పరుప
సంప్రదాయములును సంస్కృతు లేకాచె
భరతభూమి రక్ష బడులు గుడులు.
అమ్మయ్య పండగైపోయింది.మరో పండుగ(దీపావళి)వరకు కాస్త
"టెన్షన్"ఫ్రీ.
ఊళ్ళకెళ్ళిన వారంతా స్వస్థానాలకు చేరారనుకొంటూ
ఓ చిన్నపద్యంతో మితృలందరికి శుభరాత్రి.
ఊళ్ళకెళ్ళిన వారంతా స్వస్థానాలకు చేరారనుకొంటూ
ఓ చిన్నపద్యంతో మితృలందరికి శుభరాత్రి.
సంబర మందుచు మనుజులు
అంబరమంటిన విధమున నత్యంతానం
దంబున మురియుచు సత్స్నే
హంబున బంధమధికమని హర్షించి రిలన్.
అంబరమంటిన విధమున నత్యంతానం
దంబున మురియుచు సత్స్నే
హంబున బంధమధికమని హర్షించి రిలన్.
29:సమస్య.
ముదిమి మీది కొచ్చి మూల బడితి.
ఆ.వె:శక్తి యుక్తి తోడ సంసార మీదుచు
బతుకు బండి లాగు బడుగు నేను
సత్తువేమి లేక సంపాదనయు లేక
ముదిమి మీది కొచ్చి మూల బడితి.
ముదిమి మీది కొచ్చి మూల బడితి.
ఆ.వె:శక్తి యుక్తి తోడ సంసార మీదుచు
బతుకు బండి లాగు బడుగు నేను
సత్తువేమి లేక సంపాదనయు లేక
ముదిమి మీది కొచ్చి మూల బడితి.
''మితృలందరికి
శుభసాయంత్రం.
శమీ శమేతి పాపం
శమీ శతృ వినాశనం'
శమీ శమేతి పాపం
శమీ శతృ వినాశనం'
ఆ వె:పాడ్యమి తిథి నుండి పరమేశు రాణిని
ప్రస్తుతించి కొల్చి భక్తి తోడ
విజయదశమి నాడు విజయంబు గోరుచు
జమ్మి చెట్టు కొలువ జయము లొదవు.
ప్రస్తుతించి కొల్చి భక్తి తోడ
విజయదశమి నాడు విజయంబు గోరుచు
జమ్మి చెట్టు కొలువ జయము లొదవు.
ఆదిశక్తి కరుణ కోరుతూ ఆటవెలదిలో ఓ పద్యం.
సకల జనుల గాచు శక్తిమాతవు నీవె
భక్తి తోడ గొలుతు భాగ్య మొసగు
నిన్ను నమ్మి యున్న నీడేరు కోర్కెలు
విజయ మొసగు మమ్మ విజయ దుర్గ.
భక్తి తోడ గొలుతు భాగ్య మొసగు
నిన్ను నమ్మి యున్న నీడేరు కోర్కెలు
విజయ మొసగు మమ్మ విజయ దుర్గ.
తెలుగు కవిత్వము
సమస్యాపూరణము :-11
*******************************
*******// Umadevi Balluri//*********
నవనవలాడెడి సుమముల
దవనము తోడన్ గలిపి కదంబపు మాలన్
జపమును గూర్చెదనిక, కే
*శవ పూజల వలన జన్మ సార్థక మౌగా!
*************************************
*******************************
*******// Umadevi Balluri//*********
నవనవలాడెడి సుమముల
దవనము తోడన్ గలిపి కదంబపు మాలన్
జపమును గూర్చెదనిక, కే
*శవ పూజల వలన జన్మ సార్థక మౌగా!
