Sunday, August 20, 2017

Fwd: హరితకవిత

---------- Forwarded message ----------
From: "Uma Devi Balluri" <uma.balluri@gmail.com>
Date: Aug 20, 2017 11:15 PM
Subject: Fwd: హరితకవిత
To: "Uma Devi Balluri" <uma.balluri@gmail.com>
Cc:

---------- Forwarded message ----------
From: "Uma Devi Balluri" <uma.balluri@gmail.com>
Date: Aug 20, 2017 11:15 PM
Subject: హరితకవిత
To: <sudheer.kamavaram@capgemini.com>
Cc:

హరిత కవితకొరకు పద్యములు.

1.ఆ.వె: చెట్లు నాటుచుండ చేదోడు నీకగు

నీరు పోసి పెంచ నీడ నొసగు

పండ్లు పూల తోడ పరిఢవిల్లుచు నుండి

హరిత హారమగును తరుల పూలు

2.ఆ.వె:మొక్క నొకటి నాటు మురిపెముతో పెంచు

నీడ నొసగి నీకు తోడు నగును

మూలమందు నీరు మురిపెముతో పోయ

తలను వంచి యొసగు ఫలము నీకు.


3.ఆ.వె:పచ్చనైన చెట్లు బాటకిరుగడల

            నాటుమయ్య పుత్ర నీటుగాను

            బాటసారులకది బాసటగా నుండి

             హరితమయము లగుచు హర్షమొసగు.


4.ఆ.వె:తరువు నొకటి నాటు తరతరములకును

        బతుకు తెరువు చూపి బాధ తీర్చు

         పచ్చనైన చెట్టు పసిడి కాంతుల తోడ

       పరవశింప జేసి ఫలము లొసగు.

5.ఆ.వె:పచ్చనైన చెట్లు భారతావనికొసగు

            నంతులేని సిరుల ననవరతము

           అగ్రదేశములకును నాదర్శ మగునట్లు

పెంచవయ్య తరులు ప్రీతి తోడ.

6.ఆ.వె:హరిత భరిత మైన  తరుసమూహములెల్ల

     యేపుగాను పెరుగ నింపుతోడ

      ప్రకృతి కాంత మనము  పరవశమొందగా

       హర్ష చిత్తులైరి యవని జనులు

7.ఆ.వె:జగతి లోని జనులు సద్భావనము తోడ

    చేయి చేయి కలిపి చెట్లు నాట

     హరిత వనము వోలె నలరారు దేశమ్ము

     పుడమి తల్లి తాను పులకరించు.


8.ఆ.వె:భావి తరములందు ప్రజల కుపకరించు

     తరులు పెంచ బ్రతుకు ధన్యమగును

      సేద తీర్చునట్టి చెట్లను గాంచుచు

        ముగ్ధులగుచు వారు మెత్తురయ్య.


9.ఆ.వె:వృక్షసంపదున్న రేడువు నీవౌదు

          లేమి యన్న మాట లేనె లేదు

          ఆంధ్ర దేశమన్న నన్నపూర్ణ యనెడి

         ఖ్యాతి నంది నట్టి ప్రాంత మిదియె.


10.ఆ.వె:ఔషధోప యుక్త మైన వృక్షములను

         విరివి గాను పెంచ విలువ పెరుగు

       దేశమునకు ఖ్యాతి దేహమునకు మేలు

      కలుగు చెట్లు పెంచి ఘనుడ వగుము..


11.ఆ.వె:బాటకిరుగడల పచ్చని చెట్లను

          నాట యలుపు దీర్చు నలుగురికవి

     చెట్లు నరుకు చుండ చేటు తప్పదటంచు

      నెరుగుమయ్య పుత్ర యిలను నీవు.

12.ఆ.వె:ప్రకృతి పరవశించ వసుధపచ్చగ నుండు
           తరులు విరుల నొసగ తావి నిండు
          చెట్లు పెంచు చుండ చేకూరు భాగ్యముల్
          చెట్లు నరుకు చుండ చెడును ప్రగతి.


No comments:

Post a Comment