9493846984
పేరు:డా.బల్లూరి ఉమాదేవి
అంశం:అత్తా కోడలు.
ఆ.వె:అత్త కోడలిలను ననవరతమ్మును
కలసి మెలసి యున్న కలుగు సుఖము
యింతులిటుల నుండ నిల్లె స్వర్గ మగును
కల్లగాదు నిజము గనుడు జనులు.
ఆ.వె:కోడలత్త యవగ కూరిమితో తాను
కూతురల్లె జూడ కోడలపుడు
నాదరించు నత్త నమ్మవోలె నెపుడు
కలత లన్న మాట కలను రాదు.
ఆ.వె:అత్త నైతి ననుచు నధికారమును చూప
ప్రేమ యనెడి మాట పేరు కైన
దొరక దనెడి మాట ధరణిలో నిక్కము
తెలిసి మసలు కొనుము తెలివి తోడ.
.ఆ.వె:అత్త కూడ తాను కొత్తగా కోడలై
మసలినట్టి వేళ మరచిపోయి
తనదు పెత్తనంబు తప్పిపోవుననుచు
తపన తోడ తాను తపన చెందు.
ఆ.వె:అత్త లేని కోడ లుత్తము రాలని
పాట పాడు వారు నాటి జనులు
అత్తలున్న మేలు నవసరంబులకౌదు
రనెడి కాలమిపుడు నరుగు దెంచె.
ఆ.వె:అత్త లనగ చెత్త యనెడి భావన హెచ్చె
తనదు తల్లి దండ్రి దైవమనుచు
అత్తగార్ల నిలను నారళ్ళు బెట్టెడి
వారి సంఖ్య పెరిగె వసుధ యందు.
ఆ.వె:కూతు లేని లోటు కోడలే తీర్చంగ
అత్త యయ్యె నమ్మ యవని యందు
మహిత వైభవమున మమత పంచ జనులు
.యబ్బుర పడి గాంతు రనవరతము.
27/8/17
,
No comments:
Post a Comment