*************************************
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి
జన్మదినాన్ని స్మరిస్తూ
అసమాన ప్రతిభాశాలి
బహుముఖ ప్రఙ్ఙాశాలి
శతాధిక గ్రంథకర్త
అత్యున్నత పురస్కార గ్రహీత
తెలుగు వెలుగులను దశదిశల
వ్యాపింప జేసిన వేదమూర్తి
సంస్కృతీ సాహిత్యాలు
అవిభాజ్యాలని రచనలద్వార
జగతికి తెలిపిన సాహిత్యకారుడు
వేయిపడగలను వేయి పుటలలో
బంధించిన గ్రంథకర్త
రచనహాస్యమైనా వ్యంగ్యమైనా
సూటిగా నిర్మొహమోటంగా
వ్యక్తీకరించడం ఈమహామనీషినైజం
రామాయణ కల్పవృక్షాన్ని
తెలుగు వారి కందించిన
ఈ మహాకావ్య సాగరునకు
వినమ్రతతో
అక్షర కుసుమాంజలి
అసమాన ప్రతిభాశాలి
బహుముఖ ప్రఙ్ఙాశాలి
శతాధిక గ్రంథకర్త
అత్యున్నత పురస్కార గ్రహీత
తెలుగు వెలుగులను దశదిశల
వ్యాపింప జేసిన వేదమూర్తి
సంస్కృతీ సాహిత్యాలు
అవిభాజ్యాలని రచనలద్వార
జగతికి తెలిపిన సాహిత్యకారుడు
వేయిపడగలను వేయి పుటలలో
బంధించిన గ్రంథకర్త
రచనహాస్యమైనా వ్యంగ్యమైనా
సూటిగా నిర్మొహమోటంగా
వ్యక్తీకరించడం ఈమహామనీషినైజం
రామాయణ కల్పవృక్షాన్ని
తెలుగు వారి కందించిన
ఈ మహాకావ్య సాగరునకు
వినమ్రతతో
అక్షర కుసుమాంజలి
""తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింప దరము గాదు"
అంటూ ఏనుగు లక్ష్మణకవి భర్తృహరి శ్లోకానికి అనువాదం చేశారు.అదే విధంగా ఎన్నో కష్టమైన పనులు చేయవచ్చు కాని దుష్టులకు ఙ్ఞానబోధ చేయడం
సాధ్యంకాదని నరసింహశతకకర్త తెలియచేస్తున్నారు.
సీ:భుజబలంబున పెద్దపులుల జంపగవచ్చు పాము కంఠము చేత బట్టవచ్చు
బ్రహ్మరాక్షసకోట్ల బార ద్రోలగ వచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు
జిహ్వకిష్టము గాని చేదు మ్రింగగ వచ్చు పదును ఖడ్గము చేత నదుమ వచ్చు
కష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు దిట్టుపోతుల నోళ్ళు రట్టవచ్చు
పుడమిలో దుష్టులకు ఙ్ఞానబోధ తెలిపి
సజ్జనుల జేయ లేడెంతచతురు డయిన
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర
దవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధించ వచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింప దరము గాదు"
అంటూ ఏనుగు లక్ష్మణకవి భర్తృహరి శ్లోకానికి అనువాదం చేశారు.అదే విధంగా ఎన్నో కష్టమైన పనులు చేయవచ్చు కాని దుష్టులకు ఙ్ఞానబోధ చేయడం
సాధ్యంకాదని నరసింహశతకకర్త తెలియచేస్తున్నారు.
సీ:భుజబలంబున పెద్దపులుల జంపగవచ్చు పాము కంఠము చేత బట్టవచ్చు
బ్రహ్మరాక్షసకోట్ల బార ద్రోలగ వచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు
జిహ్వకిష్టము గాని చేదు మ్రింగగ వచ్చు పదును ఖడ్గము చేత నదుమ వచ్చు
కష్టమొందుచు ముండ్లకంపలో జొరవచ్చు దిట్టుపోతుల నోళ్ళు రట్టవచ్చు
పుడమిలో దుష్టులకు ఙ్ఞానబోధ తెలిపి
సజ్జనుల జేయ లేడెంతచతురు డయిన
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర
నేను పుట్టినప్పటి నుండి పుణ్యకార్యాలు
గాని,తీర్థయాత్రలుగానీ,వ్రతాలుగానీ దానాలు గానీ,చేయలేదు.నీచాటు జొచ్చాను,తెలిసో తెలియకో చేసిన పాపాలు ద్రుంచి
పోషించమంటూ శేషప్పకవి
ప్రార్థిస్తున్నారు.
1 ధరణి లోపలనేను తల్లి గర్భమునందు బుట్టి నప్పటి నుండి పుణ్యమెరుగ
నేకాదశి వ్రతమెన్నడుండగ లేదు తీర్థయాత్రలకైన తిరుగలేదు
పారమార్థికమైన పనులు సేయగలేదు బిక్షమొక్కనికైన పెట్టలేదు
ఙ్నానవంతులకైన బూని మ్రొక్కగలేదు ఇతర దానములనయిన నియ్యలేదు
నళినదళ నేత్ర నిన్ను నే నమ్మినాను
చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.
