From: Kattupalli Prasad <prasadyld@gmail.com>
Date: Thu, 22 Nov, 2018, 11:19 PM
Subject: Re: కార్తీకమాస వైశిష్ట్యము పై పోటీకి పద్యములు పంపుచున్నాను పరిశీలించగలరు.
To: Uma Devi Balluri <uma.balluri@gmail.com>
కార్తీకమాస వైశిష్ట్యము.
డా .బల్లూరి ఉమాదేవి.
తే.గీ:గంధ పుష్పాక్షతలతోడ కార్తికమున
హరిహరులను విడక కొల్వ హర్ష మొదవు
వనమున భుజింప నీనెలన్ పాపములవి
యెల్ల హరియించుటయు సత్య మిలనటండ్రు. : 1 :
ఆ.వె:కార్తికమున సతము కమల పుష్పములతో
కమల నేత్రు గొలువ కమ్మగాను
భాగ్యలక్ష్మి తాను వాసముండుగృహాన
యనుచు తెలిపె ఋషియు నవని పతికి. : 2 :
ఆ.వె:అవిశె పూల తోడ హరిని సేవింపంగ
యజ్ఞఫలము కలుగు నవని యందు
రంగవల్లులిడుచు రమణిమణులు కొల్వ
హరియు మెచ్చి తాను వరము లొసగు. : 3 :
ఉ.మా:
పాపము లెల్లయున్ దొలగు భక్తిని చూపుచు కార్తికంబునన్
దీపములన్ సదా విడక దేవుని ముందట నుంచి శ్రద్ధతో
బాపుము కష్టముల్ యనుచు వాసిగ వేడగ శంకరాదుల్
తాపము లెల్ల దీర్తురట ధారుణి యందున నెమ్మి తోడుతన్.
: 4 :
ఉ.మా:
మక్కువ తోడ వేకువన మానిను లెల్లరు మజ్జనాదులన్
చక్కగ చేయుచున్నచట శంకర కేశవ మూర్తులన్ సదా
యక్కర జూపి కొల్వగను యాతన లెల్లయు దీరునంచనన్
మిక్కిలి నిష్టతో సతము మేటిగ చేతురు కార్తికంబునన్.
జంధ్యాల పికిల్స్" మరియు "అచ్చంగా తెలుగు " బృందం వారు సంయుక్తముగా "కార్తీకమాస వైశిష్ట్యం" పైన పద్యములు వ్రాయమనగా రచించిన ఈపద్యములు నాస్వీయ రచనములు.దేనికి అనువాదములుగాని అనుసరణలు గానీ కావు.
చిరునామ:
చిరునామా.:
Dr.B.Umadevi /K Nandakishor
Flat no:204
3rdcross 3rdMain
SLV complex
NeAditi publicSchool
AGS Layout
BANGALORE
560061
Ph:9493846984.
No comments:
Post a Comment