డా.A P J కలాం శ్రద్ధాంజలి.
"ఎ"రుక గలవారికీతడు దైవంబు
"పి"ల్లలచే పెద్దలచే జనులందరిచే
"జే"జేలు పల్కించుకొన్న ఆరాధ్య మూర్తి
"అ"లుపెరుంగని నేత ;శత శతా
"బ్దు"లు దాటినా మరువలేని మహనీయుడు కల
"లు" కనమనితెల్పి అంతటితో నాగక
"క "లలను సాకారమొనర్చు కొనంగ
"లా"లిత్యము తోడప్రోత్సహించిన భరత మాత
"ము"ద్దుబిడ్డ డితడు అందరము సవినయము
"గా "నర్పింతుము రండు మిత్రులార వా
"రి "నిండిన నేత్రములతోడ గద్గద స్వరమున వీరి
"కి" శ్రద్ధాంజలి ఘటింతుమిచట.
"పి"ల్లలచే పెద్దలచే జనులందరిచే
"జే"జేలు పల్కించుకొన్న ఆరాధ్య మూర్తి
"అ"లుపెరుంగని నేత ;శత శతా
"బ్దు"లు దాటినా మరువలేని మహనీయుడు కల
"లు" కనమనితెల్పి అంతటితో నాగక
"క "లలను సాకారమొనర్చు కొనంగ
"లా"లిత్యము తోడప్రోత్సహించిన భరత మాత
"ము"ద్దుబిడ్డ డితడు అందరము సవినయము
"గా "నర్పింతుము రండు మిత్రులార వా
"రి "నిండిన నేత్రములతోడ గద్గద స్వరమున వీరి
"కి" శ్రద్ధాంజలి ఘటింతుమిచట.
అశ్రునివాళి:
మనదేశ ప్రథమ పౌరుడుగా నుండి వేలాది మందికి స్ఫూర్తి ప్రదాతగా నిల్చిన మహామనీషి భారతరత్న డా.APJకలాం గారు కీర్తిశేషులవడం బాధాకరమైన విషయం.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ అమెరికాలోమేమున్న ఈ డల్లాస్ నగరంలో వున్న గాంధీ పార్క్ లోఈరోజు 27/7/15 రాత్ర 8 30 ప్రాంతంలో TV 5 మరియు తెలుగు అసోసియేషన్ వారు శ్రీ కలాం గారికి సంతాపసభ యేర్పాటు చేశారు.ఆ సభలో వారిని గూర్చి మాట్లాడే అవకాశం కల్గింది.వారిని గూర్చి నేను వ్రాసిన పద్యాలు వన్పించిన సంగతులు మిత్రలతో పంచుకోవాలని---------
1 ఆ.వె: భరతమాత గన్నభాగ్యవంతుడితడు
సాటి లేని మేటి శాస్త్ర వేత్త
విద్య పంచి నట్టి విఙ్ఞాన మూర్తిగా
యితని పొగడ తరమె యేరి కైన.
సాటి లేని మేటి శాస్త్ర వేత్త
విద్య పంచి నట్టి విఙ్ఞాన మూర్తిగా
యితని పొగడ తరమె యేరి కైన.
2.ఆవె: నింగి కెగసి నాడు నేడొక్క ధీశాలి
కదలి సాగి నాడు ఘనత తోడ
స్వర్గ మందు పంచ శాస్త్ర విఙ్ఞానమ్ము
యరగినాడు వేగ నమర పురికి.
3.ఆ.వె:.అంతరిక్షమందు నపురూపముగ వెల్గ
సాగినాడు గాదె సాధు శీలి
ఒదిగి వున్న కొద్ది ఎదుగు ననెడి రీతి
స్ఫూర్తి దాత యైన సూరి యితడు.
4.ఆ.వె: భరత జాతి నోము ఫలమె యీధీశాలి
అలుపెరుగని యట్టి యమృత మూర్తి
విద్య నేర్వ మంచు విద్యార్థులకు దెల్పి
వారి మధ్య లోనె బాసె నసువు.
కదలి సాగి నాడు ఘనత తోడ
స్వర్గ మందు పంచ శాస్త్ర విఙ్ఞానమ్ము
యరగినాడు వేగ నమర పురికి.
3.ఆ.వె:.అంతరిక్షమందు నపురూపముగ వెల్గ
సాగినాడు గాదె సాధు శీలి
ఒదిగి వున్న కొద్ది ఎదుగు ననెడి రీతి
స్ఫూర్తి దాత యైన సూరి యితడు.
4.ఆ.వె: భరత జాతి నోము ఫలమె యీధీశాలి
అలుపెరుగని యట్టి యమృత మూర్తి
విద్య నేర్వ మంచు విద్యార్థులకు దెల్పి
వారి మధ్య లోనె బాసె నసువు.
No comments:
Post a Comment