2 ఇలలోన నే జన్మ మెత్తినప్పటి నుండి బహు గడించితినయ్య పాతకములు
తెలిసి జేసితి కొన్ని తెలియ జాలకచేసి బాధ నొందితినయ్య పద్మనాభ
అనుభవించేటప్పుడతి ప్రయాసంబంచు ప్రజలు చెప్పగ చాల భయము కలిగె
నెగిరి పొయ్యేటందు కేయుపాయంబైన చేయచూదామంటె చేతకాదు
సూర్యశశి నేత్ర నీ చాటు జొచ్చినాను
కలుషములు ద్రుంచి నన్నేలు కష్టమనక.
భూషణవికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
ప్రార్థిస్తున్నారు.
1 ధరణి లోపలనేను తల్లి గర్భమునందు బుట్టి నప్పటి నుండి పుణ్యమెరుగ
నేకాదశి వ్రతమెన్నడుండగ లేదు తీర్థయాత్రలకైన తిరుగలేదు
పారమార్థికమైన పనులు సేయగలేదు బిక్షమొక్కనికైన పెట్టలేదు
ఙ్నానవంతులకైన బూని మ్రొక్కగలేదు ఇతర దానములనయిన నియ్యలేదు
నళినదళ నేత్ర నిన్ను నే నమ్మినాను
చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర.
2 ఇలలోన నే జన్మ మెత్తినప్పటి నుండి బహు గడించితినయ్య పాతకములు
తెలిసి జేసితి కొన్ని తెలియ జాలకచేసి బాధ నొందితినయ్య పద్మనాభ
అనుభవించేటప్పుడతి ప్రయాసంబంచు ప్రజలు చెప్పగ చాల భయము కలిగె
నెగిరి పొయ్యేటందు కేయుపాయంబైన చేయచూదామంటె చేతకాదు
సూర్యశశి నేత్ర నీ చాటు జొచ్చినాను
కలుషములు ద్రుంచి నన్నేలు కష్టమనక.
భూషణవికాస శ్రీధర్మపుర నివాస
దుష్టసంహార నరసింహ దురితదూర.
\
మిత్రులందరికి
వినాాయకచవతి మరియు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
బుజ్జిగణపతి.
స్నానాల గదిలోన అమ్మ తలపులతోడ
నలుగుతోనే రూపు దాల్చినట్టి
శైలసుత తనయా నీకు వందనం
అమ్మ ఆనతి పైన ఎవ్వరిని రానీక
ఉండ్రాళ్ళు మెక్కుతూ నుండంగ
మూషిక రూపాన వచ్చిన యసురుని
మట్టు బెట్టిన గౌరి తనయా నీకు వందనం
అంతటితొ నాగక నా యసురునే నీవు
వాహనంబుగ చేకొేంటి వయ్య
విజయంబు చేకొని ఇంటికేతెంచిన
పరమశివుని గాంచి జనకుడని యెరుగక
లోని కంపక యడ్డు పడిన సురశ్రేష్టుడీవె
శివుడాగ్రహంబున రుద్రుడై నీ శిరము ఖండింప
నేలకూలితివయ్య గిరి పౌత్ర నీవు
అమ్మ వేడంగ నయ్యకరుణింప
కరిరాజ ముఖుడవై వెలుగొందు చున్నావు
గుజ్జు రూపముతోడ నడయాడుచుండంగ
నిను జూచి ఫక్కున నవ్వె యానెలరేడు
అందుకే నేటికీ క్షీణించు చున్నాడు
విఘ్ననివారకుడవు అభయప్రదాతవు
ఆపద్బాంధుడవీవె ఆది దేవ
మ్రొక్కులిడుదుము నీకు కరుణించి కాపాడు
ప్రజల వెతలనెల్ల పరిహరించుమొ దేవ
జయజయ గణనాథ జయము జయము.
బుజ్జిగణపతి.
స్నానాల గదిలోన అమ్మ తలపులతోడ
నలుగుతోనే రూపు దాల్చినట్టి
శైలసుత తనయా నీకు వందనం
అమ్మ ఆనతి పైన ఎవ్వరిని రానీక
ఉండ్రాళ్ళు మెక్కుతూ నుండంగ
మూషిక రూపాన వచ్చిన యసురుని
మట్టు బెట్టిన గౌరి తనయా నీకు వందనం
అంతటితొ నాగక నా యసురునే నీవు
వాహనంబుగ చేకొేంటి వయ్య
విజయంబు చేకొని ఇంటికేతెంచిన
పరమశివుని గాంచి జనకుడని యెరుగక
లోని కంపక యడ్డు పడిన సురశ్రేష్టుడీవె
శివుడాగ్రహంబున రుద్రుడై నీ శిరము ఖండింప
నేలకూలితివయ్య గిరి పౌత్ర నీవు
అమ్మ వేడంగ నయ్యకరుణింప
కరిరాజ ముఖుడవై వెలుగొందు చున్నావు
గుజ్జు రూపముతోడ నడయాడుచుండంగ
నిను జూచి ఫక్కున నవ్వె యానెలరేడు
అందుకే నేటికీ క్షీణించు చున్నాడు
విఘ్ననివారకుడవు అభయప్రదాతవు
ఆపద్బాంధుడవీవె ఆది దేవ
మ్రొక్కులిడుదుము నీకు కరుణించి కాపాడు
ప్రజల వెతలనెల్ల పరిహరించుమొ దేవ
జయజయ గణనాథ జయము జయము.
Umadevi Balluri
మిత్రులందరికి శ్రీకృష్ణాష్టమి
శుభాకాంక్షలు.
నిరీక్షణ
ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు...
ఇదిగో ఇప్పుడే వస్తానంటూ వెళ్ళావు
ఇప్పటిదాకా రాకుండా దాక్కున్నావు
నీ రాక కోసం అప్పటి నుండీ..
కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే వున్నా
ఆశను చంపుకోలేక
కదిలే మబ్బుల నడిగా
ఎగిరే పక్షుల నడిగా
నీ జాడేమైనా చెబుతాయేమో నన్న ఆకాంక్షతో
అలల సవ్వడి విన్నా
గాలి గలగలలు విన్నా
చెవులు రిక్కించుకొని
కళ్ళు విప్పార్చుకొని
మరీ మరీ చూశా
ప్చ్.......ఎప్పటిలా
మళ్ళీ నిరాశే
నాలాటి కాంత లు"అట"కోకొల్లలేమో?
అందుకేనేమో
ఇటువైపు చూడనన్నా చూడవు
నాట్యమాడే నెమలిని చూస్తే
నీ సిగ పించం గుర్తొస్తోంది
ఏ వెదురు కర్రను చూసినా
నీమోహన మురళే అనిపిస్తోంది
ఓ నా స్వామీ
ఈ భ్రమలన్నీ తొలగేలా
నా కోరికలన్నీ తీరేలా
ఒక్కసారి ఒకే ఒక్క సారి
రావా..........ఇలా 16 /8 14
నిరీక్షణ
ఇంకా ఎన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళు...
ఇదిగో ఇప్పుడే వస్తానంటూ వెళ్ళావు
ఇప్పటిదాకా రాకుండా దాక్కున్నావు
నీ రాక కోసం అప్పటి నుండీ..
కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే వున్నా
ఆశను చంపుకోలేక
కదిలే మబ్బుల నడిగా
ఎగిరే పక్షుల నడిగా
నీ జాడేమైనా చెబుతాయేమో నన్న ఆకాంక్షతో
అలల సవ్వడి విన్నా
గాలి గలగలలు విన్నా
చెవులు రిక్కించుకొని
కళ్ళు విప్పార్చుకొని
మరీ మరీ చూశా
ప్చ్.......ఎప్పటిలా
మళ్ళీ నిరాశే
నాలాటి కాంత లు"అట"కోకొల్లలేమో?
అందుకేనేమో
ఇటువైపు చూడనన్నా చూడవు
నాట్యమాడే నెమలిని చూస్తే
నీ సిగ పించం గుర్తొస్తోంది
ఏ వెదురు కర్రను చూసినా
నీమోహన మురళే అనిపిస్తోంది
ఓ నా స్వామీ
ఈ భ్రమలన్నీ తొలగేలా
నా కోరికలన్నీ తీరేలా
ఒక్కసారి ఒకే ఒక్క సారి
రావా..........ఇలా 16 /8 14
No comments:
Post a Comment